Happy Birthday Keerthi Suresh : 'మహానటి' సినిమాతో ఈ తరం హీరోయిన్లలో తన ప్రత్యేకతను చాటుకున్న కీర్తి సురేశ్ 32వ వసంతంలోకి అడుగుపెట్టారు. జయాపజయాలు పక్కకుపెట్టి ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటూ సక్సెస్ సాధిస్తామనే నమ్మకంతో కెరీర్‌లో ముందుకెళ్తుంటారు.
'పైలట్స్' అనే మళయాల సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ రంగ ప్రవేశం చేశారు కీర్తి. నటులు సురేశ్ కుమార్, మేనకల కుమార్తె కావడంతో ఈ అవకాశం ఆమెకు సులువుగానే వచ్చింది. ఈ మూవీ తర్వాత మరో రెండు సినిమాల్లోనూ నటించారు కూడా. ఆ తర్వాత చదువు పూర్తి చేసుకుని పూర్తి సినిమా రంగంలోనే సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు కీర్తి.
మూడు సినిమాలల్లో హీరోయిన్‌గా ఎంపికై, అనంతరం ఆ చిత్రాల షూటింగ్‌లు ఆగిపోవడంతో లాంచింగ్ కష్టమైంది. ఎట్టకేలకు మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన 'గీతాంజలి'తో హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. అందులో గీత, అంజలి అనే డ్యూయెల్ రోల్స్ చేసి శభాష్ అనిపించుకున్నారు. 'గీతాంజలి' సక్సెస్ తర్వాత 'రింగ్ మాస్టర్' మోస్తారు పేరు మాత్రమే తెచ్చిపెట్టింది.
తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత మళ్లీ కష్టాలే. తొలి తమిళ సినిమా 'ఇదు ఎన్న యామమ్' ప్లాప్. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ చేసిన తొలి సినిమా 'రెండు జళ్ల సీత' వాయిదా పడుతూనే ఉంది. అలా మూడు పరిశ్రమల్లోనూ మంచి విజయం అందుకోలేకపోవడంతో కీర్తి సురేశ్ ఐరన్ లెగ్ అంటూ ఇండస్ట్రీలో పుకార్లు మొదలయ్యాయి.
ప్రయత్నాలు ఆపని కీర్తి - రామ్ హీరోగా తెరకెక్కిన 'నేను శైలజ'తో మంచి సక్సెస్ అందుకున్నారు కీర్తి సురేశ్. అంతే టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ నుంచి కూడా ఆమెను వెతుక్కుంటూ అవకాశాలు పరిగెత్తుకొచ్చాయి. అలా కమర్షియల్ సినిమాలు చేస్తున్న సమయంలో డైరక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి చేసి నేషనల్ అవార్డును అందుకుంది.
అనంతరం నటించిన 'సామి స్క్వేర్', 'పందెం కోడి 2', లేడి ఓరియెంటెడ్ ఫిల్మ్స్ అయిన 'పెంగ్విన్', 'మిస్ ఇండియా', 'గుడ్ లక్ సఖి' సినిమాలు అంతగా సక్సెస్ సాధించలేదు. ఆ తర్వాత 'దసరా', 'మామన్నన్'తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు. రీసెంట్‌గా 'సైరన్', 'రఘు తాత' సినిమాల్లో కనిపించిన కీర్తి, 'రివాల్వర్ రీటా', 'కన్నివేడి', 'ఉప్పు కప్పురంబు' సినిమాల షూటింగుల్లో బిజీగా ఉన్నారు. ఇవే కాకుండా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ 'బేబీ జాన్' అనే హిందీ సినిమాలో నటిస్తున్నారు.
కీర్తి కెరీర్‌లో టాప్ సినిమాలు(Keerthi Suresh Top Movies) - రొటీన్‌కు భిన్నంగా కెరీర్‌లో ఎప్పుడూ కొత్త పాత్రల కోసం పరితపించే కీర్తి సురేశ్‌ను ఈ సినిమాలు మాత్రం ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని తెచ్చిపెట్టాయి. ఇధు ఎన్నా మాయం (2015), రింగ్ మాస్టర్ (2014), నేను శైలజ (2016), రజినీమురుగన్ (2016), రెమో (2016), బైరవా (2017), నేను లోకల్ (2017), సర్కార్ (2018), తానా సెరిందా కూట్టమ్ (2018), మహానటి (2018), మిస్ ఇండియా (2021), సర్కారు వారి పాట (2022) చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
నెట్ వర్త్ ఎంతంటే?(Keerth Suresh Networth Luxury Life) - అభినయం, అందంలోనే కాదు కీర్తి సురేశ్‌కు నెట్ వెర్త్ కూడా బానే ఉంది. ఒక్కో సినిమాకు రూ.4 కోట్లు, ఒక యాడ్ కోసం రూ.30 లక్షలు, సోషల్ మీడియాలో ఒక పోస్టు కోసం రూ.25 లక్షలు ఛార్జ్ చేస్తుంటారట. ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ రూ.41 కోట్లకు పైమాటే అని ఇంగ్లీష్ కథనాల్లో రాసి ఉంది. ఎక్కువగా ఆమె యాక్టింగ్, ఎండోర్స్మెంట్లు, బ్రాండ్ డీల్స్ ద్వారా సంపాదిస్తారట.
విలాసవంతమైన ఇల్లు - చెన్నైలో కీర్తి సురేశ్‌కు ఒక ఇల్లు ఉందట. ఇక్కడ ఆమె తన తల్లి దండ్రులతో కలిసి ఉంటారు. హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో కూడా ఒక లగ్జరీ అపార్ట్ మెంట్ ఉందట.
కార్ కలెక్షన్స్ - కీర్తి గ్యారేజ్‌లో రూ.60 లక్షల విలువ చేసే Volvo S90, రూ.1.38 కోట్లు విలువ చేసే BMW 7 Series 730Ld , రూ.81లక్షల విలువ చేసే Mercedes Benz AMG GLC43, రూ.25లక్షల Toyota Innova Crysta సహా పలు కార్లు ఉన్నాయట.
ముంబయి, కేరళలో విలాసవంతమైన బంగ్లాలు, బోలెడన్నీ లగ్జరీ కార్లు! - పృథ్వీరాజ్ సుకుమారన్ లైఫ్‌స్టైల్