ETV Bharat / business

మొబైల్ యూజర్స్​కు షాక్- రీఛార్జ్​ ధరలు భారీగా పెంపు! - mobile recharge rate increase - MOBILE RECHARGE RATE INCREASE

Mobile Recharge Rate Increase : పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొబైల్ యూజర్లకు షాక్ తగలనుంది! తమ టారిఫ్‌ ఛార్జీలను సవరించేందుకు టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. టెలికాం టారిఫ్ పెంపుతో భారతీ ఎయిర్​టెల్ అతిపెద్ద లబ్ధిదారుగా నిలవనుంది.

Telecom Tariff Hike In India
Telecom Tariff Hike In India
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 11, 2024, 3:34 PM IST

Mobile Recharge Rate Increase : సార్వత్రిక ఎన్నికల తర్వాత మొబైల్ వినియోగదారులకు షాక్ తగలనుందా? టెలికాం టారిఫ్ ఛార్జీలు మరో రెండు నెలల్లో పెరగనున్నాయా? ఈ ప్రశ్నకు అవుననే అంటున్నారు మార్కెటింగ్ నిపుణులు. లోక్ సభ ఎన్నికల తర్వాత టెలికాం టారిఫ్ పెంపు ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాదాపు 15-17 శాతం వరకు టారిఫ్ ఛార్జీలను టెలికాం కంపెనీలు పెంచుతాయని చెబుతున్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ అతిపెద్ద లబ్ధిదారు కానుందని అంటున్నారు.

భారత్​లో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 మధ్య ఏడు దశల్లో జరగనున్నాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఆ తర్వాత టెలికాం టారిఫ్ ఛార్జీలు పెంచనున్నట్లు తెలుస్తోంది. 'ఎన్నికల తర్వాత టెలికాం పరిశ్రమ 15-17 శాతం టారిఫ్ పెంచుతుందని అంచనా వేస్తున్నాం' అని యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ సంస్థ తన నివేదికలో పేర్కొంది.

2021 డిసెంబర్‌లో చివరిసారిగా భారతీ ఎయిర్​టెల్ 20 శాతం టారిఫ్ ఛార్జీలను పెంచింది. ఈసారి టారిఫ్ పెంపుతో భారతీ ఎయిర్​టెల్ సగటు వినియోగదారు ఆదాయం(ARPU) రూ.208 నుంచి రూ.286కు పెరగనుందని అంచనా. ఇక జియో ARPU రూ.182 కాగా, వొడాఫోన్‌ ఐడియా రూ.145గా ఉంది. మార్కెట్‌ వాటా పరంగా జియో అగ్రగామిగా ఉంది. ఎయిర్‌టెల్‌ రెండో స్థానంలో ఉంది. 18 శాతం వాటాతో వొడాఫోన్ ఐడియా మూడో స్థానంలో కొనసాగుతోంది.

సునీల్ మిత్తల్ నేతృత్వంలోని భారతీ ఎయిర్‌టెల్ గత దశాబ్ద కాలంలో సుంకాల పెంపు, 2G అప్‌గ్రేడేషన్, ఫైబర్ టు ది హోమ్, 5G ప్రారంభమైన తర్వాత మూడు సంవత్సరాల్లో అత్యుత్తమ ఆర్థిక పనితీరును కనబరుస్తోందని యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ సంస్థ అంచనా వేసింది. ఎయిర్‌టెల్‌ 2021 నవంబర్‌లో 20 శాతం మేర టారిఫ్ ఛార్జీలను పెంచింది. ఆ తర్వాత కొద్ది రోజులకే వొడాఫోన్‌, జియో సైతం ఈ దారిలో ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో మూడో త్రైమాసికంలో ఆయా కంపెనీలు పెద్ద ఎత్తున చందాదారులను కోల్పోయాయి. ఎయిర్‌టెల్‌ ఒక్కటే 6 లక్షల మందిని చేజార్చుకుంది.

క్రెడిట్ కార్డ్​తో యూపీఐ పేమెంట్స్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి! - Credit Cards For UPI Payments

మొదటిసారి కారు కొంటున్నారా? ఈ టాప్​-10 సేఫ్టీ ఫీచర్స్​ మస్ట్​! - Top 10 Car Safety Features

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.