Guntur Kaaram OTT: సూపర్‌స్టార్ మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబో సంక్రాంతికి రిలీజైన గుంటూరు కారం ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ఓటీటీ ప్లాట్‌ఫామ్ భారీ మొత్తానికి దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్, శుక్రవారం (ఫిబ్రవరి 9) నుంచి స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంచింది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైన ఈ సినిమా విడుదలైన 28 రోజుల్లోనే ఓటీటీలోకి రావడం విశేషం.
Guntur Karam Worldwide Collection: బాక్సాఫీస్ వద్ద డీసెంట్ టాక్ దక్కించుకున్న ఈ సినిమా కలెక్షన్లలోనూ జోరు ప్రదర్శించింది. వరల్డ్‌వైడ్‌గా ఈ మూవీ రూ. 275+ కోట్లు వసూల్ చేసింది. దీంతో మహేశ్ కెరీర్లో మూడోసారి రూ.200+ గ్రాస్ అందుకున్నారు. అటు ఓవర్సీస్లోనూ గుంటూరు కారం భారీ స్థాయిలో కలెక్షన్లు అందుకుంది.
Guntur Kaaram Cast:ఈ సినిమాలో మహేశ్‌కు జోడీగా యంగ్ బ్యూటీ శ్రీలీల నటించగా, మీనాక్షి చౌదరి కీ రోల్ ప్లే చేసింది. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ, ఈశ్వరి రావు తదితరులు ఆయా పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించారు. కాగా, హారికా అండ్ హసిన్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నాగవంశీ ఈ సినిమా నిర్మించారు.
Captain Miller OTT Release: కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ లేటెస్ట్ మూవీ 'కెప్టెన్ మిల్లర్' కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమాకు అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వం వహించారు. మూవీలో ధనుశ్కు జోడీగా ప్రియాంకా అరుళ్ మోహన్ నటించగా, స్టార్ నటులు శివ కుమార్, సందీప్ కిషన్, నివేధిత సతీశ్, నాజర్ వినాయకన్ తదితరులు ఆయా పాత్రలు పోషించారు. సత్య జ్యోతి ఫిల్మ్స్ బ్యానర్‌పై సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ ఈ చిత్రం నిర్మించారు. . సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజైంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'గుంటూరు కారం' ఎఫెక్ట్ - త్రివిక్రమ్‌కు ఆ మాట ఇచ్చిన మహేశ్!