ETV Bharat / entertainment

'పుష్ప' నుంచి పీలింగ్స్​ సాంగ్ ఔట్- బన్నీ, రష్మిక క్రేజీ డ్యాన్స్​ - PUSHPA 2 PEELING SONG

పుష్ప నుంచి మరో సాంగ్ రిలీజ్- మీరు విన్నారా?

Pushpa 2 Peeling Song
Pushpa 2 Peeling Song (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2024, 6:24 PM IST

Updated : Dec 1, 2024, 7:54 PM IST

Pushpa 2 Peeling Song : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'పుష్ప 2' నుంచి మరో సాంగ్ రిలీజైంది. ఇప్పటికే 'సూసేసి', 'కిస్సిక్‌' పాటలు హుషారెత్తిస్తుండగా తాజాగా 'పీలింగ్స్' సాంగ్ విడుదలైంది. ఈ పాట మలయాళం లిరిక్స్‌తో ప్రారంభమవడం విశేషం. మలయాళ అభిమానులపై ప్రేమతో ఇలా క్రియేట్‌ చేశామని అల్లు అర్జున్‌ ఓ ఈవెంట్‌లో తెలిపారు. ఈ సాంగ్ లిరిక్స్​ చంద్రబోస్ రాయగా, సింగర్లు శంకర్ బాబు కందుకూరి, లక్ష్మి ఆలపించారు. పాటలో బన్నీ, రష్మిక డ్యాన్స్​తో హుషారెత్తించారు. బన్నీ డ్యాన్స్​ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక పాట రిలీజైన తొలి గంటలోనే 1 మిలియన్ వ్యూస్​ దాటేసింది.

కాగా, ఈ సినిమా డిసెంబర్ 5న వరల్డ్​వైడ్ గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటలకు, అర్ధరాత్రి 1.00 గంటలకు బెనిఫిట్ షోలు పడనున్నాయి. శనివారమే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి. ఇక ఈ చిత్రంలో ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, మైత్రి మూవీ మేకర్స్​ బ్యానర్​పై రవి, నవీన్ సంయుక్తంగా నిర్మించారు.

టికెట్ ధరల పెంపు
'పుష్ప 2' సినిమా టికెట్ ధరలు పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బెనిఫిట్ షోల టికెట్ ధరను రూ.800 పెంచుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్‌ ఏదైనా సరే ఇప్పుడున్న ధరకు అదననంగా రూ.800 చెల్లించాల్సిందే. అంటే బెనిఫిట్​ షోకు టికెట్‌ ధర సింగిల్ స్క్రీన్స్​లో సుమారు రూ. 1000, మల్టీప్లెక్స్​లలో రూ.1200 పైగా అవుతోంది.

హాట్ కేకుల్లా సోల్డ్
సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ శనివారం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందీలో పుష్ప టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. పీవీఆర్​ ఐనాక్స్​, సినీపోలిస్​ వంటి నేషనల్​ థియేటర్​ చైన్​లలో రిలీజ్​ రోజు ఈ టికెట్స్ అమ్ముడుపోయాయి. బాలీవుడ్​ చరిత్రలో ఇంత వేగంగా టికెట్లు అమ్ముడుపోయిన అతికొద్ది సినిమాల సరసన పుష్ప-2 చేరింది. అడ్వాన్స్​ బుకింగ్స్​లో పుష్ప-2, యానిమల్, గదర్​-2ను దాటేసింది.

'పుష్ప 2' ఫీవర్- ఒక్కో టికెట్ రూ.3వేలు- ఎక్కడంటే?

గెట్ రెడీ ఫర్ మాస్ జాతర- 'పుష్ప 2' తెలుగు ఈవెంట్ ఎప్పుడంటే?

Last Updated : Dec 1, 2024, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.