LIC Claims Settlement Procedure : మెచ్యూరిటీ క్లెయిమ్‌లకు సబంధించి లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా (LIC) కీలక సూచనలు చేసింది. పాలసీదారులు మెచ్యూరిటీ, డెత్ క్లెయిమ్‌లకు సంబంధించిన అంశాలను తప్పనిసరిగా ఎప్పటికప్పుడూ సరిచూసుకోవాలని సిఫార్సు చేసింది. ఎందుకంటే బీమా పాలసీని కొనుగోలు చేసేటప్పుడు ప్రధానంగా ఆందోళన కలిగించే అంశాల్లో ఒకటి క్లెయిమ్ పరిష్కరం. అయితే భారతదేశంలో బీమా రెగ్యులేటర్ క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్ రేషియోను ఎల్‌ఐసీ పబ్లిక్‌గా బహిర్గతం చేస్తుంది. ఇది పాలసీ హోల్డర్‌లకు నమ్మకాన్ని కలిగించే విషయం. అలాగే బీమా పాలసీలు వినియోగదారుడి అవసరాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో నిర్ణయించడంలో ఇది సహాయపడుతుందని పేర్కొంది.
ఇక మరింత సులభంగా చెప్పాలంటే క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్ రేషియో అనేది ఒక గణన మెట్రిక్. ఇది క్లెయిమ్‌ల సంఖ్యతో సంబంధం లేకుండా బీమా సంస్థ సెటిల్ చేసిన క్లెయిమ్‌ల నిష్పత్తిని అంచనా వేస్తుంది. ఈ నిష్పత్తి బీమా క్లెయిమ్‌లను నెరవేర్చే కీలకమైన సూచికగా పనిచేస్తుంది. పాలసీదారుడు దురదృష్టవశాత్తు మరణించిన సందర్భంలో క్లెయిమ్‌ను సమర్థంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని ఆ వ్యక్తి కుటుంబానికి హామీ ఇస్తుంది.
లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియోతోపాటు పాలసీని కొనుగోలు చేసేటప్పుడు పాలసీదారు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చూద్దాం.
- ఎండోమెంట్ రకానికి చెందిన క్లెయిమ్ పాలసీలు గడువులోపు మొత్తం చెల్లించాలి.
- పాలసీ సేవలందించే బ్రాంచ్ ఆఫీస్, చెల్లింపు గడువు తేదీకి కనీసం రెండు నెలల ముందే తెలియజేస్తుంది. అలాగే పాలసీ సొమ్మును పాలసీదారుకు చెల్లించాల్సిన తేదీని గురించి వివరాలు ఇస్తుంది.
- పాలసీ పత్రం నెఫ్ట్( NEFT) మాండేట్ ఫారమ్ (సంబంధిత ఆధారలతో కూడిన బ్యాంక్ A/c), కేవైసీ( KYC) మొదలైన వాటితో పాటుగా పూర్తి చేసిన డిశ్చార్జ్ ఫారమ్‌ను పాలసీదారు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.
- ఈ పత్రాలపై చెల్లింపులకు సబంధించిన ప్రాసెస్ ముందే అవుతుంది. దీంతో గడువు తేదీలోపు మెచ్యూరిటీ మొత్తం పాలసీదారు బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది.
- మనీ బ్యాక్ పాలసీలు వంటి కొన్ని ప్లాన్‌లు పాలసీదారులకు కాలానుగుణ చెల్లింపుల కోసం ఉపయోగపడతాయి. పాలసీల కింద చెల్లించాల్సిన ప్రీమియం సర్వైవల్ బెనిఫిట్ ఒక ఏడాది వరకు చెల్లించాలి.
- పాలసీదారుకు చెల్లించాల్సిన మొత్తం రూ.5 లక్షల వరకు ఉంటే, డిశ్చార్జ్ రసీదు లేదా పాలసీ డాక్యుమెంట్ పరిశీలించకుండానే చెల్లింపులు విడుదల అవుతాయి.
- జీవన్ ఆనంద్ పాలసీల కింద సర్వైవల్ బెనిఫిట్ రూ.2 లక్షల వరకు బీమా బాండ్ లేదా డిశ్చార్జ్ ఫారమ్ ప్రమేయం లేకుండానే వస్తాయి.
- అధిక మొత్తాల విషయంలో మాత్రమే ఈ పైన పేర్కొన్న రెండు అంశాలు పరిగణనలోకి వస్తాయి.