Samantha Citadel : స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్గా 'సిటాడెల్ హనీ బన్నీ' వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. అయితే సినిమాల్లో మహిళల పాత్రల గురించి సమంత మాట్లాడారు. మహిళలకు గుర్తింపు వచ్చేలా చేయడం ఓ నటిగా తన బాధ్యత అని తాజాగా పాల్గొన్న ఓ ఈవెంట్లో పేర్కొన్నారు.
'ఆడియెన్స్ అన్ని విషయాలను గమనిస్తారు. అందుకే చేసేవాటిని చాలా బాధ్యతతో చేయాల్సి ఉంటుంది. నేను ఒక క్యారెక్టర్లో నటిస్తున్నప్పుడు, దానికి సంబంధించిన పూర్తి బాధ్యత నాపైనే ఉంటుంది. అందుకే చాలా విషయాల గురించి ఆలోచించాకే పాత్రలు ఎంపిక చేసుకుంటా. మహిళలకు సమాజంలో న్యాయమైన ప్రాతినిధ్యం ఉండాలని భావిస్తున్నాను. సినిమాల్లోనూ కూడా రెండు, మూడు సన్నివేశాలకే పరిమితమయ్యే పాత్రలకు దూరంగా ఉంటాను. అలాగే నేను చేసే బ్రాండ్ ఎండార్స్మెంట్స్ గురించి కూడా ఆలోచిస్తా'
'నా రీసెంట్ వెబ్‌సిరీస్ సిటడెల్ : హనీ బన్నీ'లో నటించడం ఓ సవాలుగా అనిపించింది. అందులో నాది హీరోకు సమానమైన పాత్ర. యాక్షన్ సీన్స్‌లో కూడా హీరోతో సమానంగా చేశా. ఇలాంటి పాత్రల్లో నటించే అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి. ఈ పాత్రల కోసం ఎందరో నటీమణులు ఎదురుచూస్తున్నారు. నాకు ఎన్నో అవకాశాలు వచ్చిన, అందులో కొన్నింటినే ఎంచుకున్నాను' అని సమంత చెప్పారు.
కాగా, ఈ వెబ్‌సిరీస్ స్టార్ బ్యూటీ ప్రియాంకా చోప్రా నటించిన హాలీవుడ్ సిరీస్'సిటడెల్'కు ఇది ఇండియన్ వెర్షన్. ఇందులో సమంతతోపాటు బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కీలక పాత్రలో నటించారు. ఈ వెబ్‌సిరీస్‌లో సమంత నటనకుగాను ప్రశంసలు దక్కుతున్నాయి.
కాగా, సామ్ మరో వెబ్‌సిరీస్‌కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రముఖ డైరెక్టర్ రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న సిరీస్‌లో సమంత నటిస్తున్నట్లు సమాచారం. ఓ రాజవంశ కుటుంబం నేపథ్యంలో ఈ వెబ్‌సిరీస్ రూపొందుతోంది. రాజ్యం కోసం కుటుంబంలోని ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే పోరాటాలు, రాజకీయ అంశాలలో ఈ కథ సాగనుంది. ఇందులో సమంత యువరాణి పాత్ర పోషించనున్నట్లు ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది.
బాలీవుడ్లో బిజీబిజీగా సమంత- మరో వెబ్‌సిరీస్‌లో ఛాన్స్- ఈసారి యువరాణిగా!