ETV Bharat / entertainment

'9వ తరగతి వరకు చెప్పులు లేకుండానే - వాటిని భరించలేక ఇండస్ట్రీకి వచ్చా' - Alitho Saradaga Sivaji

90s webseries Biggboss Sivaji Alitho Saradaga Promo : రీసెంట్​గా బిగ్​బాస్​, #90s వెబ్‌సిరీస్‌తో సెకండ్ ఇన్నింగ్స్​లో మంచి పేరు సంపాదించుకున్న నటుడు శివాజీ తాజాగా ఆలీతో సరదాగా షోలో పాల్గొని సందడి చేశారు. దానికి సంబంధించిన ప్రోమోను చూసేయండి.

వేషం మార్చి దుబాయ్​లో పట్టుబడ్డ శివాజీ - ఏమైంది?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 7, 2024, 7:29 PM IST

Updated : Mar 7, 2024, 7:47 PM IST

90s webseries Biggboss Sivaji Alitho Saradaga Promo : నటుడు శివాజీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచేయం చేయాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా మారి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. అయితే ఆ మధ్య కొంతకాలం పాటు నటనకు దూరంగా ఉన్న ఆయన రీసెంట్​గా సెకండ్​ ఇన్నింగ్స్​ మంచి పేరు సంపాదించుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 హౌస్​లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన మొదటి నుంచి పెద్దన్నగా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ వెంటనే #90s సిరీస్​తో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇందులో మధ్యతరగతి తండ్రిగా నటించి అందరి హృదయాలను గెలుచుకున్నారు

అప్పటి నుంచి శివాజీకి మంచి క్రేజ్ వచ్చింది. దీంతో ఈ మధ్య వరుస ఇంటర్వ్యూలు, ఎంటర్ టైన్మెంట్ షోస్​లలో కనపడుతున్నారు. ఆలా ఇప్పుడు ఆలీ హోస్ట్ వ్యవహరిస్తున్న ఆలీతో సరదాగా సీజన్ 2లోని ఓ ఎపిసోడ్​కు గెస్ట్​గా విచ్చేసి సందడి చేశారు. ఇందులో #90s వెబ్‌సిరీస్‌లో అవకాశం ఎలా వచ్చింది? సినిమా ఇండస్ట్రీకి రావడం వెనుక కారణం? చిన్నప్పుడు తన కుటుంబం పడిన కష్టాలు, ఇలా అనేక విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే వేషం మార్చి దుబాయ్​లో ఎందుకు తిరిగారో కూడా చెప్పారు.

"చాలా కాలం తర్వాత బాపినీడు గారిని కలవాలని వెళ్లాను. ఆ సమయంలోనే #90s సిరీస్ ఆఫర్​ వచ్చింది. అదే విషయాన్ని చెప్పాను. అదేం పర్లేదు. దాన్ని వదలకు అని ఆయన చెప్పడంతో చేశాను" అని శివాజీ చెప్పారు. ఈ సిరీస్ కోసం దాదాపు 5 లక్షల మంది సబ్​స్క్రైబర్స్​​ యాడ్​ అయ్యారు అని గుర్తుచేసుకున్నారు.

ఇకపోతే శివాజీ ప్రస్తుతం కూర్మ నాయకి అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ రీసెంట్​గా ప్రారంభమైంది.హర్ష కడియాల దర్శకుడిగా పరిచయం కానున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ మరో ప్రధాన పాత్రలో నటించనుంది. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఎంఎం క్రియేషన్స్ బ్యానర్​లో మొదటి సినిమాగా విజిత్ రావు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

దెయ్యంతో డేటింగ్ అండ్​ రొమాన్స్​ - ఆసక్తిగా లవ్ మీ టీజర్​

పెరుగుతున్న సుహాస్ క్రేజ్​ - రూ.1000తో మొదలై ఇప్పుడు ఒక్కో సినిమాకు ఎన్ని కోట్లంటే?

Last Updated : Mar 7, 2024, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.