ETV Bharat / business

ఆల్ టైమ్ హై రికార్డ్​ వద్ద ముగిసిన సెన్సెక్స్ & నిఫ్టీ! - Stock Market Today - STOCK MARKET TODAY

Stock Market Close : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా ఫార్మా, ఆయిల్, గ్యాస్​ స్టాక్స్ బాగా రాణించాయి. సెన్సెక్స్, నిఫ్టీ జీవనకాల గరిష్ఠాల వద్ద స్థిరపడ్డాయి.

Share Market Today
Stock Market Today (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 15, 2024, 9:47 AM IST

Updated : Jul 15, 2024, 3:44 PM IST

Stock Market Close : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం మంచి లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​, నిఫ్టీలు జీవనకాల గరిష్ఠాల వద్ద స్థిరపడ్డాయి. ఫార్మా, ఆయిల్, గ్యాస్ స్టాక్స్ రాణించడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 145 పాయింట్లు లాభపడి 80,664 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ 84 పాయింట్లు వృద్ధి చెంది 24,586 వద్ద ముగిసింది.

  • లాభపడిన స్టాక్స్ : ఎస్​బీఐ, ఎన్​టీపీసీ, ఆల్ట్రాటెక్ సిమెంట్​, ఎం అండ్ ఎం, బజాజ్​ ఫైనాన్స్​, టాటా మోటార్స్​, మారుతి సుజుకి, ఐటీసీ, అదానీ పోర్ట్స్​
  • నష్టపోయిన షేర్స్​ : ఏసియన్ పెయింట్స్​, టాటా స్టీల్​, యాక్సిస్ బ్యాంక్​, టెక్ మహీంద్రా, టీసీఎస్​, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్​, టైటాన్​, ఐసీఐసీఐ బ్యాంక్​,

12.30 PM : ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 158 పాయింట్లు లాభపడి 80,666 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ 79 పాయింట్లు వృద్ధి చెంది 24,581 వద్ద ట్రేడవుతోంది.

Stock Market Today July 15, 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 95 పాయింట్లు వృద్ధిచెంది 24,598 వద్ద జీవన కాల గరిష్ఠాన్ని తాకింది. ఐటీ స్టాక్స్ రాణిస్తుండడం, విదేశీ సంస్థాగత పెట్టుబడులు పెరుగుతుండడమే ఇందుకు కారణం. దీనికి తోడు గ్లోబల్ మార్కెట్స్ ర్యాలీ కొనసాగుతుండడం కూడా మదుపరుల సెంటిమెంట్​ను బలపరుస్తోంది.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 60 పాయింట్లు లాభపడి 80,580 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ 45 పాయింట్లు వృద్ధి చెంది 24,547 వద్ద ట్రేడవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : హెచ్​సీఎల్ టెక్​, మారుతి సుజుకి, ఆల్ట్రాటెక్ సిమెంట్​, టాటా మోటార్స్​, ఎం అండ్ ఎం, ఎస్​బీఐ, కోటక్ బ్యాంక్​, టీసీఎస్​, భారతీ ఎయిర్​టెల్​, నెస్లే ఇండియా
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ​ఏసియన్ పెయింట్స్​, టాటా స్టీల్​, యాక్సిస్ బ్యాంక్​, పవర్​గ్రిడ్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, టైటాన్​, ఐసీఐసీఐ బ్యాంక్​, ఇన్ఫోసిస్​, బజాజ్​ ఫిన్​సెర్వ్​, హిందూస్థాన్ యూనిలివర్

ఆసియా మార్కెట్లు
Asian Markets July 15, 2024 : ఆసియా మార్కెట్లలో సియోల్​, షాంఘై లాభాల్లో కొనసాగుతుండగా, హాంకాంగ్​ నష్టాల్లో ట్రేడవుతోంది. శుక్రవారం యూఎస్ మార్కెట్లు లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే.

విదేశీ పెట్టుబడులు
FIIs Investment : స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, శుక్రవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఏకంగా రూ.4,021.60 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. మరోవైపు దేశీయ సంస్థాగత మదుపరులు (DIIs) jt.1,651 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు.

రూపాయి విలువ
Rupee Open July 15, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 4 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.55గా ఉంది.

ముడి చమురు ధర
Crude Oil Prices July 15, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.20 శాతం పెరిగాయి. దీనితో ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 85.20 డాలర్లుగా ఉంది.

బంగారు, వెండి ఆభరణాలు కొనాలా? తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today

'పన్ను మినహాయింపు పరిమితిని రూ.5లక్షలకు పెంచాల్సిందే' - AIFTP

Last Updated : Jul 15, 2024, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.