Aparna Balamurali Interview : 'ఆకాశం నీ హద్దురా' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది మలయాళ బ్యూటీ అపర్ణా బాలమురళి. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి అనతికాలంలోనే అందరిని మెప్పించింది అపర్ణ. నేచురల్ యాక్టింగ్‌తో పక్కింటి అమ్మాయిగా కనిపిస్తుంటుంది. పలు మలయాళం, తమిళ సినిమాల్లో మెరిసిన ఈమె త్వరలో 'రాయన్'తో మరోసారి తన ట్యాలెంట్‌ను చూపించేందుకు రెడీగా ఉంది. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో ఆమె చాలా బొద్దుగా ఉండేది. దీని కారణంగా తానూ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకుని ఎమోషనలైంది.
"మొదట్లో చాలా సన్నగానే ఉండేదాన్ని. కానీ, ఆ తర్వాత అనుకోకుండా లావయ్యాను. దాంతో 'మీకు అమ్మ పాత్రే సూట్ అవుతుంది' అంటూ చాలామంది మొహాన్నే చెప్పేవారు. ఈ అమ్మాయి హీరోయిన్‌గా పనికిరాదంటూ అన్నవాళ్లు కూడా ఉన్నారు. సోషల్ మీడియాలోనూ దారుణంగా ట్రోల్ చేశారు. అది తలుచుకుని మొదట్లో చాలా బాధపడ్డాను. ఇండస్ట్రీలోకి అస్సలు రాకుండా ఉండాల్సింది అని అనుకున్నాను. కానీ కొంత కాలానికి ఆ బాధలో నుంచి బయటకొచ్చాను. నా యాక్టింగ్ చూసి తప్పకుండా అవకాశాలు వస్తాయని నమ్మాను, ఆఖరికి అదే నిజమైంది." అంటూ అపర్ణ చెప్పుకొచ్చింది.
ఇక ఇదే ఇంటర్వ్యూలో తన చిన్ననాటి సంగతులతో పాటు ఆడిషన్స్ వెళ్లిన రోజుల గురించి గుర్తుచేసుకుంది. ఆకాశం నీ హద్దురా సినిమా కోసం తన ఆడిషన్స్ ఎలా జరిగిందో తెలిపింది. తనకు ఆ ఛాన్స్ వస్తుందని అనుకోలేదంటూ పేర్కొంది.
" మా నాన్న బాలమురళి మలయాళంలో ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్, అమ్మ లాయర్. శాస్త్రీయ సంగీతం, భరతనాట్యం, కథక్, కూచిపూడి నేర్పుకున్నాను. ఇంట్లో చదువు కంటే ఎక్కువ అవే ప్రాక్టీస్ చేసేదాన్ని. పెర్ఫామెన్స్లు కూడా ఇస్తుండేదాన్ని. అలా సినిమాల్లో పాడే అవకాశాలూ వచ్చాయి. అయితే ఆర్కిటెక్ట్ అవ్వాలని నా కోరిక. అందుకే డిగ్రీలో ఆ సబ్జెక్టును ఎంచుకున్నాను. సినిమా ఆడిషన్ జరుగుతోందని తెలిసి ఓ చెన్నై వెళ్లా. అక్కడికొచ్చిన జనాన్ని చూసి నాకు కంగారుగా అనిపించింది. లోపలికి వెళ్లాక తెలిసింది సూర్య పక్కన ఛాన్స్ కోసం ఈ ఆడిషన్స్ అని. నాకు కచ్చితంగా రాదని అనుకుంటూనే ఆడిషన్ ఇచ్చా. వారం తరవాత 'ఆకాశం నీ హద్దురా' సినిమా కోసం నన్ను ఎంపిక చేసినట్టు తెలిపారు. నటన పరంగానూ మంచి పేరునూ, నేషనల్ అవార్డు కూడా తెచ్చి పెట్టింది ఆ సినిమా." అంటూ తన ఆడిషన్ రోజులను గుర్తుచేసుకుంది.
ఈ చిన్నారి కుర్రాళ్ల మనసు దోచిన హీరోయిన్.. నేషనల్ అవార్డు గ్రహీత కూడా
అదొక తీవ్రమైన చర్య.. ఆ స్టూడెంట్ ప్రవర్తన వల్ల చాలా బాధపడ్డా: అపర్ణ