ETV Bharat / education-and-career

ఇంటర్న్‌షిప్‌లోనే 'జాబ్​ స్కిల్స్' నేర్చుకోండి - కాలక్షేపం చేశారో ఇక అంతే! - Benefits Of Doing An Internship

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 3, 2024, 11:35 AM IST

Benefits Of Doing An Internship : చాలా మంది ఇంటర్న్​షిప్​ టైమ్​లో కాలక్షేపం చేస్తూ గడిపేస్తారు. కానీ ఇది సరైన విధానం కాదు. ఇంటర్న్​షిప్​ సమయంలో జాబ్​ మార్కెట్​కు కావాల్సిన స్కిల్స్ అన్నీ నేర్చుకోవాలి. అప్పుడే మంచి జాబ్ ఆఫర్ వస్తుంది. కెరీర్​లో గ్రోత్ కూడా ఉంటుంది.

Internship
Internship (ETV Bharat)

Benefits Of Doing An Internship : నేటి జాబ్​ మార్కెట్లో ఎంత పోటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోని నిరుద్యోగుల సంఖ్యను ఒకసారి పరిశీలిస్తే ఈ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే చదువు పూర్తైన తరువాత కచ్చితంగా ఇంటర్న్​షిప్​ చేయడం మంచిది. దీని వల్ల జాబ్​ మార్కెట్​కు కావాల్సిన స్కిల్స్ నేర్చుకోవచ్చు. త్వరగా ఉద్యోగం పొందవచ్చు.

సాధారణంగా ఇంటర్న్​షిప్ వ్యవధి 30 రోజుల నుంచి 3 నెలల వరకు ఉంటుంది. కనుక ఈ స్వల్ప వ్యవధిలోనే ఉద్యోగానికి అవసరమైన అన్ని నైపుణ్యాలు నేర్చుకోవాలి. ఎందుకంటే నేడు చాలా కంపెనీలు మీ డిగ్రీల కంటే, పని అనుభవానికే పెద్ద పీట వేస్తున్నాయి. మీరు ఇంటర్న్​షిప్​లో చేరితే చాలు. సదరు కంపెనీలోకి మిమ్మల్ని అధికారికంగా అనుమతించి అక్కడ జరుగుతున్న పనిలో/ ప్రాజెక్టులో మీకు భాగస్వామ్యం కల్పిస్తారు. ఇంటర్న్‌షిప్‌ని ఉద్యోగంలా భావించి బరువు, బాధ్యతలు మోసేవారికే అసలైన ఉద్యోగం ఎదురొచ్చి ఆహ్వానం పలుకుతుంది. అలా కాకుండా కాలక్షేపం చేశారో, ఇక మీ పని అంతే!

అనుభవానికి పెద్దపీట
కళాశాల ప్రాంగణాల్లో మీరు ఏమి చేసినా అది ప్రాజెక్ట్​ ఖాతాల్లోకి వెళ్లిపోతుంది. కళాశాల ఆవరణను దాటి బాహ్య ప్రపంచంలో చేసేది 'అనుభవం' (ఎక్స్​పీరియన్స్​) కిందకు వస్తుంది. అంటే ఇంటర్న్​షిప్ అనేది మీ చదువుకు, ఉద్యోగానికి ఒక వారధిలా పనిచేస్తుంది.

కళాశాలల్లో నేర్చుకున్న విషయాలను పరీక్షించుకునేందుకు ఇంటర్న్​షిప్​ను వినియోగించుకోవాలి. ఉదాహరణకు బార్‌కోడ్‌ జనరేటర్, రీడర్‌ స్పెషలిస్ట్‌గా రాణించాలనుకునేవారు ఇందుకు అవకాశమున్న సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌లో చేరి, ఈ డొమైన్‌లో తన విజ్ఞానాన్ని పరీక్షించుకోవాలి. తమ తప్పొప్పులు తెలుసుకోవాలి. నేర్చుకున్న స్కిల్​ను ప్రాక్టికల్​గా​ అప్లై చేయగలగాలి. అప్పుడే అది నైపుణ్యంగా మారుతుంది.

