ETV Bharat / entertainment

బాప్​రే, రూ.105 కోట్ల డ్రెస్​తో బాలయ్య బ్యూటీ హంగామా! - ఫోటోస్ చూశారా? - Cannes film festival 2024 - CANNES FILM FESTIVAL 2024

Cannes film festival 2024 Urvashi Rautela : బాలయ్య ఎన్​బీకే 109లో కీలక పాత్ర పోషిస్తున్న ఊర్వశి రౌతేలా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్​లో మంట పుట్టించింది. ఏకంగా రూ.105 కోట్ల విలువగల రెండు డ్రెస్​లను ధరించి అందర్నీ షాక్​కు గురి చేసింది.

Source ANI
urvashi rautela (Source ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 25, 2024, 8:35 AM IST

Cannes film festival 2024 Urvashi Rautela : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్​ ప్రస్తుతం అట్టహాసంగా సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సినీ తారలంతా కళ్లు చెదిరే డ్రెసుల్లో తమ అందాలను ఆరబోస్తూ ఈ రెడ్​ కార్పెట్​పై మెరుస్తుంటారు. వీరిలో భారత సినీ నటుల తళుకు బెళుకులు ఉంటాయి. అయితే రెడ్​ కార్పెట్​పై మెరిసిన ఇండియన్ హీరోయిన్స్​లో ఊర్వశి రౌతేలా మాత్రం అందరినీ షాక్​కు గురి చేసింది. ఆమె ఏకంగా రూ.105 కోట్ల విలువగల రెండు డ్రెస్సులను ధరించి ఆశ్చర్యపరిచింది.

పూర్తి వివరాల్లోకి వెళితే - ఈ సారి రెడ్​ కార్పెట్​పై అందాల తార ఐశ్వర్య రాయ్​తో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కియారా అద్వానీ, అదితి రావ్ హైదరీ, శోభితా ధూళిపాళ్ల, 11 ఏళ్ల తర్వాత తొలిసారి ప్రీతి జింటా సహా పలువురు మెరిశారు. అయితే వీరందరూ ఒకెత్తైతే ఊర్వశి రౌతేలా మాత్రం మరో లెవల్ అనిపించింది. రెండు రోజుల పాటు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై మెరిసిన ఈ ముద్దుగుమ్మ తొలిరోజు ఓ పింక్ గౌన్​ ధరించింది. దీని ధర రూ.47 కోట్ల అని కథనాలు వస్తున్నాయి. మరి కొంతమంది రూ.7కోట్లు అని కూడా అంటున్నారు.

కేన్స్ నాలుగో రోజు వేడుకలోనూ మరింత ఖరీదైన డ్రెస్​లో కనిపించి ఆశ్చర్యపరిచింది ఊర్వశి రౌతేలా. బ్లాక్ అండ్ వైట్ కస్టమ్ మేడ్ డ్రెస్ ధరించింది. దీని ధర ఏకంగా రూ.58 కోట్లు అని చెబుతున్నారు. అలా ఈ రెండు డ్రెస్సులు కలిపి రూ.105 కోట్లు అని ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. ఆ మధ్య కూడా తన పుట్టినరోజు సందర్భంగా ఏకంగా రూ.3.5 కోట్ల రూపాయల కేక్ కట్ చేసి అందర్నీ షాక్​కు గురి చేసింది రౌతేలా. ప్రస్తుతం ఈ మద్దుగుమ్మ తెలుగులో బాలయ్య ఎన్​బీకే 109సినిమాలోని ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

ఇంకా ఈ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కియారా అద్వానీ పింక్ అండ్​ బ్లాక్ డ్రెస్​లో సందడి చేసింది. అయితే ఆమె ధరించిన రూ.30 కోట్ల నెక్లెస్ స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచింది. 11 ఏళ్ల తర్వాత కేన్స్​లో కనిపించిన ప్రీతి జింటా రూ.5.5 లక్షల డ్రెస్ ధరించింది. ఐశ్వర్య రాయ్ రూ. 1.8 లక్షల విలువైన కార్డెలియా జంప్‌సూట్​లో దర్శనమిచ్చింది.

ఐదుగురు భార్య‌ల‌తో భ‌ర్త హ‌నీమూన్ ప్లాన్​ - ఆసక్తి రేకెత్తిస్తోన్న​ ఈ సిరీస్ స్ట్రీమింగ్ ఎక్కడంటే? - Nagendrans Honeymoons

'హీరో కన్నా ముందు మొదట అలా అవ్వాలనుకున్నాను!' : బాలకృష్ణ - Sathyabhama Trailer

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.