Pushpa 2 Rashmika Happy Birthday : నేషనల్ క్రష్ రష్మిక మందన్న బర్త్ డే సందర్భంగా పుష్ప 2 టీమ్ ఓ స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది. రష్మిక శ్రీవల్లి పాత్ర లుక్‌ను రివీల్ చేస్తూ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో శ్రీవల్లి పట్టుచీర కట్టుకొని, ఒంటి నిండా బంగారంతో ధగధగ మెరిసిపోతూ కనిపించింది. చేతికి బంగారపు గాజులు, మెడలో గోల్డ్ చైన్లు, నల్లపూసలు, నడుముకు బంగారపు వడ్డాణంతో ఫుల్ రిచ్ అండ్ గ్లామర్‌గా కనిపించింది. ఈ పోస్టర్‌నే షేర్ చేసి చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బర్త్ డే విషెస్ చెప్పింది.
అయితే పుష్ప మొదటి భాగంలో తొలిసారి రష్మిక లుక్ రిలీజ్ చేసినప్పుడు అప్పట్లో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. కింద కూర్చొని చెవి దిద్దులు పెట్టుకుంటూ కనిపించింది. ఇప్పుడా దాంతో తాజా పోస్టర్‌ను కంపేర్ చేస్తూ శ్రీవల్లి అక్కా చానా రిచ్ అయిపోయిందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా, పుష్ప రాజ్ శ్రీవల్లి మెడలో తాళి కట్టడంతో తొలి భాగం పూర్తైన సంగతి తెలిసిందే. పుష్ప 2 కథ అక్కడి నుంచే మొదలుకానుంది.
ఇకపోతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు కూడా మరో మూడు రోజుల్లో రానుంది. ఈ సందర్భంగా టీజర్ రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ టీజర్‌కు అందించి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వినేందుకు హెడ్‌ఫోన్స్ రెడీ చేసుకోండి. సెన్సేషనల్ బీజీఎం రాబోతోంది అంటూ చెప్పుకొచ్చింది మూవీటీమ్. దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌లో జోష్‌ను నింపింది. ఇకపోతే ఈ సినిమాను సుకుమార్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఆగస్ట్ 15న సినిమా వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. చూడలి మరి ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.
-
Our 'Srivalli' says 3 more days to witness #Pushpa2TheRuleTeaser 🔥🔥
— Mythri Movie Makers (@MythriOfficial) April 5, 2024
Get ready for goosebumps stuff on April 8th 🤟🏻#PushpaMassJaathara#Pushpa2TheRule pic.twitter.com/SWjTLSiigl
రష్మిక సాధించిన ఈ 6 రికార్డులు తెలుసా? - అన్నింటిలోనూ నెం.1 - Rashmika Birthday