ETV Bharat / education-and-career

17,727 పోస్టులు - జీతం రూ.80 వేలు - జస్ట్ డిగ్రీ పాసైతే చాలు! - SSC CGL 2024 Notification - SSC CGL 2024 NOTIFICATION

SSC CGL 2024 Notification : నిరుద్యోగులకు శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. 17,727 ఖాళీలతో కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఎగ్జామ్‌ (సీజీఎల్‌ఈ) - 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ఈ ఉద్యోగాలకు ఎవరు అర్హలు? వయోపరిమితి? ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

SSC CGL Notification 2024
SSC CGL 2024 Notification (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 1, 2024, 4:29 PM IST

SSC CGL Notification 2024 : కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాల క‌ల్ప‌న సంస్థ స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC).. ఏటా వివిధ కేంద్ర విభాగాలు, వాటి అనుబంధ కార్యాలయాల్లో గ్రూప్‌-బి, గ్రూప్‌-సి ఖాళీల భర్తీకి కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఎగ్జామ్‌ (సీజీఎల్‌ఈ) నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 17,727 ఖాళీలతో సీజీఎల్‌ఈ - 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి విద్యార్హ‌త‌లు, వ‌య‌సు, జీతభత్యాలు, దరఖాస్తు తేదీలతో పాటు ఇత‌ర వివ‌రాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

విద్యార్హతలు(Eligibility) : సీజీఎల్ఈ-2024 నోటిఫికేషన్​లోని పోస్టులకు ఏ బ్యాచిలర్‌ డిగ్రీ ఉన్నవారైనా అప్లై చేసుకోవచ్చు. అయితే.. జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌కు మాత్రం డిగ్రీలో స్టాటిస్టిక్స్‌ లేదా ఇంటర్‌ మ్యాథ్స్‌లో 60 శాతం మార్కులు వచ్చి ఉండాలి. స్టాటిస్టికల్‌ ఇన్వెస్టిగేటర్​కు డిగ్రీలో స్టాటిస్టిక్స్‌ తప్పనిసరి అనే విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి.

వయో పరిమితి(Age Limit) : ఆగస్టు 1, 2024 నాటికి గ్రూప్‌-బీలో.. జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్టుకు 32 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 30 సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలి. అలాగే.. గ్రూప్‌-సీలో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుకు 30 సంవత్సరాలు. మిగిలినవాటికి 27 ఏళ్లలోపు వయసు ఉన్నవారే అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు వారి కేటరిగీ ప్రకారం పది నుంచి పదిహేనేళ్లు గరిష్ఠ వయసులో మినహాయింపు ఉంది.

జీతభత్యాలు(Salary) : ప్రస్తుత నోటిఫికేషన్​లో వివిధ కేంద్ర విభాగాల్లో గ్రూప్‌-బీ, గ్రూప్‌-సీలో పలు హోదాలతో ఉద్యోగాలు ఉన్నాయి. ఎంపికైన పోస్టు ప్రకారం.. లెవెల్‌-4, లెవెల్‌-5, లెవెల్‌-6, లెవెల్‌-7 శాలరీలు వీరికి ఇస్తారు. మొదటి నెల నుంచే సుమారుగా.. లెవెల్‌-4లో ఉన్నవాళ్లు రూ.45000, లెవెల్‌-5వారు రూ.55000, లెవెల్‌-6తో రూ.65,000, లెవెల్‌-7 అయితే రూ.80,000 జీతం పొందుతారు.

పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారా? ఇలా చదివితే ఉద్యోగం గ్యారెంటీ!

దరఖాస్తు విధానం(Application Process) : ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి. రూ.100 ఎగ్జామ్ ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, ఎక్స్​సర్వీస్​మెన్​లకు ఎలాంటి ఫీజూ ఉండదు.

ముఖ్యమైన తేదీలు(Important Dates) : ఈ నోటిఫికేషన్​కు సంబంధించిన ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇప్ప‌టికే స్టార్ట్(జూన్ 24 నుంచే) మొదలైంది. "జూలై 24 రాత్రి 11 గంట‌ల‌ వరకు" ఆన్​లైన్ అప్లికేష‌న్లు స్వీకరిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఎస్​ఎస్​సీ అధికారిక వెబ్​సైట్ http://ssc.gov.in/ ని సందర్శించి అప్లై చేసుకోవచ్చు.

పరీక్షలు : సీజీఎల్-2024 నియామకాలను టైర్‌-1, టైర్‌-2 పరీక్షల ఆధారంగా చేపడతారు. టైర్​ -1 సెప్టెంబరు-అక్టోబరులో, టైర్‌-2 డిసెంబరులో ఉండనున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తెలిపింది.

పరీక్ష కేంద్రాలు : తెలంగాణలో.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌. ఆంధ్రప్రదేశ్​లో.. విజయవాడ, విశాఖపట్నం, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం.

ఉద్యోగ ఎంపిక విధానం : టైర్‌-1, టైర్‌-2 ఎగ్జామినేషన్‌, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్/ మెడికల్ టెస్టులు, సర్టిఫికెట్స్ పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

మంచి మార్కులు ఉన్నా ఉద్యోగం రావట్లేదా - అయితే ఈ 'టాస్క్' కంప్లీట్​ చేయాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.