Allu Arjun Wax Statue: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన గౌరవం పొందారు. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహకులు దుబాయ్లో అల్లు అర్జున్ మైనపు విగ్రాహం ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ 21ఏళ్ల సినీ కెరీర్ సందర్భంగా, మార్చి 28న ఈ విగ్రహాన్ని ఓపెనింగ్ చేశారు. ఈ విగ్రహాన్ని స్వయంగా బన్నీయే ఓపెనింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి స్నేహా రెడ్డి, పిల్లలు అయాన్, అర్హ తోపాటు సోదరుడు అల్లు శిరీశ్ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను అల్లు అర్జున్, స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ విగ్రహం అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ అల వైకుంఠపురంలో మూవీ క్యాస్ట్యూమ్లో ఉంది. విగ్రహానికి ఎరుపు జాకెట్ ధరించి రూపొందించారు. ఇక అదే క్యాస్య్టూమ్లో బన్నీ విగ్రహం పక్కన నిలబడి 'తగ్గేదేలే' మేనరిజంతో కెమెరాకు ఫోజులిచ్చారు. అయితే ఇప్పటికే పుష్ప సినిమాతో గ్లోబల్వైడ్గా పేరు సాధించిన బన్నీకి గతేడాది నేషనల్ అవార్డు కూడా దక్కింది. తాజాగా ఈ గౌరవం దక్కడం వల్ల బన్నీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా ఆయా నగరాల్లో ఉన్న టుస్సాడ్స్ మ్యూజియంలో ఇప్పటికే పలువురు టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రభాస్, మహేశ్ బాబు, కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాలు ఆయా నగరాల్లోని మ్యూజియంలో ఉన్నాయి.