Mithun Chakraborty Dadasaheb Phalke : భారత్‌లో సినీ రంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రధానమైనది. ఈ ఏడాది ఈ అవార్డుకు బాలీవుడ్ లెజండరీ నటుడు, భాజపా నేత మిథున్ చక్రవర్తి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. అక్టోబర్ 8న జరగనున్న 70వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఆయన అందుకోనున్నారు. ఈ విషయాన్ని యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ట్వీట్ ద్వారా తెలిపారు.
"దాదా సాహెభ్ ఫాల్కే సెలక్షన్ జ్యూరి ఈ అవార్డును లెజండరీ యాక్టర్ మిథన్ చక్రవర్తికి అందించాలని నిర్ణయించుకుంది. ఇండియన్ సినిమాకు ఆయన అందించిన సేవలకుగానూ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందించనుంది. 70వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమంలో మిథున్ ఈ అవార్డును అందుకోనున్నారు." అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు.
Mithun Chakraborty Career : మిథున్ చక్రవర్తి ఈ పేరు చెబితే చాలా మంది టక్కున గుర్తు పట్టకపోవచ్చు కానీ, ఐ యామ్ ఏ డిస్కో డ్యాన్సర్ సాంగ్ అనగానే సినీ ప్రియులంతా దాదాపుగా గుర్తు పట్టేస్తారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 74 ఏళ్ల మిథున్ గత కొన్ని దశాబ్దాలుగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. 1982లో వచ్చిన డిస్కో డ్యాన్సర్‌తో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బెంగాలీ, హిందీ, ఒడిశా, భోజ్‌పురి, తమిళ్, కన్నడ, పంజాబీలో దాదాపు 350కు పైగా సినిమాల్లో నటించారు. ఈయన కెరీర్లో భారీ బ్లాక్ బస్టర్లతో పాటు ఫ్లాపులు బానే ఉన్నాయి. ఈయన నటించిన దాదాపు 180 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరిగ్గా ఆడలేదట. ఇందులో 133 ఫ్లాపులు, 47 డిజాస్టర్లు ఉన్నాయట
టాలీవుడ్‌కు పరిచయమే - తెలుగు ప్రేక్షకులకు కూడా ఈయన సుపరిచతమే. పవన్ కల్యాణ్ గోపాల గోపాల సినిమాలో స్వామీజీగా నటించి మెప్పించారు. రాజకీయాలపై ఆసక్తితో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి 2014లో రాజ్యసభకు కూడా వెళ్లారు. కానీ రెండేళ్లకే ఆ పదవికి రాజీనామా చేసి భాజపాలో చేరారు.
కెరీర్లోలో 180 ఫ్లాపులు! - అయినా ఇప్పటికీ ఆ హీరో సూపర్ స్టారే! - Most Flops Hero