ETV Bharat / business

జెరోధా ఫౌండర్​ నితిన్ కామత్​కు బ్రెయిన్ స్ట్రోక్​ - కారణం అదేనా! - Zerodha CEO Nithin Kamath

Zerodha CEO Nithin Kamath Heart Stroke : ప్రముఖ బ్రోకింగ్ ప్లాట్​ఫాం జెరోధా సహవ్యవస్థాపకుడు, సీఈఓ నితిన్​ బ్రెయిన్​ స్ట్రోక్​కు గురయ్యారు. ఇది జరిగి 6 వారాలు అయ్యిందని ఆయనే స్వయంగా ఎక్స్​ (ట్విట్టర్) పోస్ట్​ పెట్టారు.

Zerodha CEO Nithin Kamath heart attack
Zerodha CEO Nithin Kamath heart stroke
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 26, 2024, 4:33 PM IST

Updated : Feb 26, 2024, 4:57 PM IST

Zerodha CEO Nithin Kamath Heart Stroke : జెరోధా సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ నితిన్​ కామత్​ తాను 6 వారాల క్రితం బ్రెయిన్ స్ట్రోక్​కు గురైనట్లు సోమవారం పేర్కొన్నారు. ఎక్స్​ (ట్విట్టర్​) వేదికగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు.

"సుమారు ఆరువారాల క్రితం నాకు బ్రెయిన్​ స్ట్రోక్​ వచ్చింది. మా నాన్న చనిపోవడం, సరిగ్గా నిద్ర లేకపోవడం, అతిగా పనిచేయడం, అలసట, డీహైడ్రేషన్ వీటిలో ఏదైనా కారణం అయ్యుండవచ్చు."
- నితిన్ కామత్​, జెరోధా సీఈఓ

3-6 మాసాల్లో రికవర్ అవుతా!
'నా ఆరోగ్యం క్షీణించన తరువాత ముఖం పూర్తిగా పాలిపోయింది. ఏదైనా చదవడం, రాయడం కూడా కష్టమైపోయింది. అయితే ప్రస్తుతం కాస్త కోలుకుంటున్నాను. ఏదో కొంచెం చదవగలుగుతున్నాను, రాయగలుగుతున్నాను. కానీ పూర్తిగా కోలుకోవడానికి 3 నుంచి 6 నెలలు పట్టవచ్చు' అని నితిన్ కామత్ అన్నారు.

ఆశ్చర్యంగా ఉంది!
'సాధారణంగా నేను ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటాను. ఫిట్​గానూ ఉంటాను. కానీ నాకు కూడా ఇలా బ్రెయిన్​ స్ట్రోక్​ రావడం ఆశ్చర్యంగా ఉంది. ప్రస్తుతం నేను కాస్త జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ చెప్పారు. అందుకే నేను మునుపటిలా వేగంగా ట్రెడ్​మిల్​పై పరుగెత్తడం లేదు.' అని నితిన్ కామత్ పేర్కొన్నారు.

సోదరుడితో కలిసి
నితిన్ కామత్​ తన సోదరుడైన నిఖిల్​ కామత్​తో కలిసి జెరోధా అనే డిస్కౌంట్ బ్రోకింగ్ ప్లాట్​ఫామ్​ను నెలకొల్పారు.

దేశంలో నూతన ఆవిష్కరణలను, స్టార్టప్​లను ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం 2020 జనవరిలో నేషనల్ స్టార్టప్​ అడ్వైజరీ కౌన్సిల్​ (NASC)ని ఏర్పాటుచేసింది. 2023 డిసెంబర్​లో ఈ ఎన్​ఏఎస్​సీలో నితిన్​ కామత్​ నాన్​-అఫీషియల్ సభ్యునిగా నామినేట్ అయ్యారు.

బ్రెయిన్ స్ట్రోక్ ఎలా వస్తుందంటే?
మెదడులోని భాగాలకు రక్త ప్రసరణ జరగకుండా అంతరాయం ఏర్పడినప్పుడు లేదా రక్త ప్రసరణ తగ్గిపోయినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్​ వచ్చే అవకాశం ఉంది. ఎలా అంటే, రక్తప్రసరణ లేకపోతే మెదడుకు ఆక్సిజన్, పోషకాలు అందవు. దీనితో బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తుంది. తక్షణమే సరైన చికిత్స చేయకపోతే మెదడు పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది.

బ్రెయిన్ స్ట్రోక్​లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. అవి:

1. ఇస్కీమిక్​

2. హెమరేజిక్​

మెజారిటీ కేసులు ఇస్కీమిక్ స్ట్రోక్స్​కు సంబంధించినవే ఉంటాయి. రక్తనాళాల్లో రక్తం గట్టకట్టడం లేదా బ్లాక్​లు ఏర్పడుతుండడం జరుగుతుంది. దీని వల్ల మెదడుకు రక్తం సరఫరా కాదు. దీనిని ఇస్కీమిక్ స్ట్రోక్ అని అంటారు.

రక్తనాళాలు బలహీనపడి, చీలిపోయినప్పుడు మెదడులోకి రక్తం లీక్ అవుతుంది. దీని వల్ల హెమరేజిక్ స్ట్రోక్ వస్తుంది. ఇది చాలా అరుదుగా సంభవిస్తూ ఉంటుంది.

ఈ మూడిట్లో మీ శరీరంలో ఏ దోషం ఉంది? - ఇది తెలియకనే సకల రోగాలు!

భోజనం స్కిప్ చేస్తున్నారా? కొబ్బరి నీళ్లైనా తాగడం లేదా? అయితే కష్టమే!

Last Updated : Feb 26, 2024, 4:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.