Govind Padmasoorya Marriage : 'అలవైకుంఠపురం', బంగార్రాజు లాంటి సూపర్ హిట్ సినిమాల ద్వారా టాలీవుడ్లో పాపులరయ్యారు మలయాళ స్టార్ హీరో గోవింద్ పద్మసూర్య. చేసింది తక్కువ రోల్సే అయినప్పటికీ తన నటనతో మంది ఫాలోయింగ్ పెంచుకున్నారు. అయితే తాజాగా ఆయన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గోపిక అనే సీరియల్ నటి మెడలో ఆయన మూడు ముళ్లు వేశారు. కేరళలోని వడక్కునాథన్ ఆలయంలో అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. దీన్ని చూసిన అభిమానులు ఈ కొత్త జంటకు కంగ్రాజ్యులేషన్స్ తెలిపుతున్నారు. వీటితో పాటు ఈ క్యూట్ కపుల్‌కు సంబంధించిన మరికొన్ని ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
మరోవైపు వీళ్లది పెద్దలు కుదుర్చిన సంబంధమంటూ గోవింద్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. గతేడాది అక్టోబరులో వీరి ఎంగేజ్మెంట్ వేడుక గ్రాండ్‌గా జరిగింది. దీనికి మలయాళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల హాజరై సందడి చేశారు.
ఇక గోవింద్ కెరీర్ విషయానికి వస్తే - మలయాళ ఇండస్ట్రీలో పలు సూపర్ క్యారెక్టర్లు చేసిన ఆయన 'డాడీ కూల్', '72 మోడల్', 'ప్రేతమ్', 'ప్రేతమ్ 2' లాంటి మాలీవుడ్ సినిమాల్లో మెరిసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 'అల వైకుంఠపురంలో' సినిమాలో విలన్ కుమారుడిగా కనిపించిన ఆయన తొలి సినిమాలోనే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెరిసి తెలుగు ఆడియెన్స్‌ను అలరించారు.
Govind Padmasoorya Telugu Movies : ఆ తర్వాత 'బంగార్రాజు' సినిమాలోనూ విలన్ రోల్లో మెరిసి మంచి మార్కులు కొట్టేశారు. దీంతో ఆయనకు టాలీవుడ్లో వరసు ఆఫర్లు వచ్చాయి. అలా 'మీట్ క్యూట్', 'లైక్ షేర్ సబ్‌స్క్రైబ్' మూవీస్‌లో కీలక పాత్రలు పోషించారు. అయితే ఈయన సినిమాల్లోనే కాకుండా టీవీ ప్రోగ్రాంస్కు హోస్ట్‌గా వ్యవహరిస్తూ మాలీవుడ్‌లో పాపులరయ్యారు. సినిమాల్లోకి రాకముందు గోవింద్ పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ మెరిశారు. ప్రస్తుతం అటు సినిమాల్లో బిజీగా ఉంటూనే ఇటు బుల్లితెరపై హోస్ట్‌గానూ అదరగొడుతున్నారు. అంతే కాకుండా సొంత యూట్యుబ్ ఛానల్లో మంచి మంచి కంటెంట్ పోస్ట్ చేస్తూ నెట్టింట ట్రెంట్ అవుతుంటారు.
దిగ్గజ హీరో కుమార్తె వివాహానికి ప్రధాని మోదీ- వారికి బిగ్ సర్ప్రైజ్
అక్కనే మించిపోయేలా - సాయిపల్లవి సిస్టర్ తీన్మార్ డ్యాన్స్!