ETV Bharat / education-and-career

నిరుద్యోగులకు గుడ్ న్యూస్​ - వెస్ట్​ సెంట్రల్​ రైల్వేలో 3,317 పోస్టులు - Central Railway Notification 2024 - CENTRAL RAILWAY NOTIFICATION 2024

Railway Jobs : 3,317 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే (డబ్ల్యూసీఆర్‌) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఎంపికయ్యే వారికి ఏసీ మెకానిక్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, హౌస్ కీపర్, పెయింటర్, ప్లంబర్, స్టెనోగ్రాఫర్ వంటి విభాగాల్లో అప్రెంటిస్‌షిప్ లభించనుంది.

RAILWAY JOBS
RAILWAY JOBS (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 7, 2024, 11:08 AM IST

Railway Jobs 2024 : రైల్వేలో ఉద్యోగ అవకాశం. 3,317 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి మధ్యప్రదేశ్‌ రాష్ట్రం జబల్‌పూర్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే (డబ్ల్యూసీఆర్‌) ప్రకటన విడుదల చేసింది. ఎంపికయ్యే వారికి దీని పరిధిలోని రైల్వే డివిజన్లు, యూనిట్లలో పోస్టింగ్‌లు కేటాయిస్తారు.

ఏయే విభాగాల్లో
ఏసీ మెకానిక్, బుక్ బైండర్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, హౌస్ కీపర్, మెషినిస్ట్, పెయింటర్, ప్లంబర్, స్టెనోగ్రాఫర్, సర్వేయర్, వెల్డర్, వైర్‌మ్యాన్ తదితర విభాగాల్లో అభ్యర్థులకు అప్రెంటిస్‌షిప్ ఇవ్వనున్నారు. కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి, ఇంటర్ పాసైన వారు అప్లై చేయొచ్చు. అప్రెంటిస్‌షిప్ కోసం ఎంపిక చేసుకునే ట్రేడ్‌లో అభ్యర్థులకు తప్పనిసరిగా నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్‌ ఉండాలి. అభ్యర్థులు wcr.indianrailways.gov.in వెబ్‌సైట్ ద్వారా సెప్టెంబర్‌ 4వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆగస్టు 5 నాటికి 15 నుంచి 24 ఏళ్లలోపు వారు ఈ అప్రెంటిస్‌షిప్ కోసం అప్లై చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయో పరిమితిలో మినహాయింపు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు రూ.141. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు రూ.41 ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ ఇలా
ఆయా అప్రెంటిస్‌షిప్ విభాగాల కోసం వచ్చే దరఖాస్తులను అభ్యర్థుల పదోతరగతి, ఇంటర్, ఐఐటీ ట్రేడ్ సర్టిఫికెట్లలోని మార్కుల ప్రాతిపదికన వడపోస్తారు. చివరగా ఒక మెరిట్ లిస్టును రూపొందిస్తారు. మెరిట్ లిస్టులోని వారిని అందుబాటులో ఉన్న అప్రెంటిస్‌షిప్ ఖాళీల ఆధారంగా నిర్దిష్ట నిష్పత్తిలో డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లోనూ అర్హత సాధించే వారికి చిట్టచివరగా మెడికల్ ఎగ్జామినేషన్‌ చేసి జాబ్‌లోకి తీసుకుంటారు.

ఎంపికయ్యే వారిలో 1262 మందికి డబ్ల్యూసీఆర్‌ పరిధిలోని జబల్‌పూర్ డివిజన్‌లోనే పోస్టింగ్ ఇస్తారు. 28 మందికి జబల్‌పూర్ వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే హెడ్ క్వార్టర్‌లో, 824 మందికి భోపాల్ డివిజన్‌లో, 832 మందికి కోటా డివిజన్‌లో, 175 మందికి భోపాల్ వర్క్‌షాప్‌లో, 196 మందికి కోటా వర్క్‌షాప్‌లో పోస్టింగులు కేటాయిస్తారు.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 2024 ఆగస్టు 5
  • దరఖాస్తుకు చివరి తేదీ : 2024 సెప్టెంబర్ 4

IBPS భారీ నోటిఫికేషన్ - 4455 పీవో/ మేనేజ్​మెంట్ ట్రైనీ పోస్టులు భర్తీ! - IBPS PO Recruitment 2024

ఇంటెల్‌ ఉద్యోగులకు షాక్​ - 18,000 జాబ్స్​ కట్​ - కారణం ఏమిటంటే? - Intel To Lay Off 18000 Employees

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.