ETV Bharat / entertainment

రొటీన్​ సినిమాలతో బోర్ కొట్టేసిందా? హారర్ వెబ్​సిరీస్​ లిస్ట్ ఇదిగో- ఎంటర్​టైన్​మెంట్ పక్కా! - Famous OTT Webseries

Famous Horror Web Series List: కొందరు రొమాంటిక్​ సినిమాలు చూడటానికి ఇష్టపడితే, మరికొందరు హారర్​ మూవీస్​, వెబ్​ సిరీస్​లను వీక్షించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. వీరికోసమే పలు రకాల హారర్​ వెబ్​సిరీస్​లు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తుంటాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వివిధ ఓటీటీ ప్లాట్​ఫామ్స్​లో స్ట్రీమ్​ అవుతున్న కొన్ని ఫేమస్​ వెబ్​సిరీస్​ల లిస్ట్ ఇక్కడ చూద్దాం

Famous Horror Web Series List
Famous Horror Web Series List
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 26, 2024, 6:30 PM IST

Famous Horror Web Series List: సాహసాలు చేసేవారు కొందరైతే, వాటిని చూసేవారు మరికొందరు. ఇందులో భాగంగా పుట్టుకొచ్చినవే హారర్​ సినిమాలు, వెబ్​సిరీస్​లు. కొన్ని నిజజీవితంలో ఎదురయ్యే సంఘటనలతో తెరకెక్కితే మరికొన్ని కల్పితాల ద్వారా ప్రేక్షకులను అలరిస్తాయి. ఓటీటీల్లో ప్రస్తుతం వీటికి విశేషమైన ఆదరణ ఉంది. మరి పలు ఓటీటీ వేదికల్లో స్ట్రీమ్​ అవుతున్న కొన్ని ఫేమస్​ హారర్​ వెబ్​సిరీస్​లేంటి? అవి ఏ ఓటీటీ ప్లాట్​ఫామ్​లో స్ట్రీమ్ అవుతున్నాయో తెలుసుకుందాం.

ఘౌల్​
సూపర్‌ నేచురల్​ థ్రిల్లర్​గా ఘౌల్​ హారర్​ వెబ్​ సిరీస్​ను మూడు ఎపిసోడ్‌లలో తెరకెక్కించారు. 2018 ఆగస్టులో విడుదలైన ఈ సిరీస్​ నె‌ట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్​ అవుతోంది. ఇందులో బోల్డ్​ బ్యూటీ రాధికా ఆప్టే ఇంటరాగేషన్​ ఆఫీసర్​గా కీలక పాత్ర పోషించింది. కథ మొత్తం ఓ సీక్రెట్ జైలులో ఇంటరాగేషన్‌ రూపంలో సాగుతుంది. విచారణలో రాధికా ఖైదీల నుంచి నిజాలు రాబడుతుంది. ఈ క్రమంలో జరిగే పరిణామాలే ఘౌల్​ పూర్తి కథాంశం.

Famous Horror Web Series List
ఘౌల్​ వెబ్​సిరీస్​

బేతాల్
అతీంద్రియ శక్తుల అంశాల మిళితంతో ఓ మారుమూల పల్లెటూరి నేపథ్యంలో సాగే జానపద కథలతో తెరకెక్కిన హారర్​-థ్రిల్లర్​ వెబ్​సిరీస్​ బేతాల్​. దీనికి పాట్రిక్​ గ్రాహం దర్శకత్వం వహించారు. నిఖిల్​ మహాజన్​ కో-డైరెక్టర్​గా వ్యవహరించారు. రెడ్​ చిల్లీస్​ ఎంటర్‌టైన్‌మెంట్​ సంస్థ బేతాల్​ను నిర్మించింది. వినీత్​ కుమార్​ సింగ్​, అహానా కుమ్రా, సుచిత్రా పిళ్లై, జితేంద్ర జోషి కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Famous Horror Web Series List
బేతాల్ వెబ్​సిరీస్​

ది వాకింగ్​ డెడ్​
చార్లీ అడ్లార్డ్​, టోనీ మూర్​, రాబర్ట్​ కిర్క్‌మాన్​ కలిసి రూపొందించిన కామిక్​ బుక్​ సిరీస్​ 'ది వాకింగ్​ డెడ్​'. జోంబీ వ్యాప్తితో నాశనమైన ప్రపంచంతో 'ది వాకింగ్ డెడ్​' సిరీస్​ ప్రారంభమవుతుంది. మరణించాక నడిచే శవాలను వాకర్స్​గా పిలుస్తారు. దీని ఆధారంగానే వెబ్​సిరీస్​కు ది వాకింగ్​ డెడ్​ అని పేరు పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన ఈ ఫేమస్​ వెబ్​సిరీస్​ నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్​ అవుతోంది.

