ETV Bharat / business

క్రెడిట్ కార్డ్​ స్టేట్​మెంట్​లో అవి చెక్​ చేయాల్సిందే - లేదంటే నష్టపోవడం ఖాయం! - Credit Card Statement - CREDIT CARD STATEMENT

How To Check Credit Card Statement : మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ప్రతినెలా దానితో రకరకాల లావాదేవీలు చేస్తున్నారా? అయితే మీరు ప్రతినెలా తప్పకుండా చేయాల్సిన పని ఒకటి ఉంది. అదే క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్​ను తనిఖీ చేయడం. వాటిల్లో కూడా వేటిని తప్పనిసరిగా చెక్​ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

How To Check Credit Card Statement
How To Check Credit Card Statement (ETV bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 4, 2024, 1:02 PM IST

How To Check Credit Card Statement : ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగిపోయింది. చాలా మంది వివిధ లావాదేవీల కోసం క్రెడిట్ కార్డులను వినియోగించేందుకు మొగ్గుచూపుతున్నారు. రివార్డ్ పాయింట్స్, ఈఎంఐ సదుపాయం, బకాయి మొత్తాన్ని చెల్లించడానికి కనీస గడువు వంటి బెనిఫిట్స్ ప్రజలను క్రెడిట్ కార్డుల వైపుగా ఆకర్షిస్తున్నాయి. క్రెడిట్ కార్డుతో లావాదేవీలు చేసి అవసరాన్ని తీర్చుకోవడం ఎంత ముఖ్యమో, ప్రతినెలా వచ్చే బిల్ స్టేట్​మెంట్​ను క్షుణ్నంగా చెక్ చేసుకోవడం అంతే ముఖ్యం.

ఏమి తనిఖీ చేయాలి ?