ప్రాజెక్ట్​
ఇంటర్న్‌షిప్‌ ఇచ్చిన కంపెనీ విద్యార్థిని ఏదో ఒక ప్రాజెక్టులో కూర్చోబెడుతుంది. సంబంధిత కార్యకలాపాలు చక్కబెట్టేందుకు తగినంత మంది ఉద్యోగులను నియమిస్తుంది. వారికే ఇంటర్న్​లను అప్పగిస్తుంది. ఇంటర్న్‌లు తాత్కాలిక వ్యవధిలో వచ్చిపోతుంటారు కనుక వారిని, పనిని పరిశీలించి వెళ్లేవారిగానే కంపెనీ యాజమాన్యం పరిగణిస్తుంది. అందువల్ల విద్యార్థి రోజూ కంపెనీకి వెళ్లి పనిచేసినా, పనిచేయకపోయినా వాళ్లు ఏమీ అనరు. పైగా సర్టిఫికెట్‌ కూడా చేతికి అందిస్తారు. కానీ ఇక్కడే మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి.

ఈ తప్పు చేయవద్దు!
సర్టిఫికెట్ కోసం ఇంటర్న్‌షిప్‌ చేయకూడదు. సబ్జెక్ట్​పై అవగాహన కోసం, ప్రాక్టికల్‌ అనుభవం కోసం ఇంటర్న్​షిప్ చేయాలి. ఇంటర్న్​షిప్​ సమయంలో ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ప్రాజెక్ట్​కు సంబంధించిన రీసెర్చ్‌ చేయాలి. సహచరుల సహకారంతో అవగాహన పెంచుకోవాలి. ఆపై ప్రాజెక్టు పూర్తి చేయడానికి మీ విజ్ఞానాన్ని, నైపుణ్యాలను జోడించాలి. మీ పనితనంతో ప్రాజెక్ట్​ను పూర్తి చేయగలరనే ధీమాను టీమ్‌ నాయకత్వానికి కలిగించాలి. ఇలా నిరూపించుకున్న విద్యార్థి చొరవకు ముచ్చటపడి కంపెనీలు ఇంటర్న్‌షిప్‌ సమయాన్ని పొడిగించిన సందర్భాలు కూడా ఉంటాయి. అంతేకాదు విద్యార్థి శ్రద్ధ, ఆసక్తి, అంకిత భావాలను గుర్తించి కంపెనీయే ఉద్యోగం ఆఫర్‌ చేసిన ఉదంతాలెన్నో ఉన్నాయి. కనుక ఆ జాబితాలోకి చేరాలన్న తపనతో ఇంటర్న్​షిప్​ను వినియోగించుకోండి.

పని సంస్కృతి
ఇంటర్న్​షిప్​ చేసే సమయంలోనే కంపెనీ పూర్వాపరాలు, పని సంస్కృతి, కంపెనీ ప్రమోటర్లు, మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ, సంస్థ కార్యకలాపాలు (ఉత్పత్తి/ సేవలు) గురించి తెలుసుకోవాలి. అలాగే ప్రాజెక్టు పూర్తి చేయడానికి కావాల్సిన నైపుణ్యాలు, ప్రాజెక్టులోని ఉపలక్ష్యాలను అధ్యయనం చేయాలి. దీనివల్ల చేయబోతున్న పనిపై మంచి అవగాహనతో పాటు, మీలో ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. అంతేకాదు ఇది మీ ఉద్యోగాన్వేషణకు దారిచూపే వెలుగు దివ్వెగా ఉపయోగపడుతుంది.

