ETV Bharat / entertainment

ఫుల్​ స్వింగ్​లో అనుపమ - పాన్ఇండియా స్టార్ అయినా ఆ  సినిమాల్లో ఛాన్స్ రాలేదు! - Tillu square Trailer

Anupama Parameswaran Birthday : తన చిరునవ్వుతో యువతను కట్టిపడేసింది యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. తొలి సినిమాతోనే తెలుగువారి మదిని దోచిన ఆ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. నేడు ఈ కేరళ చిన్నదాని పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అనుపమ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.

Anupama Parameswaran Birthday
Anupama Parameswaran Birthday
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 18, 2024, 6:28 AM IST

Anupama Parameswaran Birthday: పువ్వు లాంటి నవ్వు, చక్కని చుక్కలాంటి అమ్మాయి, నల్లటి కారు మేఘాల్లాంటి కురులు ఇవన్నీ కలగలిగిపితే అనుపమ పరమేశ్వరన్. ఈ అమ్మడు ఆదివారం (ఫిబ్రవరి 18) 28వ ఏట అడుగుపెడుతోంది. టీనేజీలోనే సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించింది. 'ప్రేమమ్' అనే మలయాళ సినిమాలో మేరీ జార్జ్ అనే స్కూల్ అమ్మాయి పాత్రలో కనిపించిన అనుపమ ఒక్క స్మైల్ తో యావత్ దేశాన్ని తన మాయలో పడేసింది.

ఆ తర్వాత అమ్మడు తెలుగులో రీమేక్​ అయిన 'ప్రేమమ్'​ సినిమాలో అదే మేరీ జార్జ్ పాత్రలోనే కనిపించింది. ఇక్కడ కూడా తన నటనతో అందరినీ ఆకట్టుంది ఇక 'అఆ' సినిమాలో నెగిటివ్ షేడ్స్​ ఉన్న పాత్రలో కనిపించింది తనలోని కొత్త కోణాన్ని చూపించింది. 2017లో వచ్చిన 'శతమానం భవతి' సినిమా తన కెరీర్​ను ఓ మలుపు తిప్పింది. ఈ సినిమాతో ఆమె తెలుగులో మాంచి సక్సెస్​ అందుకుంది. అమెరికా నుంచి వచ్చిన అమ్మాయిగా అనుపమ నటనకు మంచి మార్కులు పడ్డాయి. శర్వానంద్ పక్కన మరదలు పిల్లగా అనుపమ నటనకు కుర్రకారు అంతా ఫిదా అయిపోయారు. దీంతో తెలుగులో ఈ చిన్నదానికి ఆఫర్ల వెల్లువ మొదలైంది.

'ఉన్నది ఒకటే జిందగీ', 'హలో గురు ప్రేమకోసమే' సిినిమాల్లోనూ తనదైన శైలిలో నటించి మెప్పించింది. శర్వానంద్, రామ్, నాని, సాయి ధరమ్​ తేజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నిఖిల్ సిద్ధార్థ్ ఇలా యువ హీరోలతో జతకడుతూ అనుపమ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంటూ ముందుకు వెళ్తోంది. 2022లో అనుపమ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. 'కార్తికేయ- 2', '18 పేజెస్' ఇలా రెండు సినిమాలతో ఈ అమ్మడు రెండు హిట్స్​ను తన ఖాతాలో వేసుకుంది. ఇందులో 'కార్తికేయ 2' సినిమా పాన్ ఇండియా రేంజ్​లో సూపర్ హిట్​గా నిలిచింది. ఇప్పటి వరకు సౌత్​లో ఉన్న ఈ అమ్మడి క్రేజ్ ఈ సినిమాతో నార్త్​ వరకు పాకింది.

తాజాగా విడుదలైన రవితేజ 'ఈగల్' సినిమాలో కూడా అనుపమ ఓ చక్కటి పాత్రలో కనిపించి మంచి మార్కులు కొట్టేసింది. అయితే ఇటీవలే వచ్చిన టిల్లు స్క్వేర్​లో తన పాత్రను అభిమానులు షాక్​కు గురయ్యారు. ఇప్పటి వరకు క్లాసీ లుక్​లో కనిపించిన అనుపమ ఈ సినిమాలో ఒక్కసారిగా బోల్డ్​గా మారిపోయింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇంతటి పాపులారిటీ సంపాదించుకున్న అనుపమ​కు ఇంకా బడా హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్​ రాలేదు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన యంగ్ హీరోయిన్స్​ అందరూ పెద్ద హీరోల సినిమాల్లో నటిస్తూ క్రేజ్ సంపాందించుకుంటున్నారు. ఇటీవలే ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల కూడా మహేశ్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి హీరోల పక్కన నటిస్తుంటే, అనుపమ మాత్రం ఇంకా టైర్​ -2 హీరోల సినిమాల్లోనే నటిస్తోంది. త్వరలోనే ఈ చిన్నదానికి ఓ మంచి ప్రాజెక్టులో ఛాన్స్ రావాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

అలా చేస్తే తప్పేంటి.. నాకు భయం లేదు ఇలానే ఉంటా: అనుపమ

కొండల్లో సేదతీరుతూ ఫ్యామిలీ ట్రిప్​ను ఎంజాయ్​ చేసిన అనుపమ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.