Famous Horror Web Series List
ది వాకింగ్​ డెడ్​ వెబ్​సిరీస్​

అధుర
బోర్డింగ్​ స్కూల్ బ్యాక్​గ్రౌండ్​లో సూపర్ నేచురల్ థ్రిల్లర్‌ జానర్‌లో రిలీజైన ఫేమస్​ హారర్​ వెబ్​సిరీస్​ 'అధుర'. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సిరీస్​కు అనన్య బెనర్జీ, గౌరవ్​ కే చావ్లా దర్శకత్వం వహించారు. ఇష్వాక్​ సింగ్, రసిక దుగ్గల్​, శ్రేనిక్​ అరోరా, రాహుల్​ దేవ్​ కీలక పాత్రల్లో నటించారు. ఎవరూ ఊహించని ట్విస్టులతో అస్సలు స్టోరీ థీమ్​కు సంబంధం లేకుండా అనేక మలుపులతో సాగే ఈ మూవీ చూపరులను పీక్​ స్టేజ్​కు తీసుకెళ్తుంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్​ ప్రైమ్​ వీడియోలో ప్రస్తుతం 'అధుర' వెబ్​సిరీస్​ స్ట్రీమ్ అవుతోంది.

Famous Horror Web Series List
అధుర వెబ్​సిరీస్​

టైప్‌రైటర్​
టైప్‌రైటర్​- హిందీ వెబ్​సిరీస్​. సుజోయ్​ ఘోష్​ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్​లో రహస్యమైన ప్రదేశంలో ఉన్న ఓ పాత బంగ్లాను రీసెర్చ్ చేయడానికి ఓ గోస్ట్ హంటర్​ టీమ్ వెళ్తుంది. ఈ విల్లాలో దాగిఉన్న చీకటి రహస్యాలను బయటపెట్టేందుకు వెళ్లిన వీరికి ఎటువంటి సంఘటనలు ఎదురయ్యాయి? వీటితో వారు ఏ రకంగా భయపడ్డారు? వాటిని ఎలా ఎదుర్కున్నారు. వీటి ఆధారంగా టైప్​రైటర్​ను తెరకెక్కించారు. పలోమీ ఘోష్​, పురబ్​ కోహ్లి, సమీర్​ కొచ్చర్​ ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ నెట్​ఫ్లిక్స్‌లో ఈ సిరీస్​ స్ట్రీమింగ్ అవుతోంది.

Famous Horror Web Series List
టైప్‌రైటర్​ వెబ్​సిరీస్​

గెహ్రైయాన్​
సిధాంత్​ సచ్‌దేవ్​ దర్శకత్వం వహించారు. ఈ హర్రర్​ వెబ్​సిరీస్‌లో సంజీదా షేక్​, వత్సల్ షేత్​, రాధికా బంగియా సహా ఇతర నటులు మెరిశారు. బెంగుళూరులో జరిగిన ఒక బాధాకరమైన సంఘటన తరువాత రేనా అనే యువతి తన కెరీర్‌పై ఏ విధంగా దృష్టి సారించింది. ఇందుకోసం ముంబయికే ఎందుకు వెళ్తుంది. ఇక్కడ కొత్త లైఫ్​ ప్రారంభించిన ఆమెకు ఎదురయ్యే వింత సంఘనటల నుంచి ఆమె ఎలా బయట పడుతుంది అనే ఆధారంగా గెహ్రైయాన్​ను​ తెరకెక్కించారు. ఈ సిరీస్​ ఓటీటీ జియో సినిమాలో స్ట్రీమింగ్​ అవుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

చిరు@155- మెగాస్టార్​కు​ నచ్చిన టాప్-10 మూవీస్​ ఇవే

ధనుష్​ కూడా తప్పని తిప్పలు- ఆ విషయంలో ఏకంగా ఏడ్చేశారట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.