బిజినెస్‌పై అవగాహన
ఇంటర్న్​షిప్ సమయంలోనే ప్రాజెక్టును అర్థం చేసుకోవడంతోపాటు, కంపెనీ వ్యాపార సరళిపై అవగాహన తెచ్చుకోవాలి. దీనిని ఏ కాలేజీలోనూ పాఠాలుగా చెప్పరు. ఇంటర్న్‌షిప్‌ సమయంలో ఉద్యోగులను చూసి, తెలుసుకొని అనుకరించడం ద్వారా నేర్చుకోవాలి. అంతేకాదు కార్యాలయ భాషను మాట్లాడడం, ఫోన్‌కాల్స్, ఈ-మెయిల్స్‌లో ప్రొఫెషనల్‌గా స్పందించడం నేర్చుకోవాలి. ఇవన్నీ పని సంస్కృతిలో కొత్త ఉద్యోగి కలసిపోయేట్టు చేస్తాయి. వినడానికి ఇవి ప్రాథమిక విషయాలుగా అనిపిస్తున్నప్పటికీ, వీటిని ఇంటర్న్‌గా నేర్చుకోకపోతే ఉద్యోగంలో చేరినప్పుడు అందరి ముందు బెరుకుగా, బేల చూపులు చూడాల్సి వస్తుంది.

పని ఒత్తిడి నియంత్రణ
ఏ రంగంలో ఉన్నా, ఏ వృత్తి చేస్తున్నా పని వాతావరణంలో ఒత్తిడి అనివార్యం. కాలేజీ క్లాస్‌రూమ్‌ నుంచి నేరుగా ఇంటర్న్‌షిప్‌ కోసం పెద్ద పెద్ద కంపెనీలకు వెళ్లి పనిచేస్తున్నప్పుడు ఒత్తిడి ఏర్పడటం సహజం. అందుకే దీన్నుంచి బయటపడే మార్గాలను ఇంటర్న్‌గా ఉన్నపుడే సాధన చేయటం మంచిది. సహచరులతో, సీనియర్లతో మనసు విప్పి మాట్లాడే ధైర్యం తెచ్చుకోవాలి. మీ నైపుణ్యాలు నిజంగా సరిపోవనుకున్నప్పుడు మరింతగా సాధన చేసి వాటిని పెంచుకోవాలి. అప్పుడే మీరు ఒత్తిడిలను తట్టుకోగలుగుతారు.

ఏ విద్యార్థి ఏం గ్రహించాలి?
ఇంటర్న్‌షిప్‌ సమయంలో ఏయే అంశాలపై దృష్టి పెట్టాలన్నది విద్యార్థి విద్యా నేపథ్యంపై ఆధారపడి ఉంటుంది. పని సంస్కృతిలో కలిసిపోవడమనేది వేర్వేరు నేపథ్యాలవారు నేర్చుకోవాల్సిన ఉమ్మడి అంశం. కానీ డొమైన్‌ స్కిల్స్, విశాల అవగాహన కల్పించే అంశాలు మాత్రం భిన్నంగా ఉంటాయి.

ఇంజినీరింగ్‌ : కంప్యూటర్‌ సైన్స్, అనుబంధ బ్రాంచీల్లో చేరినవారు ఇంటర్న్‌షిప్‌ కాలంలో అల్గారిథమ్స్, డేటా సైన్స్‌లతో పాటు సమస్య పరిష్కార పద్ధతులపై పట్టు సాధించాలి. ముఖ్యంగా నాలుగేళ్ల అకడమిక్స్‌లో నేర్చుకున్న విషయాలను ప్రాక్టికల్​గా అప్లై చేయడానికి ప్రయత్నించాలి. ఆ సమయంలో ఎదురయ్యే అవాంతరాలను అధిగమించేందుకు సాధన చేయాలి. అదే సమయంలో ఐటీ సేవల్లో ఆ కంపెనీ ప్రత్యేకత, చేస్తున్న ప్రాజెక్టులు, ఉద్యోగులకు అవసరమైన నైపుణ్యాలపై అవగాహన తెచ్చుకోవాలి. ఐటీ పరిశ్రమ తీరుతెన్నులు, ఐటీ కంపెనీలకు వస్తున్న ఆర్డర్లు, అవసరమైన మానవ వనరులు, ఐటీ రంగంలో రాజ్యమేలుతున్న కొత్త టెక్నాలజీలపై అవగాహన పెంచుకోవాలి.

