ETV Bharat / entertainment

హ్యాపీ బర్త్​ డే అనుపమ - టిల్లుగాడి దెబ్బకు మందు కొడుతూ - మసాలా డోస్​తో గ్లామర్ షో - అనుపమ పరమేశ్వరన్ పుట్టినరోజు

Anupama Parameshawaran Birthday Vacation : నేడు(ఫిబ్రవరి 18) పుట్టినరోజు జరుపుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ తన వెకేషన్​ వీడియోను పోస్ట్ చేసి అభిమానులకు మరోసారి షాక్ ఇచ్చింది. ఇందులో ఆమె మందు కొడుతూ బీచ్​లో అందాలను ఆరబోస్తూ డ్యాన్స్​లతో ఫుల్ చిల్ కొట్టింది. అది చూసిన ఫ్యాన్స్ హర్ట్ అయిపోతున్నారు.

Anupama Parameshawaran Birthday Vacation

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 18, 2024, 10:44 AM IST

Anupama Parameshawaran Birthday Vacation : అనుపమ పరమేశ్వరన్ ఈ పేరుకు యూత్​లో ఫ్యాన్​ బేస్ ఎక్కువే. తొలి సినిమాతోనే తన చిరునవ్వుతో యువతను కట్టిపడేసిన ఈ యంగ్ బ్యూటీ తెలుగువారి మదిని దోచేసింది. ప్రస్తుతం వరుస ఆఫర్లతో కెరీర్​లో దూసుకెళ్తోంది. అయితే కెరీర్​ మొదట్లో బాగా ట్రెడిషనల్​గానే కనిపించినా ఆ తర్వాత రూట్​ మార్చి హైడోస్​ గ్లామర్​ షోతో అభిమానులకు షాక్​లు మీద షాకులు ఇస్తోంది.

ఇక తాజాగా సిద్ధు జొన్నల్లగడ్డ డీజే టిల్లు స్క్వేర్​లో అయితే ఊహించని రేంజ్​లో అందాలను ఆరబోస్తూ హద్దులు లేకుండా లిప్​ కిస్​లతో రెచ్చిపోయింది. ఇంత వరకు కనిపించనంత రొమాంటిక్​ బోల్డ్‌గా కనిపించి కుర్రాళ్లను పరేషాన్ చేసింది. దీంతో మా అను పాపను టిల్లు గాడు ఇలా మార్చేశాడేంట్రా అంటూ కొంతమందైతే హర్ట్​ కూడా అయిపోతున్నారు.
అయితే నేడు(ఫిబ్రవరి 18) ఈ కేరళ చిన్నది పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె తన వెకేషన్ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో అనుపమ ఫుల్ చిల్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ వీడియోలో అనుపమ తాను ఉన్న హోటల్, రూమ్​, అక్కడ వైన్ బాటల్​, గ్లాసులతో డ్యాన్స్​లు వేస్తూ రచ్చ చేస్తున్నట్లు చూపించింది. ఆ వైన్ తాగుతూ కన్ను కూడా కొట్టింది.

బీచ్​లో అందాలను ఆరబోస్తూ చిందులు కూడా వేసింది. అలా అనుపమ తన బర్త్ డే వెకేషన్‌ను బాగానే ప్లాన్ చేసుకుని ఒంటరిగా ఫుల్​ ఎంజాయ్ చేస్తోంది. ఈ వెకేషన్ కోసమే టిల్లు స్క్వేర్ ట్రైలర్ ఈవెంట్‌కు కూడా డుమ్మా కొట్టేసింది. మరి అనుపమ ఎప్పుడు తిరిగి వస్తుందో.

ఇక ఈ వీడియో చూసిన ఆమె అభిమానులు టిల్లు గాడు మొత్తం మార్చేశాడురా, నువ్వు ఇలా పూర్తిగా మారిపోవడం బాధేస్తోంది బేబీ,. బ్రేకప్ కన్నా ఇదే ఎక్కువ బాధిస్తుంది అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతానికి ఈ వీడియో సోషల్​ మీడియాలో పుల్ చక్కర్లు కొడుతోంది. ఏదేమైనప్పటికీ ఈ మలయాళీ బ్యూటీ మాత్రం గ్లామర్ షోతో నెట్టింట మంట పెడుతోంది. ఈ టిల్లు స్క్వేర్ చిత్రం మార్చి 29న విడుదల కానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.