ETV Bharat / business

యాపిల్​ ఇంటెలిజెన్స్​తో ఐఫోన్​16- టచ్‌ సెన్సిటివ్‌ కెమెరా, న్యూరల్‌ ఇంజిన్‌ చిప్‌- అబ్బో చాలా ఫీచర్లున్నాయ్​! - Apple Iphone 16 Launch

Apple Iphone 16 Launch : దిగ్గజ టెక్​ కంపెనీ యాపిల్​, ఐఫోన్​ 16 సిరీస్​ ఫోన్లను లాంఛ్​ చేసింది. దీంతో పాటు యాపిల్​ వాచ్​ వంటి పలు ప్రొడక్ట్​లను విడుదల చేసింది. యాపిల్​ ఇంటెలిజెన్స్​ ప్రధాని ఆకర్షణగా విడుదలైన ఐఫోన్​ 16 స్టన్నింగ్ ఫీచర్లివే!

Apple Iphone 16 Launch
Apple Iphone 16 Launch (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2024, 9:46 AM IST

Updated : Sep 10, 2024, 10:30 AM IST

Apple Iphone 16 Launch : యాపిల్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఐఫోన్​ 16ను సంస్థ లాంఛ్​ చేసింది. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో వేదికగా జరిగిన ఈవెంట్‌లో యాపిల్‌ పలు కొత్త ఉత్పత్తులను రిలీజ్​ చేసింది. "ఇట్స్‌ గ్లోటైమ్‌" పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఐఫోన్‌ 16 సిరీస్‌ ఫోన్లతో పాటు యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 10, ఎయిర్‌పాడ్స్‌ 4ను విడుదల చేసింది. వరల్డ్​ వైడ్​గా టెక్‌ ప్రియులు ఎంతో ఆత్రుతగా ఈ ఈవెంట్‌ను లైవ్​లో చూశారు. కాలిఫోర్నియాలోని యాపిల్‌ పార్క్‌లో ఈ వేడుక అట్టహాసంగా జరిగింది.

ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ టిమ్‌ కుక్‌ ఈ ఉత్పత్తులకు సంబంధించిన విశేషాలు పంచుకున్నారు. ఐఫోన్‌ 16 సిరీస్‌ ఫోన్లు అనేక కొత్త ఫీచర్లతో వచ్చాయి. ఈ కొత్త మోడళ్లలో 'యాపిల్‌ ఇంటెలిజెన్స్‌' ప్రధాన ఆకర్షణగా మారింది. ఈ సిరీస్​లో కొత్తగా టచ్‌ సెన్సిటివ్‌ కెమెరాతో పాటు, యాక్షన్‌ బటన్‌ పొందుపర్చారు. కొత్త సిరీస్‌ ఫోన్లలో ఏ18 చిప్‌ అమర్చారు. న్యూరల్‌ ఇంజిన్‌తో కూడిన ఈ చిప్‌, రెండు రెట్లు వేగవంతంగా పనిచేస్తుందని సంస్థ పేర్కొంది. 17 శాతం ఎక్కువ బ్యాండ్‌ విడ్త్‌తో కూడిన అప్‌గ్రేడెడ్‌ మెమోరీ సబ్‌సిస్టమ్‌ను ఇది కలిగి ఉన్నట్లు యాపిల్‌ వెల్లడించింది.

ఐఫోన్​ 16 సిరీస్​ ప్రధాన ఫీచర్లు, ధరలు

ఫీచర్లు/ మోడల్ఐఫోన్​ 16 ఐఫోన్​ 16 ప్లస్ఐఫోన్​ 16 ప్రొఐఫోన్ 16 ప్రో మ్యాక్స్​
డిస్​ప్లే6.10అంగుళాలు6.70అంగుళాలు6.3అంగుళాలు6.9అంగుళాలు
ప్రాసెసర్యాపిల్​ ఏ18యాపిల్​ ఏ18యాప్రిల్ ఏ18 ప్రొయాప్రిల్ ఏ18 ప్రొ
ప్రంట్​ కెమెరా12MP12MP12MP12MP
రేర్​ కెమెరా48MP+12MP48MP+12MP48MP+48MP48MP+48MP
RAM8GB8GB8GB8GB
స్టోరీజీ128GB128GB128GB( బేస్​ మోడల్)128GB( బేస్​ మోడల్)
ఓఎస్iOS 18iOS 18iOS 18iOS 18
రిసొల్యూషన్1179x2556 పిక్సెల్స్​1290x796 పిక్సెల్స్​--
ధరరూ.79,000రూ.89,000రూ.1,19,900రూ.1,44,900