కామర్స్‌ : బిజినెస్‌ మేనేజ్‌మెంట్, అకౌంటెన్సీ, ఫైనాన్స్‌ విద్యార్థులు తాము అకడమిక్‌ కోర్సుల్లో నేర్చుకున్న విషయాలను వాస్తవంగా అప్లై చేసి చూడాలి. దీంతోపాటు తమ రంగానికి అనుబంధంగా వినియోగిస్తున్న టెక్నాలజీపై దృష్టి పెట్టాలి. మేనేజ్‌ సిస్టమ్స్‌ సాఫ్ట్‌వేర్లు, అకౌంటింగ్, ఫైనాన్షియల్‌ వ్యవహారాల్లో వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌ను అర్థం చేసుకోవాలి. కొత్త టెక్నాలజీలను సైతం నేర్చుకునేందుకు కృషి చేయాలి. ఇదే సమయంలో దేశ, విదేశాల ఆర్థిక పరిస్థితులు, వివిధ పరిశ్రమల ధోరణులు, కంపెనీల వాణిజ్య జయాపజయాలను గమనిస్తుండాలి. ముఖ్యంగా ఇంటర్న్‌షిప్‌ ఇస్తున్న కంపెనీ ఉత్పత్తులు, మార్కెట్‌లో వాటి స్థానం, కంపెనీ గత కొన్నేళ్ల ఆర్థిక పనితీరుపై అవగాహన పెంచుకోవాలి.

సైన్స్‌ : ఫార్మా రంగంలోకి ప్రవేశించేవారు నేర్చుకోవాల్సిన విషయాలు సాంకేతికపరమైనవి అయ్యుంటాయి. కనుక ఈ రంగంలోకి ప్రవేశించాక సాంకేతిక పరిజ్ఞానాన్ని అధ్యయనం చేయాలి. ఎందుకంటే అకడమిక్స్‌కీ, ఇండస్ట్రీకీ మధ్య వ్యత్యాసం ఉంటుంది. దీన్ని గుర్తించి కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంపై ఆసక్తి చూపాలి. ఫార్మా కంపెనీల్లో పాలనపరమైన పొజిషన్లను ఆశిస్తూ ఇంటర్న్‌షిప్‌ చేసేవారు మాత్రం పరిశ్రమ గురించి లోతుగా తెలుసుకోవాలి. దేశ విదేశాల్లో ఫార్మా రంగ గమనం, పేమెంట్స్‌ స్థితిగతులు, దేశ ఫార్మా దిగ్గజ కంపెనీలను అధ్యయనం చేయాలి. జరుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండాలి. ఇంటర్న్‌షిప్‌ సమయంలో ఒక కంపెనీలోని సీనియర్ల ద్వారా పరిశ్రమ లోతుపాతులను తెలుసుకోవాలి.

పరిమితులుంటాయి : ఇంటర్న్‌షిప్‌కు కొన్ని పరిమితులున్నమాట వాస్తవం. స్వల్ప కాల వ్యవధి ఉండడం, పైగా మీరు ఫ్రెషర్స్‌ కావడం వల్ల ఒక కంపెనీలో చోటు లభించినా ఇన్ని విషయాలు తెలుసుకోవడం కాస్త కష్టమే. కానీ మీలో ఉత్సాహం, చొరవ చూపి కంపెనీ ఉన్నతోద్యోగులను ఆకర్షించవచ్చు. అప్పుడు వారే మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. ఈ విధంగా ఇంటర్న్​షిప్​లో జాబ్​ మార్కెట్​కు కావాల్సిన నైపుణ్యాలన్నింటినీ కచ్చితంగా నేర్చుకోవాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.