ETV Bharat / education-and-career
సెప్టెంబర్ 5న SSC జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ - భారీ సంఖ్యలో పోస్టులు! - SSC GD 2024 NOTIFICATION - SSC GD 2024 NOTIFICATION
SSC GD Recruitment 2024 Notification : కేవలం పదో తరగతి అర్హతతో పోలీసు ఉద్యోగాల్లో స్థిరపడాలనుకుంటున్నారా? అయితే ఈ సువర్ణవకాశం మీకోసమే. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెప్టెంబరు 5న వేలాది జీడీ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. మరి ఈ కొలువులకు దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు, ఏజ్ లిమిట్ తదితర పూర్తి వివరాలు మీ కోసం.
Published : Aug 28, 2024, 12:21 PM IST
SSC GD Recruitment 2024 Notification : దేశ రక్షణలో భాగమవ్వాలనుకునే యువతకు గుడ్ న్యూస్. వివిధ విభాగాల్లో భారీ సంఖ్యలో కానిస్టేబుల్ (జీడీ) నియామకాల ప్రక్రియకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) సిద్ధమవుతోంది. ఎస్ఎస్సీ వార్షిక క్యాలెండర్ ప్రకారం (2024-25) ఈ నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది. అయితే పాలనా వ్యవహారాల కారణాల వల్ల సెప్టెంబరు 5కు వాయిదా వేసింది. ఈ విషయాన్ని ఎస్ఎస్సీ అధికారికంగా తెలిపింది. మరెందుకు ఆలస్యం ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం ఎలా? ఫీజు? వయో పరిమితి? తదితర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఏయే పోస్టులు భర్తీ అవుతాయంటే?
బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు, అసోం రైఫిల్స్‌లో రైఫిల్ మ్యాన్ (జనరల్ డ్యూటీ), ఎన్‌సీబీలో సిపాయి పోస్టులను ఎస్ఎస్సీ భర్తీ చేయనుంది.
అభ్యర్థుల ఎంపిక ఎలా?
రాత పరీక్ష, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
అర్హతలు
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి పాసై ఉండాలి. పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ.లకు, మహిళా అభ్యర్థుల ఎత్తు 157 సెం.మీ.లకు తగ్గకూడదు. అభ్యర్థుల వయసు 18- 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయసు సడలింపు ఉంటుంది.
సీబీఈ పరీక్ష విధానం
ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ ప్రశ్నాపత్రం 80 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులను కేటాయిస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్/ హిందీ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్షా కాలం గంట (60 నిమిషాలు). నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
పరీక్ష ఎప్పుడు ఉంటుంది?
వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ రాత పరీక్షలు జరగనున్నాయి. కాగా, గతేడాది ఎస్ఎస్సీ 46,617 జీడీ పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేసి, నియామక ప్రక్రియ పూర్తి చేసింది. త్వరలో రాబోయే నోటిఫికేషన్లో కూడా భారీగా ఉద్యోగాలు ఉండొచ్చని తెలుస్తోంది.
రైల్వేలో 1376 పారా మెడికల్ పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా! - RRB Para Medical Recruitment 2024