బుకింగ్స్​ ఓపెన్​ అప్పటినుంచే!
సంస్థ కోర్ ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ ఇంటెలిజెన్స్‌ అయిన యాపిల్​ ఇంటెలిజెన్స్​ సహాయంతో ఫోన్‌లోని యాప్‌లను చాలా సులువుగా ఉపయోగించుకోవచ్చని, వందలకొద్ది కొత్త యాక్షన్స్‌ చేపట్టవచ్చని యాపిల్​ పేర్కొంది. వచ్చే నెలలో బీటా వెర్షన్‌లో ఇంగ్లీష్‌లో యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ను రిలీజ్​ చేయనున్నట్లు తెలిపింది. అనంతరం చైనీస్‌, ఫ్రెంచ్‌, జపనీస్‌, స్పానిష్‌ భాషల్లో ఇది విడుదల కానుంది. అయితే భారతీయ భాషలకు సంబంధించి యాపిల్​ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ ఐఫోన్​ 16 సిరీస్‌ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని యాపిల్‌ చెప్పినప్పటికీ, దానికి సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. కాగా, సెప్టెంబర్‌ 13 నుంచి ఐఫోన్​ 16 సిరీస్​ ఫోన్ల ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్‌ 20 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త మోడళ్లలో యాపిల్‌ మ్యాగ్‌సేఫ్‌ ఛార్జింగ్‌ స్పీడ్‌ను 15 వాట్స్‌ నుంచి 25 వాట్స్‌కు పెంచింది.

సరికొత్త యాపిల్​ వాచ్​

యాపిల్‌ తన ఈవెంట్‌లో మొదటగా వాచ్‌ సిరీస్‌ 10ను విడుదల చేసింది. ఈ వాచ్‌ సిరీస్‌లో పలు అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఉన్నాయి. గత వాచ్‌లతో పోలిస్తే ఈ వాచ్‌ల డిస్‌ప్లేలు చాలా పెద్దవని యాపిల్‌ ప్రకటించింది. వీటిలో తొలిసారి వైడ్‌ యాంగిల్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇచ్చారు. ధరల విషయానికి వస్తే జీపీఎస్‌ ధర 399 డాలర్లు, జీపీఎస్‌+ సెల్యూలార్‌ 499, అల్ట్రా 2 ధరను 799 డాలర్లుగా నిర్ణయించారు.

యాపిల్ ఎయిర్​ప్యాడ్​
ఎయిర్‌ప్యాడ్‌ల విషయానికి వస్తే సిరి ఫీచర్‌ను ఎయిర్‌ప్యాడ్‌ 4లో ఇచ్చారు. కొత్త ఎయిర్‌ప్యాడ్‌లో 30 గంటల బ్యాటరీ సామర్థ్యం ఇచ్చారు. టైప్‌ సీ ఛార్జింగ్‌ ఇచ్చారు. వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేయనున్నాయి. యాపిల్‌ వాచ్‌ ఛార్జర్‌లతో పాటు ఇతర క్యూఐ వైర్‌లెస్‌ ఛార్జర్లను సైతం వాడుకోవచ్చు. ధర విషయానికి వస్తే ఎయిర్‌పాడ్స్‌ 4ను 129 డాలర్లుగా, యాక్టివ్‌ నాయిస్‌ క్యానిసిలేషన్‌ మోడల్‌ ధరను 179 డాలర్లుగా నిర్ణయించారు. ఎయిర్‌పాడ్స్‌ మ్యాక్స్‌ను కొత్తగా ఐదు రంగుల్లో తీసుకొచ్చారు. ఈ హెడ్‌ఫోన్స్‌ యూఎస్‌బీ సీ టైప్‌ ఛార్జర్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఐఓఎస్‌ 18తో ఇది పనిచేస్తుంది. దీని ధరను 599 డాలర్లుగా నిర్ణయించారు.

రీన్యూడ్ Vs రీఫర్బిష్డ్ Vs ఓపెన్ బాక్స్ ప్రోడక్ట్స్ - వీటిలో ఏది కొంటే బెటర్? - Renewed Vs Refurbished Phones

పిల్లల కోసం యాపిల్‌ వాచ్‌లో సరికొత్త ఫీచర్‌ - ఎలా పనిచేస్తుందంటే? - Apple Watch For Your Kids

Last Updated : Sep 10, 2024, 10:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.