Hanuman OTT : ఈ సంక్రాంతికి చిన్న చిత్రంగా వచ్చి పాన్ రేంజ్లో భారీ విజయాన్ని అందుకున్న హనుమాన్ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన 66 రోజుల తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్ వేదికగా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 వేదికగా ఆదివారం ఉదయం నుంచి తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. అలాగే జియో సినిమాలో హిందీ వెర్షన్ కూడా వచ్చేసింది. మార్చి 16 అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఆ మధ్య ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లే ఈ చిత్రాన్ని చూసేందుకు వీలు ఉంటుందని ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా జియో సినిమా ఓటీటీలో హనుమాన్ను వీక్షించవచ్చని తెలుస్తోంది. త్వరలోనే కన్నడ, తమిళం, మలయాళం భాషల్లోనూ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. కాగా, హనుమాన్ ఓటీటీలోకి రావడంపై పలువురు సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్లైమాక్స్ సీన్ విజువల్స్ షేర్ చేసి సినిమా అద్భుతం, ఎట్టకేలకు సినిమాను చూసేశాం, తేజ సజ్జా అదరగొట్టాడు, ఈ ఒక్క సీన్ చాలు సినిమా సూపర్ అంటూ సోషల్ మీడియా వేదికగా తెగ కామెంట్స్ పెడుతున్నారు.
Prasanth Varma Hanuman Movie : అ!, కల్కి, జాంబిరెడ్డి చిత్రాల ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ హనుమాన్ సినిమాకు దర్శకత్వం వహించారు. యంగ్ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా నటించారు. సూపర్‌హీరో స్టోరీకి ఇతిహాస పురణాలను ముడిపెట్టి తీర్చిదిద్దారు. వరలక్ష్మి శరత్‌కుమార్, అమృతా అయ్యర్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. వరలక్ష్మీ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. జనవరి 12వ తేదీన ఈ సంక్రాంతికి ఇతర బడా చిత్రాలతో పోటీగా హనుమాన్ రిలీజైంది. అతి తక్కువ బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా తెలుగు, హిందీ సహా రిలీజైన ఇతర భాషల్లోనూ భారీగా వసూళ్ల వర్షాన్ని కురిపించింది. దాదాపు రూ.300 కోట్లకు (Hanuman Movie Collections)పైగా కలెక్షన్లను సంపాదించింది.
-
POV: ME IN MY DREAMS.#HanuMan #JaiShreeRam pic.twitter.com/wdcMhsmxam
— Vamshi (@Bairoju_vamshi) March 17, 2024
పునీత్ రాజ్ కుమార్ జయంతి - టాలీవుడ్ స్టార్స్ చిరు టు ఎన్టీఆర్‌తో స్వీట్ మెమరీస్!
బాక్సాఫీస్ దగ్గర సినిమా ఫ్లాప్ - దివాలా తీసిన ప్రముఖ దర్శకుడు