ETV Bharat / entertainment

స్టేజ్​పైనే కన్నీళ్లు పెట్టుకున్న 'యానిమల్' విలన్ - Bobby Deol cries - BOBBY DEOL CRIES

Animal Villain Bobby Deol Cries : యానిమల్ ఫేమ్​ విలన్ బాబీ దేఓల్ స్టేజ్​పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏం జరిగిందంటే?

.
.
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 30, 2024, 6:00 PM IST

Animal Villain Bobby Deol Cries : యానిమల్ సినిమాలో విలన్​గా నటించి ప్రపంచవ్యాప్తంగా పేరు దక్కించుకున్న బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ దేఓల్ తన కష్టాలను చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో అభిమానించే కామెడీ కార్యక్రమం కపిల్ శర్మ షోకు బాబీ దేఓల్ ఆయన సోదరుడు నటుడు అయిన సన్నీ దేఓల్ కలిసి అతిథులుగా హాజరయ్యారు. అందులో ఆయన కుటుంబ పరిస్థితుల గురించి చెప్పుకుంటూ బాగా ఎమెషనల్ అయ్యారు బాబీ దేఓల్. సినీ కెరీర్లో దేఓల్ సోదరులు అనుభవించిన కష్టాల గురించి సన్నీ చెప్తుండగా కన్నీళ్లు పెట్టుకున్నారు మన ఫేవరెట్ విలన్ బాబీ దేఓల్. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

సన్నీ మాట్లాడుతూ - "1960ల నుంచి లైమ్ లైట్‌లో ఉన్నాం. ప్రయత్నాలతోనే ఏళ్లు గడిచిపోయినా కొన్ని విషయాలు మాకు సాధ్యపడలేదు. కానీ 2023 సంవత్సరం దేఓల్ ఫ్యామిలీకి బాగా కలిసొచ్చింది. కరణ్ జోహార్ డైరక్షన్‌లో నాన్న ధర్మేంద్ర నటించిన "రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ", నేను నటించిన "గదర్- 2", బాబీ దేఓల్ నటించిన "యానిమల్" మా కుటుంబంలో ప్రతి ఒక్కరికీ మంచి సక్సెస్ ఇచ్చాయి" అని సంతోషం వ్యక్తం చేశారు.

"గదర్- 2" రిలీజ్ అయిన తర్వాత నా కొడుకుకు వివాహమైంది. అప్పుడు పరిస్థితులు బాగా లేవు. అంతకంటే ముందు నాన్న నటించిన "రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ" విడుదలైంది. అది మంచి సక్సెక్ సాధించి పెట్డడం మాకు నమ్మశక్యంగా కూడా అనిపించలేదు" అంటూనే సన్నీ భావోద్వేగానికి గురైయ్యారు. అది చూసి బాబీ కూడా కంటతడి పెట్టుకున్నారు. ఆ వెంటనే మళ్లీ సన్నీ అందుకుని "ఆ తర్వాత యానిమల్ సినిమా రిలీజ్ అయింది. అందరి ఫోకస్​ను మా వైపునకు తిప్పేసింది." అని గుర్తు చేసుకున్నారు.

సన్నీ ఒక సూపర్ మ్యాన్ - తన సోదరుడు సన్నీని సూపర్ మ్యాన్ అని పొగిడారు బాబీ దేఓల్. "నిజ జీవితంలో కూడా సూపర్ మ్యాన్​లా స్ట్రాంగ్​గా ఎవరైనా ఉన్నారంటే అది మా అన్న సన్నీనే" అని బాబీ అనడంతో "అవును నేను బాహుబలిని" అంటూ తనను తాను పొగుడుకున్నారు సన్నీ.

ఇక బాబీ దేవోల్ సినిమాల విషయానికొస్తే యానిమల్‌ తర్వాత బాబీ - బాలకృష్ణ (#NBK109) చిత్రంలో, సూర్య హీరోగా శివ దర్శకత్వం వహిస్తున్న కంగువాలో, నాగార్జున హీరోగా రానున్న యాక్షన్‌ థ్రిల్లర్‌లో, పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రల్లో కనిపించనున్నారు.

గెట్ రెడీ ఫ్యాన్స్ - హరిహర వీరమల్లు టీజర్​ రిలీజ్ టైమ్ ఫిక్స్​ - Pawan Kalyan Hari Hara Veera Mallu

వరుసగా 11 ఫ్లాప్​లు- కెరీర్​లో ఎన్నో ట్రబుల్స్- కట్ చేస్తే రూ.300 కోట్ల స్టార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.