NITES Complaint Against Infosys : దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌పై ఐటీ ఉద్యోగుల సంఘం 'నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్'(NITES) ఆగ్రహం వ్యక్తం చేసింది. క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లలో ఇన్ఫోసిస్ చేసిన తీవ్ర జాప్యం వల్ల 2000 మందికిపైగా నిపుణులకు తీవ్రమైన నష్టం జరుగుతోందని NITES కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. సుమారు 2,000 మంది క్యాంపస్ రిక్రూట్లకు ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను ఇన్ఫోసిస్ కంపెనీ పదేపదే ఆలస్యం చేస్తోందని, ఇది ఉద్యోగులకు ఆర్థిక, మానసిక ఇబ్బందులను కలిగిస్తోందని ఈ సంస్థ ఆరోపించింది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని NITES కార్మిక మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేసింది. క్యాంపస్ రిక్రూట్స్ ఆన్‌బోర్డింగ్ జాప్యం రెండు సంవత్సరాలకుపైగా కొనసాగుతూనే ఉందని, ఇది ప్రతిభావంతులైన నిపుణులకు గణనీయమైన కష్టాలను తెచ్చిపెట్టిందని ఫిర్యాదులో పేర్కొంది.
తీవ్ర ఇబ్బందులు
ఇన్ఫోసిస్‌లో రెండేళ్లుగా ఆన్‌బోర్డింగ్ జాప్యం కొనసాగుతోందని NITES కార్మికశాఖకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో బాధితులు అనిశ్చితి, ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారని యూనియన్ పేర్కొంది. ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్లు ఇవ్వడం వల్ల చాలామంది నిపుణులు వేరే ఉద్యోగ అవకాశాలను తిరస్కరించారని ఐటీ ఉద్యోగుల సంఘం కేంద్రానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ ఆన్‌బోర్డింగ్ టైమ్‌లైన్ లేకపోవడం వల్ల ఇప్పటికే ఆఫర్ లెటర్లు పొందిన వారు ఆర్థిక ఇబ్బందులు, అనిశ్చితిని ఎదుర్కొంటున్నారని ఎన్ఐటీఈఎస్ ప్రకటనలో తెలిపింది.
యువ నిపుణుల విషయంలో ఇన్ఫోసిస్ చర్యలు తీవ్రమైన విశ్వాస ఉల్లంఘనగా కనిపిస్తున్నాయని నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ఇన్ఫోసిస్ రిక్రూట్‌మెంట్ల విషయంలో కొత్త నియామాలు రూపొందించేలా ఆదేశించాలని, ఈ జాప్యంపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆన్‌బోర్డింగ్ ఆలస్యమైన కాలానికి ఇప్పటికే ఆఫర్ లెటర్లు పొందిన యువ నిపుణులకు ఇన్ఫోసిస్ పూర్తి జీతాలు చెల్లించాలని NITES డిమాండ్ చేసింది. ఆలస్యం కారణంగా ఏర్పడిన మానసిక ఒత్తిడిని పరిష్కరించడానికి ఇన్ఫోసిస్ ఉద్యోగుల సహాయ కార్యక్రమానికి నిర్వహించాలని కోరింది. ఆన్‌బోర్డింగ్ ఇలాగే కొనసాగితే, సంస్థలో ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను కనుగొనడంలో నియామకాలకు ఇన్ఫోసిస్ బాధితులకు సహాయం అందించాలని ఎన్ఐటీఈఎస్ కోరింది.
గతంలోనూ ఇంతే
ఐటీ సంస్థలపై ఎన్ఐటీఈఎస్ చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. టీసీఎస్ 200 లేటరల్ రిక్రూట్మెంట్లను ఆలస్యం చేసిందని కూడా గతంలో ఎన్ఐటీఈఎస్ కార్మిక శాఖకు ఫిర్యాదు చేసింది. TCSకు మహారాష్ట్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ గత అక్టోబర్‌లో నోటీసులు జారీ చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో యువ ఉద్యోగుల నిష్పత్తి టీసీఎస్‌లో ఐదేళ్ల కనిష్టానికి, ఇన్ఫోసిస్‌లో దశాబ్ద కనిష్ఠానికి పడిపోయాయి.
RBI మన బంగారాన్ని విదేశాల్లో స్టోర్ చేస్తుంటుంది - ఎందుకో తెలుసా? - Indias Gold Reserves In Foreign