ETV Bharat / business

కొత్త రుణం తీసుకోవాలనుకుంటున్నారా? ఇలా చేస్తే సులభంగా లోన్​ ఎలిజిబిలిటీ పెంచుకోవచ్చు! - How To Improve Loan Eleigibility - HOW TO IMPROVE LOAN ELEIGIBILITY

How To Improve Loan Eleigibility : ప్రస్తుతం లోన్స్​ సులభంగా లభిస్తున్నాయి. ఒకప్పటిలా కాకుండా చిన్న ప్రక్రియ పూర్తి చేస్తే లోన్​ ఇచ్చేస్తున్నాయి బ్యాంకులు, నాన్​బ్యాంకింగ్​ ఫైనాన్సియల్​ కంపెనీలు​(ఎన్​బీఎఫ్​సీ). డిజిటల్‌ రూపంలోనే క్షణాల్లో రుణాలు ఇచ్చేందుకు సై అంటున్నాయి. అయితే లోన్​ ఇచ్చే ముందు సదరు వ్యక్తి రుణ అర్హతను చూస్తున్నాయి. అధిక మొత్తంలో లోన్​లు, క్రెడిక్​ స్కోర్​ తక్కువగా ఉన్నవారి దరఖాస్తులను రిజెక్ట్​ చేస్తున్నాయి. సులభంగా ఈ లోన్​ ఎలిజిబిలిటీని ఎలా పెంచుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

How To Improve Loan Eleigibility
How To Improve Loan Eleigibility (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 3, 2024, 6:55 PM IST

How To Improve Loan Eleigibility : సాధారణంగా లోన్ ఇచ్చే ముందు బ్యాంకులు, బ్యాంకేతర ఆర్థిక సంస్థలు మంచి క్రెడిట్‌ స్కోరు, లోన్​ హిస్టరీ చూస్తాయి. అవి సరిగా ఉన్నవారికే లోన్​ ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తాయి. గృహ, వాహన, పర్సనల్​ లోన్​లో కొంత వడ్డీ రాయితీనీ కూడా అందిస్తుంటాయి. అయితే కొన్ని అంశాల్లో కఠినంగా వ్యవహరిస్తాయి. అందుకే కొత్త లోన్​లను తీసుకోవాలనుకున్నప్పుడు, మన రుణ చరిత్రను ప్రభావితం చేసే అంశాలు, వాటిని ఎలా అధిగమించాలనే విషయాలను పరిశీలిద్దాం.

అప్పటికే లోన్​ ఎక్కువ ఉంటే
లోన్​ కావాలని మనం దరఖాస్తు చేయగానే, బ్యాంకులు ముందుగా మన ఆర్థిక స్తోమతను పరిశీలిస్తాయి. ఇప్పటికే ఉన్న బాకీల గురించి ఆరా తీస్తాయి. అందులో కొన్నింటిన తీర్చేందుకు అవకాశం ఉందా లేదా అనేది పరిశీలిస్తాయి. దరఖాస్తుదారుడు ఇంతకుముందే రుణం​ తీసుకుని, అది ఆరు నెలల్లో ముగుస్తుందంటే, బ్యాంకులు దాన్ని పెద్దగా పట్టించుకోవు. కానీ ఇక్కడ, మన ఇన్​కంలో ఎంత మొత్తం ఈఎమ్​ఐలు చెల్లిస్తున్నారనేది చాలా కీలకం. ఆదాయంలో 40 శాతానికి మించి లోన్ ఈఎమ్​ఐలను వాయిదాలకు చెల్లిస్తూ ఉంటే అలాంటి వారికి కొత్త అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు కాస్త ఆలోచిస్తాయి. 60 శాతం దాటితే మాత్రం రుణం ఇవ్వడం కష్టం కావచ్చు. కాబట్టి, గృహ రుణం ​లాంటి పెద్ద అప్పు కావాల్సి వచ్చినప్పుడు చిన్న చిన్న రుణాలను ఒకేసారి తీర్చేయడమే ఉత్తమం.

