ETV Bharat / business

మీ లైఫ్​ స్టైల్​కు - ఏ క్రెడిట్ కార్డు మంచిదో తెలుసా? - Tips to Choose Credit Card

Tips to Choose Right Credit Card: క్రెడిట్ కార్డు తీసుకునేవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. అయితే.. తాము చేసే పనులు, అవసరాలకు అనుగుణంగా ఎలాంటి క్రెడిట్ కార్డు ఎంపిక చేసుకోవాలనే విషయం మాత్రం చాలా మందికి తెలియట్లేదు. మరి.. మీకు ఎలాంటి క్రెడిట్ కార్డ్ మంచిదో తెలుసా?

Tips to Choose Right Credit Card
Tips to Choose Right Credit Card
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 3, 2024, 11:43 AM IST

Tips to Choose Right Credit Card For Daily Life: నేటి డిజిటల్​ యుగంలో క్రెడిట్‌ కార్డ్‌ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మార్కెట్లోకి చాలా రకాల క్రెడిట్‌ కార్డులు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే.. ఆఫర్స్​, రివార్డులు, తక్కువ వడ్డీలు అందించేవి బోలెడు ఉన్నా.. వాటి గురించి చాలా మందికి తెలియట్లేదు. కాబట్టి.. కేవలం కంపెనీలు అందిస్తున్న ప్రయోజనాలు మాత్రమే కాకుండా మీ డైలీ అవసరాలకు ఎలాంటి క్రెడిట్‌ కార్డు సరిపోతుందో తెలుసుకొని.. వాటిని తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

మీ కుటుంబం కోసం బడ్జెట్ వేసుకోవాలా? ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే!

సరైన క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకోవడానికి టిప్స్​:

కార్డు ఎంపిక: కొన్ని క్రెడిట్ కార్డ్స్ .. ట్రావెలింగ్, ఇంధనం, షాపింగ్ వంటి కేటగిరీలపై ఎక్కువ ప్రయోజనాలు అందిస్తుంటాయి. కాబట్టి.. మీరు దేని మీద ఎక్కువ ఖర్చు చేస్తున్నారో గుర్తుంచుకుని.. ఆ కేటగిరీలోని కార్డును తీసుకోవడం మంచిది. ఒకవేళ మీరు వాహనంలో పెట్రోల్​ కోసం క్రెడిట్ కార్డును ఎక్కువగా ఉపయోగిస్తారని అనుకుంటే.. ఫ్యూయెల్ క్రెడిట్ కార్డులు ఎంచుకోవడం బెస్ట్​.

రివార్డ్స్​: మీరు క్రెడిట్ కార్డ్స్ కొనేముందు వాటి బెనిఫిట్స్​ తెలుసుకోవాలి. కొన్ని కార్డ్‌లు క్యాష్ బ్యాక్‌ అందిస్తాయి. మరికొన్ని ట్రావెల్ పాయింట్లు అందిస్తాయి. అందువల్ల.. మీ జీవనశైలి, ప్రాధాన్యతలకు అనుగుణంగా రివార్డ్‌లు కలిగిన కార్డ్‌ని ఎంచుకోండి.

వార్షిక ఫీజు: క్రెడిట్ కార్డ్‌ వార్షిక రుసుము ఎంత ఉందో చెక్​ చేయాలి. మంచి ప్రయోజనాలతో కార్డు ఉందంటే.. వార్షిక రుసుము కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వార్షిక రుసుము కంటే మీకు ఎక్కువ ప్రయోజనాలు వస్తున్నాయో లేదో తెలుసుకోవడం చాలా అవసరం.

క్రెడిట్​ కార్డ్స్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోవడం మస్ట్!

వడ్డీ రేట్లు: క్రెడిట్ కార్డ్‌ వడ్డీ రేట్లను తనిఖీ చేయడం కూడా ముఖ్యమే. తక్కువ వడ్డీ రేట్లు విధించే కార్డులు మీకు డబ్బును ఆదా చేస్తాయి.

క్రెడిట్ పరిమితి: క్రెడిట్ లిమిట్‌ కూడా చూసుకోవాలి. మంచి క్రెడిట్ లిమిట్ ఉంటే.. దానికి తగ్గట్టుగానే క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో ఉండాలి. నెలవారీ ఖర్చులు అధికంగా ఉన్నవారికి అధిక క్రెడిట్ పరిమితి ప్రయోజనకరంగా ఉంటుంది.

అదనపు ప్రయోజనాలు: ప్రయాణ బీమా, కొనుగోలు రక్షణ లేదా విమానాశ్రయ లాంజ్‌లకు యాక్సెస్ వంటి అదనపు ప్రయోజనాలను అందించే కార్డులను ఎంచుకోవాలి.

క్రెడిట్‌ కార్డు మంచిదే అనడానికి 6 కారణాలు - మీకు తెలుసా?

కంపెనీ వివరాలు: క్రెడిట్ కార్డ్ జారీ చేసే సంస్థ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. కస్టమర్ సేవలు ఏ విధంగా ఉన్నాయి? సేఫ్టీ ఎలా ఉంది? అనే విషయాన్ని గమనించాలి. అలాగే ఇతర కస్టమర్లు ఇచ్చే రివ్యూలను పరిశీలించాలి. ఇవన్నీ కరెక్ట్​గా ఉంటే అప్పుడు కార్డును తీసుకోవడం బెటర్​.

టర్మ్స్​ అండ్​ కండీషన్స్​: అలాగే క్రెడిట్ కార్డ్‌ తీసుకునే ముందు అందుకు సంబంధించిన టర్మ్స్​ అండ్​ కండీషన్స్​ పూర్తిగా చదవాలి. ఫీజులు, జరిమానాలు వంటి వివరాలు పూర్తిగా తెలుసుకన్న తర్వాత మీ అవసరానికి అనుగుణంగా క్రెడిట్​ కార్డును ఎంచుకోవాలి.

ఈ టాప్​-5 క్రెడిట్ కార్డ్స్​తో - ఎయిర్​పోర్ట్ లాంజ్​ యాక్సెస్, క్లబ్ మెంబర్​షిప్ ఫ్రీ!

ఫ్రీగా ప్రపంచాన్ని చుట్టేయాలా? క్రెడిట్ కార్డు ఉంటే సరిపోతుంది! అదెలాగంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.