ETV Bharat / entertainment

భారీ బడ్జెట్‌తో బడా హీరోల సినిమాలు - పాన్ ఇండియానే టార్గెట్!! - 2024 TELUGU PAN INDIA MOVIES BUDGET

బడ్జెట్ ఎంత పెరుగుతున్నా కూడా వెనుకడుగేసేదే లేదంటోంది టాలీవుడ్. దీనికి తగ్గట్లుగానే బడా హీరోలు కూడా తమ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ 2024లో పాన్ఇండియా లెవెల్​లో రానున్న సినిమాలు ఏవో చూద్దామా?

2024 Telugu Pan India Movies Budget
2024 Telugu Pan India Movies Stars (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 8, 2024, 8:17 AM IST

2024 Telugu Pan India Movies Budget : రెబల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేశ్ ఇలా స్టార్ ఇమేజ్ ఉన్న ప్రతి హీరో పాన్ ఇండియా కథలకే మొగ్గు చూపుతున్నారు. వాళ్ల క్రేజ్‌ని, అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు వెనుకడుగేయడం లేదు. భారీ హంగులతో కథలను సిద్ధం చేయించి కోట్లు కుమ్మరించడానికి రెడీ అంటున్నారు. సినిమా రిజల్ట్ విషయంలో అటూ ఇటూ అయినా సరే, తగ్గేదే లేదంటూ మరో ప్రయత్నం చేసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు.

వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల వరకూ!
దర్శక ధీరుడు తీసిన 'ఆర్ఆర్ఆర్' కోసం సుమారు రూ.550 కోట్లు ఖర్చు అయ్యిందని సినీ వర్గాల అంచనా. అయితే అంతకంటే ముందు 'బాహుబలి పార్ట్ 1' కోసం మూవీ టీమ్ సుమారు రూ.180 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ స్థాయిని పెంచేసింది ఆ సినిమా. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న తెలుగు చిత్ర సీమ ఇక భారీ తరహా సినిమాలకే ప్రాధాన్యతనిస్తుంది. ఈ క్రమంలోనే రూ.600 కోట్ల బడ్జెట్‌తో 'కల్కి 2898 AD' తెరకెక్కిందట.

ఈ నేపథ్యంలో రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు నటించబోతున్న 'SSMB 28' కూడా దాదాపు రూ.1000 కోట్ల వరకూ బడ్జెట్ ఉంటుందని సినీ వర్గాల అంచనా. ప్రపంచ స్థాయి సాంకేతికత, హంగులతో రూపొందనున్న ఈ చిత్రం గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ తో కూడిన కథగా తెలుస్తోంది. రాజమౌళి గత సినిమాల కంటే కూడా ఇది భారీ వ్యయంతో కూడిన సినిమా అని ట్రేడ్ వర్గాల మాట.

ఇదిలా ఉండగా, రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'లో కొత్త రకమైన కథతో ప్రయోగం చేశారు. హిస్టారికల్ టచ్ ఉన్న సైన్స్ ఫాంటసీ మూవీతో కొత్త ప్రపంచాన్ని చూపించారు. ఇక తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తాను చేయబోయే సినిమా కూడా రూ.500 కోట్లకు పైమాటేనని తెలుస్తోంది. ఆ తర్వాత మారుతీ దర్శకత్వం వహిస్తున్న 'రాజా సాబ్' కూడా భారీ బడ్జెటేనని సమాచారం.

ఇక అల్లు అర్జున్ విషయానికొస్తే, 'పుష్ప 1' పాన్ ఇండియా తరహా మూవీగా తెరకెక్కగా సుకుమార్ దర్శకత్వంలో సిద్ధమైన పుష్ప 2 కూడా అదే రేంజ్‌లో రూపొందుతోంది. బన్నీ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్‌లో రాబోయే తర్వాతి చిత్రం కూడా పాన్ ఇండియా రేంజ్‌లోనే ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. వీళ్లతో పాటు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న రామ్ చరణ్ సినిమా కూడా భారీ బడ్జెట్ మూవీనే. 'కేజీఎఫ్' లాంటి బడా యాక్షన్ మూవీని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ తర్వాతి చిత్రంలో ఎన్టీఆర్‌తోనూ అదే రేంజ్‌లో ప్లాన్ చేశారట. ఇదంతా ఇలా ఉంటే, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా పరిచయం కానున్న తొలి చిత్రానికి కూడా రూ.100 కోట్ల మేర వెచ్చిస్తున్నారట నిర్మాతలు.

అభిమానుల అంచనాలు అందుకోవడానికే :
ప్రస్తతం ఉన్న సినిమా అభిమానుల అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. మునుపటిలా కాకుండా పెద్ద కథలకు, భారీ యాక్షన్ అడ్వంచర్స్‌కే ఇంటరస్ట్ చూపిస్తున్నారట. దీంతో వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా నిర్మాణ వ్యయాన్ని లెక్కచేయకపోవడంతో పాటు కథలకు హంగులు జోడించేందుకు సిద్ధమైపోతున్నారు నిర్మాతలు. భారీ బడ్జెట్ ను వెచ్చించి సినిమా తీయబోయే ముందు ఒకటికి రెండు సార్లు వర్క్ షాప్స్ నిర్వహించుకుంటున్నారట.

'స్పిరిట్'​ బడ్జెట్​పై లేటెస్ట్​ బజ్​ - ఏకంగా ఎన్ని వందల కోట్లంటే? - Spirit Movie Budget

ప్రభాస్​ రిజెక్ట్​ చేసిన బ్లాక్​ బస్టర్​ మూవీస్! రెబల్​ స్టార్ ఆ సినిమాలు చేసుంటే కథ వేరేలా ఉండేది! - PRABHAS REJECTED MOVIES

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.