Hybrid Car Rates After Tax Reduction : హైబ్రిడ్ వాహనాలపై విధిస్తున్న జీఎస్టీని 48 శాతం నుంచి 12 శాతానికి తగ్గించాలని ఇటీవలే కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒక ప్రతిపాదన చేశారు. దేశంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆయన ఈ ప్రపోజల్ చేశారు. ఇదే కనుక ఆమోదం పొందితే హైబ్రిడ్ వాహనాల ధరలు భారీగా తగ్గుతాయి. ముఖ్యంగా మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, హోండా సిటీ లాంటి హైబ్రిడ్ కార్ల ధరలు భారీగా దిగివస్తాయి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Maruti Suzuki Grand Vitara : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి విడుదల పాపులర్ హైబ్రిడ్ కారు గ్రాండ్ విటారా. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.20.09 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది. ప్రస్తుతం ఈ కారుపై 28 శాతం జీఎస్టీ, 15 శాతం సెస్ వసూలు చేస్తున్నారు. కనుక ఈ సబ్-కాంపాక్ట్ ఎస్యూవీ కారు ఆన్-రోడ్ ప్రైస్ భారీగా పెరిగిపోతోంది. ఒక వేళ కేంద్ర ప్రభుత్వం హైబ్రిడ్ కార్లపై విధిస్తున్న జీఎస్టీని 12 శాతానికి తగ్గిస్తే, ఈ మారుతి సుజుకి గ్రాండ్ విటారా ధర భారీగా దిగివస్తుంది. ఎలా అంటే?
ముందుగా మనం గ్రాండ్ విటారా కారు ఎక్స్-ఫ్యాక్టరీ ధర తెలుసుకోవాలి. ఇందుకోసం ప్రస్తుతం మారుతి గ్రాండ్ విటారా ఎక్స్-షోరూం ధర రూ.20.09 లక్షలు నుంచి 28 శాతం జీఎస్టీ, 15 శాతం సెస్ తీసివేద్దాం. ఇలా చేయగానే, కారు ఎక్స్-ఫ్యాక్టరీ ధర రూ.11.45 లక్షలు వచ్చింది.
ఇప్పుడు ఈ ఎక్స్-ఫ్యాక్టరీ ధరకు ప్రతిపాదిన 12 శాతం జీఎస్టీని కలపాలి. ఇలా చేస్తే, గ్రాండ్ విటారా ఎక్స్-షోరూం ధర రూ.14.54 లక్షలు అయ్యింది. అంటే జీఎస్టీని 12 శాతం తగ్గిస్తే, కారు ధర ఏకంగా రూ.5.55 లక్షల వరకు తగ్గింది. ఇది కారు కొనుగోలుదారులకు ఆర్థికంగా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. పైగా సేల్స్ కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది.
Tayota Urban Cruiser Hyryder : ప్రస్తుతం టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కారు ఎక్స్-షోరూం ధర రూ.16.63 లక్షలు నుంచి రూ.20.19 లక్షల ప్రైస్ రేంజ్లో ఉంది. అంటే ఇది మారుతి సుజుకి గ్రాండ్ విటారా ధర కంటే కాస్త ఎక్కువ ధరే (రూ.10,000) ఉంది. మనం మారుతి సుజుకి గ్రాండ్ విటారా ధరను లెక్కించిన విధంగా దీనిని కూడా లెక్కిస్తే, ఈ టయోటా అర్బన్ హైరైడర్ ధర సుమారుగా రూ.5 నుంచి రూ.6 లక్షలు వరకు తగ్గుతుంది.
Honda City Hybrid : ఇండియన్ మార్కెట్లోని మోస్ట్ పాపులర్ సెడాన్ కారు హోండా సిటీ హైబ్రిడ్. మార్కెట్లో దీని ఎక్స్-షోరూం ధర రూ.20.39 లక్షలు ఉంటుంది. దీని నుంచి 28 శాతం జీఎస్టీ, 15 శాతం సెస్‌లను తీసివేస్తే, ఎక్స్-ఫ్యాక్టరీ ధర సుమారుగా రూ.14.37 లక్షలు వస్తుంది. దీనికి 12 శాతం జీఎస్టీని జత చేస్తే, అప్పుడు ఎక్స్-షోరూం ధర రూ.18.25 లక్షలు అవుతుంది. అంటే ఇప్పుడున్న ధర కంటే రూ.2.14 లక్షలు తగ్గుతుంది.
ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే, మారుతి సుజుకి గ్రాండ్ విటారా ధర బాగా తగ్గింది. కానీ హోండా సిటీ కారు ధర కొంచెమే తగ్గింది. దీనికి ప్రధాన కారణం. మారుతి సుజుకి గ్రాండ్ విటారా కార్లు సగటున నెలకు 12,000 యూనిట్ల వరకు అమ్ముడుపోతున్నాయి. కనుక మారుతి కంపెనీకి తక్కువ మార్జిన్ (లాభం) వచ్చినా సరిపోతుంది. కానీ హోండా సిటీ హైబ్రిడ్ అమ్మకాలు చాలా తక్కువగా ఉంటాయి. కనుక హోండా కంపెనీ తమ లాభాల మార్జిన్‌ను కాస్త ఎక్కువగా ఉంచుకోవాల్సి ఉంటుంది.
బైక్ వాషింగ్‌కు ఎక్కువ డబ్బు ఖర్చు అవుతోందా? ఈ టిప్స్ పాటిస్తే మనీ సేవ్! - bike washing tips