Indian Navy Recruitment 2024 : డిగ్రీ, పీజీలు చేసి ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్‌ఏ)లో 2025 జూన్ నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) కోర్సులో ప్రవేశాలకు సంబంధించి అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఇండియన్ నేవీ దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 29వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
కోర్సు వివరాలు : షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్ - జూన్ 2025 కోర్సు
బ్రాంచి వివరాలు :
1. జనరల్ సర్వీస్ (జీఎస్-ఎక్స్/ హైడ్రో క్యాడర్) - 56 పోస్టులు
2. పైలట్ - 24 పోస్టులు
3. నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ (ఎయిర్ క్రూ) - 21 పోస్టులు
4. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ - 20 పోస్టులు
5. లాజిస్టిక్స్ - 20 పోస్టులు
6. నావల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టరేట్ కేడర్ - 16 పోస్టులు
7. ఎడ్యుకేషన్ - 15 పోస్టులు
8. ఇంజినీరింగ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్) - 36 పోస్టులు
9. ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్) - 42 పోస్టులు
10. మొత్తం పోస్టులు - 250
విద్యార్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీకాం, బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ డిప్లొమా చేసి ఉండాలి. అలాగే నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
ప్రారంభ వేతనం : నెలకు రూ.56100 జీతం ఇస్తారు. పైగా ఇతర అలవెన్సులు ఉంటాయి.
ఎంపిక విధానం : అకడమిక్స్‌లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం : 2024 సెప్టెంబర్ 14
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 సెప్టెంబర్ 29
ముఖ్యాంశాలు :
- షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఇండియన్ నేవీ ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
- అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 29వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.