SBI MOD Scheme : దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ 'మల్టీ-ఆప్షన్ డిపాజిట్ అకౌంట్'(SBI MOD) అనే ఒక ప్రత్యేకమైన డిపాజిట్ స్కీమ్‌ను అందిస్తోంది. వాస్తవానికి ఇది ఒక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్. అయినప్పటికీ ఇతర ఎఫ్డీల్లా కాకుండా, ఇందులో పొదుపు చేసిన డబ్బులను మీకు నచ్చినప్పుడు విత్‌డ్రా చేసుకోవచ్చు.
సాధారణ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్‌లో పొదుపు చేస్తే, అందులోని మొత్తాన్ని నిర్దిష్ట సమయం వరకు విత్‌డ్రా చేసుకోవడానికి వీలుపడదు. కానీ ఈ ఎస్బీఐ మల్టీ-ఆప్షన్ డిపాజిట్ అకౌంట్లో పొదుపు చేసిన మొత్తాన్ని మీకు నచ్చినప్పుడు పాక్షికంగా ఉపసంహరించుకోవచ్చు. పైగా ఇందుకోసం ఎలాంటి అదనపు రుసుములు, పెనాల్టీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
ఎస్బీఐ ఎంఓడీ అకౌంట్ నుంచి రూ.1000 లేదా రూ.2000 లేదా రూ.3000 ఇలా (Multiples of Rs1000) విత్‌డ్రా చేసుకోవచ్చు. అకౌంట్లోని మిగిలిన మొత్తానికి, ముందుగానే నిర్ణయించిన ప్రకారం వడ్డీ లభిస్తూ ఉంటుంది.
How To Open an SBI MOD Account?
ఎస్బీఐ ఎంఓడీ ఖాతా తెరవడం ఎలా?
మీరు నేరుగా ఎస్బీఐ బ్రాంచ్‌కు వెళ్లి ఎస్బీఐ ఎంఓడీ ఖాతాను తెరవవచ్చు. లేదా ఎస్బీఐ పోర్టల్ ద్వారా ఆన్లైన్లోనే ఈ ఎఫ్డీని ఓపెన్ చేయవచ్చు. మీరు గనుక అత్యవసరంగా డబ్బులు విత్‌డ్రా చేయాలని అనుకుంటే, నేరుగా ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసుకోవచ్చు. లేదా చెక్ రూపంలో కూడా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.
SBI MOD Scheme Interest Rate
ఎస్బీఐ ఎంఓడీ స్కీమ్‌లో సాధారణ ఖాతాదారులకు 7 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 0.5 శాతం మేర అదనపు వడ్డీ దొరుకుతుంది.
SBI MOD Scheme Eligibility :
ఈ ఎస్బీఐ మల్టీ-ఆప్షన్ డిపాజిట్ అకౌంట్‌ను భారతీయ పౌరులు అందరూ ఓపెన్ చేయవచ్చు. అంటే భారతదేశంలో నివశిస్తున్న వారితోపాటు, ప్రవాస భారతీయులు కూడా ఈ ఎఫ్డీ స్కీమ్‌లో చేరవచ్చు. అలాగే హిందూ అవిభాజ్య కుటుంబాలు (HUF), కంపెనీలు, సహా అర్హతలు కలిగిన ఇతరులు కూడా ఈ స్కీమ్‌లో చేరేందుకు అవకాశం ఉంది.
మల్టీబ్యాగర్ స్టాక్ - రూ.1లక్ష పెట్టుబడితో రూ.1కోటి లాభం - ఆ షేర్ ఏదో తెలుసా? - Multibagger Stock