Army NCC Special Entry Scheme 2024 : ఇండియన్ ఆర్మీ - షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా 57వ కోర్స్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కోర్స్‌లో చేరేందుకు ఆసక్తి, అర్హత ఉన్న అవివాహిత పురుషులు, స్త్రీలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుకు 2024 ఆగస్టు 9 చివరి తేదీ.
కోర్స్ వివరాలు : ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 57వ కోర్సు - 2025 ఏప్రిల్
కేటగిరీ వారీగా ఖాళీల వివరాలు :
- ఎన్‌సీసీ పురుషులు : 70
- ఎన్‌సీసీ మహిళలు : 06
నోట్ : యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు ఈ రెండు విభాగాల్లోనూ 8 పోస్టులు రిజర్వ్ అయ్యుంటాయి.
విద్యార్హతలు
- అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.
- డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- అభ్యర్థులు డిగ్రీ చదివిన లేదా చదువుతున్న మూడేళ్లు కూడా ఎన్‌సీసీ సీనియర్ డివిజన్ వింగ్‌లో ఉండాలి.
- ఎన్‌సీసీ-సి సర్టిఫికెట్లో కనీసం బీ-గ్రేడ్ సాధించి ఉండాలి.
- అయితే యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు ఎన్‌సీసీ-సీ సర్టిఫికెట్ అవసరం లేదు.
వయోపరిమితి
అభ్యర్థుల వయస్సు 2024 జనవరి 1 నాటికి 19 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి.
ఎంపిక విధానం
మెరిట్ ఆధారంగా అప్లికేషన్లను షార్ట్‌లిస్ట్ చేస్తారు. తరువాత స్టేజ్-1, స్టేజ్-2 టెస్టులు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, ధ్రువ పత్రాల పరిశీలన చేసి, అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
శిక్షణ
ఎంపికైన అభ్యర్థులకు ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడెమీ, చెన్నైలో 49 వారాలపాటు శిక్షణ ఉంటుంది.
జీతభత్యాలు
ట్రైనింగ్ సమయంలో ప్రతినెలా రూ.56,100 స్టైపెండ్ ఇస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి 'పీజీ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్' పట్టాను మద్రాస్ యూనివర్సిటీ ప్రధానం చేస్తుంది. ఆ తరువాత వీరిని లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.
దరఖాస్తు విధానం
- అభ్యర్థులు ముందుగా ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్సైట్ https://www.joinindianarmy.nic.in/ ఓపెన్ చేయాలి.
- క్యాప్చా ఎంటర్ చేసి వెబ్సైట్లోకి వెళ్లాలి.
- Officer Entry Application/Loginపై క్లిక్ చేయాలి.
- తరువాత Registration పై క్లిక్ చేసి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- తరువాత డాష్‌బోర్డ్ కింద ఉన్న Apply Online పై క్లిక్ చేయాలి.
- వెంటనే Officers Selection - Eligibility ఓపెన్ అవుతుంది.
- తరువాత 'షార్ట్ సర్వీస్ కమిషన్ ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ కోర్స్' ఎదురుగా ఉన్న Apply లింక్‌పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- తరువాత అన్ని వివరాలు సరిచూసుకుని, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అంతే సింపుల్!
ఆర్ట్స్ విద్యార్థుల కోసం IITs అందిస్తున్న బెస్ట్ కోర్సులు ఇవే! - Arts Students Career Options