Top 5 Credit Cards That Offer Free Lounge And Club Memberships : ప్రయాణాలు చేసేటప్పుడు అనుకోకుండా చాలా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ లాంజ్ల్లోకి, స్పాలు, గోల్ఫ్ కోర్టుల్లోకి వెళితే భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. వీటిని అదుపు చేసుకోకపోతే మన జేబుకే చిల్లుపడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే ప్రముఖ బ్యాంకులు అన్నీ తమ క్రెడిట్ కార్డుపై మంచి బెనిఫిట్స్, ఆఫర్స్ అందిస్తున్నాయి.
ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లు తమ క్రెడిట్ కార్డులపై కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్, ఫ్రీ స్పా విజిట్స్ లాంటి ప్రయోజనాలు కల్పిస్తున్నాయి. అలాగే ఫ్రీ గోల్ఫ్ రౌండ్స్, రివార్డ్ పాయింట్స్, క్లబ్ మెంబర్షిప్స్ అందిస్తున్నాయి. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ICICI Bank Sapphiro Card Benefits :
- ఐసీఐసీఐ బ్యాంక్ Sapphiro క్రెడిట్ కార్డు యూజర్లు, డ్రీమ్‌ఫోక్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా సంవత్సరానికి 2 సార్లు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంజ్‌లు యాక్సెస్ చేయవచ్చు. అలాగే ఏడాదికి రెండు సార్లు ఎయిర్పోర్ట్ స్పాలను సందర్శించవచ్చు. ఈ రెండూ పూర్తి ఉచితం.
- ఒక క్యాలెండర్ త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్ Sapphiro క్రెడిట్ కార్డు ఉపయోగించి రూ.5000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తే, తరువాతి త్రైమాసికంలో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్‌లను నాలుగు సార్లు పూర్తి ఉచితంగా విజిట్ చేయవచ్చు.
- ఈ ఐసీఐసీఐ బ్యాంక్ Sapphiro క్రెడిట్ కార్డ్ యూజర్లు ప్రతి నెలా ఫ్రీగా నాలుగు గోల్ఫ్ రౌండ్లను ఆడవచ్చు. నిర్దిష్ట పరిధికి మించి ఖర్చు చేస్తేనే ఈ కాంప్లిమెంటరీ బెనిఫిట్ లభిస్తుంది.
HDFC Bank Diners Club Black Metal Edition Credit Card Benefits :
- ఈ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డైనర్స్ క్లబ్ బ్లాక్ మెటల్ ఎడిషన్ క్రెడిట్ కార్డు యూజర్లకు అన్లిమిటెడ్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ సౌకర్యం ఉంటుంది.
- వీకెండ్ డైనింగ్ కోసం చేసే ఖర్చులపై 2X రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి.
- క్లబ్ మారియట్‌లో కాంప్లిమెంటరీగా వార్షిక సభ్యత్వం కూడా దొరుకుతుంది.
Marriott Bonvoy HDFC Bank Credit Card Bebefits :
- ఈ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లు మారియట్ బోన్వాయ్ హోటళ్లలో ఒక రాత్రి పూర్తి ఉచితంగా స్టే చేయవచ్చు. (15,000 పాయింట్ల విలువ వరకు మాత్రమే!)
- ఈ క్రెడిట్ కార్డు యూజర్లు, మారియట్ బోన్వాయ్ సిల్వర్ ఎలైట్ స్టేటస్ పొందవచ్చు. అలాగే 10 ఎలైట్ నైట్ క్రెడిట్స్ ఆస్వాదించవచ్చు.
SBI Card Elite Benefits :
- ఈ ఎస్బీఐ ఎలైట్ క్రెడిట్ కార్డుతో సంవత్సరానికి 6 సార్లు విదేశాల్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంజ్‌లను యాక్సెస్ చేయవచ్చు. అయితే ఒక త్రైమాసికానికి కేవలం రెండు సార్లు మాత్రమే ఇలా ఫ్రీ యాక్సెస్ పొందగలుగుతారు.
- ఈ కార్డుతో ప్రపంచంలోని దాదాపు 1000 విమానాశ్రయాల్లోని లాంజ్‌లను విజిట్ చేయవచ్చు.
- ఈ ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కాంప్లిమెంటరీగా క్లబ్ విస్తారా సిల్వర్ మెంబర్షిప్ లభిస్తుంది.
Kotak Mahindra Bank Zen Signature Credit Card :
- కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ జెన్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డు యూజర్లు సంవత్సరానికి 3 సార్లు విదేశాల్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంజ్‌లను ఉచితంగా యాక్సిస్ చేయవచ్చు.
- ఈ జెన్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డుతో ప్రపంచంలోని 1300 ఎయిర్పోర్ట్ లాంజ్‌లను విజిట్ చేయవచ్చు.
- ఈ కోటక్ మహీంద్రా క్రెడిట్ కార్డు యూజర్లు ఒక క్యాలెండర్ త్రైమాసికంలో భారతదేశంలోని డ్రీమ్ ఫోక్స్ లాంజ్‌లను రెండు సార్లు ఉచితంగా సందర్శించవచ్చు.
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ బెనిఫిట్ల గురించి తెలుసా?
కార్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ను మార్చాలా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!