Nil Income Tax Return Filing : పన్ను చెల్లింపుదారులు ప్రతి సంవత్సరం లాగే, ఈ ఏడాది కూడా ఆదాయపు పన్ను రిటర్నులను (ITR) ఫైల్ చేయడానికి గడువు జులై 31. ఈ నేపథ్యంలో అసలు ఇన్కమ్ టాక్స్ ఎవరు కట్టాలి? ఎవరు కట్టాల్సిన అవసరం లేదు? ఏ వర్గం ప్రజలకు ఈ పన్ను నుంచి మినహాయింపు ఉంటుందో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
పన్ను చెల్లించాల్సి సమయం ఆసన్నమైనప్పుడు చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు. ఫారం 16 అని, 26ASతో సహా అవసరమైన వివిధ డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవడంలో బిజీగా ఉంటారు. పన్ను చెల్లించే విషయంలో గందరగోళంగా ఉంటుంది. మొదటి సారి పన్ను చెల్లించేవారు ఇబ్బంది పడతారు. కొందరికి ఆదాయపు చట్టం కింద పన్ను చెల్లింపుల నుంచి మినహాయింపు ఉంది. ఫలితంగా వారు పన్ను చెల్లించాల్సిన పనిలేదు.
మినహాయింపు వర్తించేదెవరికి?
ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 139(1) ప్రకారం పరిమితి కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులకు పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. పాత పన్ను విధానంలో అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షలు సంపాదించేవాళ్లు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడున్న నిబంధనల ప్రకారం అది రూ. 3 లక్షలకు చేరింది. అంటే ఏడాదికి ఆదాయం రూ. 3 లక్షలు ఉన్నవాళ్లు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
పన్ను మినహాయింపు పరిమితి అనేది మనం ఎంచుకున్న విధానంపై ఆధారపడి ఉంటుంది. దీంతో పాటు పన్ను చెల్లింపుదారుడి వయస్సు కూడా పరిగణలోకి తీసుకుంటారు. కేంద్ర బడ్జెట్ - 2023లో ప్రభుత్వం కొత్త మినహాయింపు పరిమితిని ప్రవేశపెట్టింది. గతంలో రూ. 2.50 లక్షల నుంచి ఉన్న పరిమితిని రూ.3 లక్షలకు పెంచింది. ఈ ఆదాయం కన్న తక్కువ ఉన్నవారు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ టాక్స్ రిటర్న్ దాఖలు చేయాలంటే 'నిల్ ఐటీఆర్'ను ఫైల్ చేసుకోవచ్చు. ఇది తప్పని సరేం కాదు. ఇలా చేయడం వల్ల నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి నిల్ లేదా జీరో రిటర్న్‌ను దాఖలు చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలుసుకుంటుంది. ఇలా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
నిల్ ఐటీఆర్ లాభాలు
మొదటిగా మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసినట్లు రుజువుగా ఉంటుంది. దీని ద్వారా లోన్ ప్రాసెసింగ్ సులభం అవుతుంది. అడ్రస్ ప్రూఫ్, స్పీడ్ వీసా ప్రాసెసింగ్, టర్మ్ ఇన్సూరెన్స్ కొనడం మొదలైన వాటిలో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా పన్ను రిటర్నలు ఆదాయానికి రుజువుగా కూడా పనిచేస్తుంది.
నిల్ ఐటీఆర్ ఎలా ఫైల్ చేయాలి?
దీని కోసం ప్రత్యేక పద్దతంటూ ఏం లేదు. సాధారణంగా ఐటీఆర్‌ను దాఖలు చేసే విధంగానే నిల్ ఐటీఆర్‌ను ఫైల్ చేయడమే. అయితే సాధారణ ఐటీఆర్ గడువు లోపు నిల్ రిటర్నులు దాఖలు చేయడం మంచిది.
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్- 13గంటల పాటు సేవలు బంద్! ఎప్పుడో తెలుసా? - hdfc bank services down
కష్టపడి ఇల్లు కట్టుకున్నారా? బీమా చేసి ధీమాగా ఉండండి! - Home Insurance Policy Benefits