Indian Army TES 2024 : ఇండియన్ ఆర్మీ 2025 జనవరిలో ప్రారంభం కానున్న 52వ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES) కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 10+2 చదివిన అవివాహిత పురుషులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు.
టెక్నికల్ ఎంట్రీ స్కీమ్‌కు ఎంపికైన అభ్యర్థులకు బీటెక్ కోర్స్ సహా, లెఫ్టినెంట్ జాబ్స్‌కు ఉచితంగా శిక్షణ అందిస్తారు. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా 90 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
విద్యార్హతలు
Indian Army TES Eligibility : ప్రభుత్వ గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డ్ నుంచి 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (10+2) క్వాలిఫై అయ్యుండాలి. కచ్చితంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌లుగా ఉన్న కోర్స్‌లు చదివి ఉండాలి. లేదా అందుకు సమానమైన పరీక్షతోపాటు జేఈఈ మెయిన్స్ 2024లో ఉత్తీర్ణులై ఉండాలి. ఆర్మీ ఆఫీసర్లకు ఉండాల్సిన నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కచ్చితంగా ఉండాలి.
వయోపరిమితి
Indian Army TES Age Limit : అభ్యర్థుల వయస్సు 16.5 ఏళ్ల నుంచి 19.5 ఏళ్ల మధ్యలో ఉండాలి.
ఎంపిక ప్రక్రియ
Indian Army TES Selection Process :
- జేఈఈ మెయిన్స్ స్కోర్
- స్టేజ్-1 పరీక్ష
- స్టేజ్-2 పరీక్ష
- ఇంటర్వ్యూ
- మెడికల్ ఎగ్జామినేషన్
వీటన్నింటిలోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులను టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్స్‌కు ఎంపిక చేస్తారు.
కోర్స్ & శిక్షణ
Indian Army TES Course & Training : టెక్నికల్ ఎంట్రీ స్కీమ్‌కు ఎంపికైన అభ్యర్థులకు మొత్తం 5 ఏళ్లపాటు కోర్స్, శిక్షణ కొనసాగుతుంది. ఇందులో ఒక ఏడాది పాటు బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ ఇస్తారు. మిగతా నాలుగేళ్లు టెక్నికల్ ట్రైనింగ్ ఉంటుంది. కోర్సు, శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ఇంజినీరింగ్ డిగ్రీ (బీఈ/బీటెక్) అందిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 జూన్ 13
***
పది, ఇంటర్ అర్హతతో - నౌకాదళంలో అగ్నివీర్ పోస్టులు - మహిళలూ అర్హులే!
ఇండియన్ నేవీ అగ్నివీర్ మెట్రిక్ రిక్రూట్ (ఎంఆర్), సీనియర్ సెకండరీ రిక్రూట్ (ఎస్‌ఎస్‌ఆర్) నోటిఫికేషన్లను విడుదల చేసింది. పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్హతలతో ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ రెండు రకాల పోస్టులకు మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు.
అభ్యర్థులకు ముందుగా రెండు దశల్లో రాత పరీక్షలు నిర్వహిస్తారు. తరువాత ఫిజికల్, మెడికల్ టెస్ట్‌లు నిర్వహించి, అర్హులైన వారిని అగ్నివీర్ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికైన వారు శిక్షణతో కలిపి నాలుగేళ్లు అగ్నివీరులుగా సేవలు అందించాల్సి ఉంటుంది. ఇవి శాశ్వత ఉద్యోగాలు కాదు. అయినప్పటికీ అగ్నివీర్‌గా ఎంపికైన ప్రతి నలుగురిలో ఒకరికి మాత్రం శాశ్వత ఉద్యోగ అవకాశం దక్కుతుంది. అంటే ఎంపికైన మొత్తం అగ్నివీరుల్లో 25 శాతం మందిని శాశ్వత ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఎస్‌ఎస్‌ఆర్, ఎంఆర్ పోస్టుల్లో దేనికి ఎంపికైనప్పటికీ నాలుగేళ్లు సేవలు అందించినందుకుగాను అగ్నివీరులకు సేవానిధి ప్యాకేజీ అందిస్తారు.
గుడ్ న్యూస్ - SBIలో 12,000 పోస్టులు - 85% ఉద్యోగాలు వారికే! - SBI Hiring
పరీక్షలు అంటేనే భయంగా ఉందా? ఈ 9-టిప్స్ పాటిస్తే విజయం మీదే! - Exam Anxiety