క్రెడిట్‌ స్కోరు ముఖ్యం
ఇప్పటికే రుణాలు తీసుకున్న వారు తమ క్రెడిట్‌ స్కోరును ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. చాలా సంస్థలు ఇప్పుడు ఈ స్కోరును ఉచితంగానే తీసుకునే సౌలభ్యం కల్పిస్తున్నాయి. 750కి మించి స్కోరున్న వ్యక్తులకు రుణాలను ఇచ్చేందుకు బ్యాంకులు ఇష్టపడతాయి. కొన్ని బ్యాంకులు 700 స్కోరున్నా ఇబ్బంది లేదని చెబుతున్నాయి. క్రెడిట్‌ స్కోరు దెబ్బతింటే వెంటనే దాన్ని సరిదిద్దేందుకు చర్యలు తీసుకోండి. క్రెడిట్‌ కార్డును విపరీతంగా వాడటం వల్ల స్కోరు దెబ్బతింటుంది. ఉదాహరణకు మీ క్రెడిట్‌ కార్డు పరిమితి రూ.లక్ష అనుకుందాం. ఇందులో మీ క్రెడిట్‌ వినియోగం 40 శాతానికి మించకూడదు. అంటే రూ.40వేల వరకే మీరు కార్డును వాడాలి. దీనికి మించి వాడినప్పుడు క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం పడుతుంది. చాలామంది రుణదాతలు 30శాతం క్రెడిట్‌ వినియోగాన్ని ఇష్టపడతారు. ఒకే బ్యాంకులో కాకుండా, రెండు మూడు బ్యాంకుల్లో రుణానికి దరఖాస్తు చేసినా స్కోరుపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. తరచూ రుణాల కోసం దరఖాస్తు చేస్తుంటే మీరు రుణాలపైనే ఆధారపడుతున్నారని ఆర్థిక సంస్థలు భావిస్తాయి. తక్కువ వ్యవధిలోనే ఎక్కువ రుణాలు తీసుకోవడమూ సరికాదు.

ఉమ్మడిగా
హోమ్​లోన్​ ఎక్కువగా రావాలంటే సులభమైన మార్గాల్లో ఒకటి జీవిత భాగస్వామితో కలిసి ఉమ్మడిగా రుణం​ కోసం దరఖాస్తు చేసుకోవడం. కొన్ని బ్యాంకులు తండ్రి, తల్లి, కొడుకు, కుమార్తె వంటి దగ్గరి కుటుంబ సభ్యులనూ సహ-దరఖాస్తుదారుగా అనుమతిస్తున్నాయి. బ్యాంకు, ఎన్‌బీఎఫ్‌సీని సంప్రదించి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడం ఉత్తమం.

ఈఎమ్​ఐలను పెంచుతూ
జాబ్​లో చేరిన కొత్తలో శాలరీ తక్కువగా ఉంటుంది. కాబట్టి, లోన్ అర్హత అధికంగా ఉండదు. ఇలాంటప్పుడు స్టెప్‌ అప్‌ పద్ధతిలో లోన్​ ఇచ్చేందుకు ఆర్థిక సంస్థలు ముందుకు వస్తున్నాయి. మీకు అవసరమైన లోన్​ను అప్పుడు అందిస్తాయి. ప్రారంభంలో తక్కువ వాయిదా ఉంటుంది. వేతనం పెరుగుతున్న కొద్దీ ఈఎమ్​ఐల మొత్తం ఎక్కువ అవుతుంది. ఇక, కొత్తగా జాబ్​లో చేరిన వారికి కొన్ని సంస్థను ఇలాంటి వెసులుబాటును అందిస్తున్నాయి. సాధారణ లోన్​లతో పోలిస్తే వీటికి ఇంట్రెస్ట్​ అధికంగా ఉంటుంది. భవిష్యత్తులో ఇన్​కం పెరుగుతుందని కచ్చితంగా అనుకుంటేనే ఇలాంటి విధానాన్ని ఉపయోగించుకోవాలి.

పర్సనల్ లోన్ కోసం ట్రై చేస్తున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్! - PERSONAL LOAN TIPS

లేడీస్​ స్పెషల్​ - 'రివెంజ్ సేవింగ్స్' చేయండి - భవిష్యత్​లో కోటీశ్వరురాలు అవ్వండి! - Revenge Savings Trend

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.