Rajamouli Baahubali crown of blood : ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమా సత్తా ఏంటో చూపింది బాహుబలి సిరీస్. వరల్డ్ బాక్సాఫీస్ ముందు భారీ వసూళ్లను సాధించింది. అయితే ఇప్పుడీ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరిన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ చేసేందుకే యానిమేషన్ సిరీస్‌ను తీసుకొస్తున్నామని తెలిపారు దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా మే 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ప్రెస్మీట్లో పాల్గొన్న జక్కన్న బాహుబలి గురించి మరిన్ని విశేషాలు తెలిపారు.
ఈ క్రమంలోనే ఆయనకు ఓ వింత ప్రశ్న ఎదురైంది. "ఈ యానిమేటెడ్ సిరీస్ చూస్తుంటే ఒక బ్లాక్ బస్టర్ బ్రాండ్‌ను జక్కననే స్వయంగా కిల్ చేస్తున్నట్లు అనిపించింది. దానికి మీరేం చెబుతారు?" అని అడగగా రాజమౌళి తనదైన శైలిలో సమాధానమిచ్చారు. దీనికి జక్కన్న మాట్లాడుతూ తాను అలా అనుకోవడం లేదని చెప్పుకొచ్చారు. లెట్స్ వెయిట్ అండ్ సీ అని అన్నారు. "మీరు ఇంకా ఫిలిం గ్లాసెస్‌తోనే చూస్తున్నారు అనుకుంటున్నాను. యానిమేటెడ్ గ్లాసెస్‌తో చూస్తే మీకు అలా అనిపించకపోవచ్చని అనుకుంటున్నాను" అని పేర్కొన్నారు.
వాళ్లూ ధోనీ ఫ్యాన్సేమో - "బాహుబలి మొఖం అయితే ధోనీ పోలికలతో కనిపిస్తున్నాయి, మీకు మహీ అంటే ఇష్టం కాబట్టి ఆయన ముఖంతోనే క్యారెక్టర్ డిజైన్ చేశారా" అని అడగగా - "అది కావాలని చేసింది కాదు. క్రియేట్ చేసిన వాళ్లు నాలాగా మహీ అభిమానులేమో.(నవ్వులు) మన కథను మరింత ముందుకు తీసుకెళ్లాంటే, దానిపై మనకున్న ఈగోను, ప్రేమను తగ్గించాలి. అన్నీ మనమే చేయలేం. అందుకే ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. కథలోని సోల్‌ను తప్ప ఇతర విషయాలేమీ పట్టించుకోకూడదు. కథా రచన, డైరెక్షన్, డబ్బింగ్ ఇతరవన్నీ క్రియేటర్స్ సృజనకే వదిలేయాలి." అని జక్కన్న చెప్పుకొచ్చారు.
ఇంకా ఈ ఈవెంట్లో జక్కన్న మాట్లాడుతూ హాలీవుడ్ దర్శకుల్లా తనకూ పూర్తి స్థాయిలో యానిమేషన్ మూవీ చేయాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు. ఈగ చిత్రం అందులోని భాగమే అని తెలిపారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'ఆర్ఆర్ఆర్' రీ రిలీజ్- ఈసారి 3Dలో కూడా- ఇక థియేటర్లలో మాస్ జాతరే - RRR Re Release
'ఎన్టీఆర్ నా ఫ్రెండ్ కాదు - వాళ్లే నా స్నేహితులు' - Rajamouli NTR