ETV Bharat / entertainment

'పుష్ప 2'లో యానిమల్ యాక్టర్​ - సుకుమార్ ప్లానింగ్​కు ఫ్యాన్స్ సర్​ప్రైజ్​ - PUSHPA 2 ANIMAL SAURABH SACHDEVA

'పుష్ప 2' కోసం యానిమల్ నటుడిని రంగంలోకి దింపిన దర్శకుడు సుకుమార్​!

sukumar alluarjun pushpa 2
sukumar alluarjun pushpa 2 (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 17, 2024, 6:31 AM IST

Pushpa 2 Animal Saurabh Sachdeva : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా రానున్న పాన్ ఇండియా చిత్రం 'పుష్ప 2' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు సుకుమార్‌ భారీ తారాగణంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే సినిమాలో నటిస్తున్న నటుడు బ్రహ్మాజీ తాజాగా తన పాత్రకు సంబంధించి షూటింగ్‌ పూర్తైందని తెలియజేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. కొన్ని ఫొటోలను అందులో జోడిస్తూ దీన్ని పంచుకున్నారు. ఇందులో బ్రహ్మాజీతో పాటు దర్శకుడు సుకుమార్‌, మలయాళ స్టార్ యాక్టర్​ ఫహాద్‌ ఫాజిల్‌, యానిమల్‌ ఫేమ్‌ సౌరభ్‌ సచ్‌దేవ కనిపించారు.

ఇది చూసిన నెటిజన్లు, సినీ ప్రియులు బ్రహ్మాజీ పోస్ట్‌పై స్పందిస్తూ సుకుమార్‌ భారీగా ప్లాన్‌ మాములుగా లేదుగా అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. కాగా, యానిమల్‌లో విలన్ బాబీ దేవోల్‌కు సోదరుడిగా నటించి ఆకట్టుకున్నారు సౌరభ్‌.

పుష్ప : ది రైజ్‌కు కొనసాగింపుగా రానుంది పుష్ప : ది రూల్‌ (పుష్ప 2). రష్మిక శ్రీవల్లిగా అంటే పుష్పకు భార్యగా కనిపించనుంది. మొదటి భాగంలో ప్రముఖ నటుడు ఫహాద్ ఫాజిల్‌ ఎస్పీ భన్వ‌ర్‌సింగ్ షెకావ‌త్‌గా కనిపించి మెప్పించారు. రెండో భాగంలో భన్వర్‌ సింగ్‌ పాత్ర నిడివి ఎక్కువగా ఉండనుంది. హీరోకు, ఆ పాత్రకు మధ్య చాలా యాక్షన్‌ సన్నివేశాలు ఉండనున్నాయి. ఇంకా సినిమాలో విలక్షణ నటిగా పేరు తెచ్చుకుంటున్న అనసూయ, కమెడియన్ సునీల్, ధనంజయ్ సహా పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Pushpa 2 Release Date : ఈ చిత్రం డిసెంబరు 6న వరల్డ్ వైడ్​గా గ్రాండ్​గా రిలీజ్ కానుంది. పుష్ప మొదటి భాగం భారీ విజయాన్ని అందుకోవడం, ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డ్ రావడంతో రెండో భాగంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అందుకే పుష్ప 2 కథకు మరిన్ని హంగులు జోడించి సుకుమార్‌ భారీగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే విడుదలైన సూసేకి, పుష్ప పుష్పరాజ్‌ సాంగ్స్​ యూట్యూబ్‌లో రికార్డ్​ స్థాయిలో వ్యూస్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

1600 కి.మీ సైకిల్ జర్నీ- బన్నీని కలిసేందుకు ఫ్యాన్ క్రేజీ ఫీట్

'70 ఏళ్లలో ఎప్పుడూ అలా జరగలేదు' - పుష్ప 2 అప్డేట్​ ఇచ్చిన నిర్మాత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.