  1. స్టేట్‌మెంట్ తేదీ : ప్రతినెలా మీ క్రెడిట్ కార్డు బిల్ స్టేట్‌మెంట్ వస్తున్న తేదీని చెక్ చేసి దాన్ని గుర్తుంచుకోండి. దీనివల్ల బిల్లింగ్ సైకిల్‌పై మీకు అవగాహన వస్తుంది. మీరు అప్రమత్తంగా వ్యవహరిస్తారు.
  2. గడువు : క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్ చివరి తేదీని గుర్తుంచుకోండి. ఆలోగా పేమెంట్ చేయండి. దీనివల్ల లేట్ పేమెంట్ ఫీజు భారం మీపై పడదు. మీ క్రెడిట్ స్కోర్‌ కూడా తగ్గదు.
  3. గ్రేస్ పీరియడ్ : మీ క్రెడిట్ కార్డు బకాయిలను నిర్ణీత గ్రేస్ పీరియడ్‌లోగా చెల్లించండి. దీనివల్ల మీపై వడ్డీ భారం ఉండదు.
  4. లావాదేవీ వివరాలు : మీరు క్రెడిట్ కార్డుతో చేసిన లావాదేవీల సమాచారం స్టేట్‌మెంట్​లో ఉంటుంది. దానిలో మీరు పేమెంట్ చేసిన మొత్తం, తేదీ, వ్యాపారి పేరు అన్నీ కరెక్టుగా ఉన్నాయా? లేదా? అనేది సరిచూసుకోండి.
  5. బకాయి మొత్తం : మీరు ఎంత మొత్తం క్రెడిట్ కార్డుకు బకాయి ఉన్నారు అనేది చెక్ చేయండి. దాన్ని తిరిగి చెల్లించడానికి అందుబాటులో ఉన్న ఆప్షన్ల గురించి తెలుసుకోండి.
  6. మినిమం డ్యూ పేమెంట్ : మీరు క్రెడిట్ కార్డుకు ఎంత బకాయి ఉన్నారనేది స్టేట్‌మెంట్​లో చూడండి. ఒకవేళ సరిపడా అమౌంట్ మీ దగ్గర లేకుంటే మినిమం డ్యూను చెల్లించండి. సాధ్యమైనంత ఎక్కువ బకాయి మొత్తాన్ని చెల్లిస్తే అంతమేరకు మీపై వడ్డీభారం తగ్గిపోతుంది.
  7. క్రెడిట్ పరిమితి : స్టేట్‌మెంట్​ మీ క్రెడిట్ లిమిట్ ఎంత ఉందనేది చూడండి. ఎంతలోపు మీ ఖర్చులు ఉండాలనే దానిపై ఒక క్లారిటీకి రండి. క్రెడిట్ లిమిట్ మొత్తం ఖర్చు చేసేయడం మంచి అలవాటు కాదు.
  8. క్యాష్ అడ్వాన్స్‌లు : మీరు ఏవైనా క్యాష్ అడ్వాన్సులను స్వీకరించి ఉంటే ఆ సమాచారం క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్​లో ఉందా? లేదా? అనేది చెక్ చేసుకోండి. సాధారణంగా వాటిపై అధికంగా ఫీజులు, వడ్డీలు విధిస్తుంటారు.
  9. రివార్డ్ పాయింట్స్ : మీ స్టేట్‌మెంట్​లో రివార్డ్ పాయింట్ల వివరాలు కూడా ఉంటాయి. వాటిని తనిఖీ చేయండి. వాటిని ఎలా రీడీమ్ చేయాలనే డౌట్ ఉంటే కస్టమర్ కేర్ ద్వారా తెలుసుకోండి.
  10. అనధికారిక లావాదేవీలు : మీ స్టేట్‌మెంట్​లో ఏవైనా మోసపూరిత కార్యకలాపాలను సూచించే లావాదేవీలు ఉంటే గుర్తించండి. మీకు తెలియకుండా జరిగిన లావాదేవీలున్నా చూసి కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేయాలి.
  11. విదేశీ లావాదేవీలపై రుసుములు : మీరు ఒకవేళ అంతర్జాతీయ కొనుగోళ్లు జరిపి ఉంటే వాటికి సంబంధించిన ఛార్జీలు, రేట్ల వివరాలను ఒకసారి సరి చూసుకోండి. మీపై ఏదైనా అదనపు భారం పడితే ఫిర్యాదు చేయండి.
  12. వడ్డీ ఛార్జీల భారం : మీ క్రెడిట్ కార్డు బకాయిలపై వడ్డీ ఎంత పడుతుందనేది ట్రాక్ చేయండి. దానిపై కస్టమర్ కేర్‌తో మాట్లాడండి. ఎక్కువ వడ్డీభారం పడితే తప్పకుండా అలర్ట్ కండి.
  13. ఫీజులు, ఛార్జీలు : వార్షిక రుసుములు, ఆలస్య రుసుములు, అధిక పరిమితి రుసుములు వంటి ఊహించని రుసుములు మీ క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్​లో ఉంటే గుర్తించండి. కస్టమర్ కేర్‌కు సమాచారం అందించండి.
  14. ఈఎంఐ లావాదేవీలు : మీరు ఏవైనా ఈఎంఐ లావాదేవీలు చేస్తే, అవి స్టేట్‌మెంట్​లో సక్రమంగా వచ్చాయా? లేదా? అనేది చెక్ చేయండి. వడ్డీరేట్లు మీకు తెలిపిన ప్రకారమే విధిస్తున్నారా? లేదా? అనేది చూసుకోండి.
  15. క్రెడిట్ వినియోగం : మీ క్రెడిట్ స్కోర్‌ బాగుండాలంటే క్రెడిట్ లిమిట్‌ను మొత్తం వాడేయొద్దు. ప్రతీ పనికి క్రెడిట్ కార్డునే వాడొద్దు. దీనివల్ల డబ్బు దుబారా అయ్యే రిస్క్ ఉంటుంది. మీకొచ్చే క్రెడిట్ కార్డు స్టేట్మెంట్‌లో మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తి సమాచారాన్ని తప్పకుండా చెక్ చేయండి.
  16. కస్టమర్ సర్వీస్ మెసేజ్‌లు : క్రెడిట్ కార్డ్ కంపెనీ నుంచి మీ ఫోనుకు వచ్చే మెసేజ్‌లను కూడా చెక్ చేస్తుండండి.

క్రెడిట్ కార్డ్ యూజర్స్ ఇవి కూడా పరిగణించాల్సిందే!

  • ఫిజికల్ స్టేట్‌మెంట్​ : మీరు క్రెడిట్ కార్డ్ కంపెనీ నుంచి ప్రతినెలా తప్పకుండా ఫిజికల్ స్టేట్‌మెంట్​ను పొందండి. వాటిని ఒకచోట జమచేసి, సక్రమంగా నిర్వహించండి. దీనివల్ల మీరు బాధ్యతగా ఫీల్ అవుతారు.
  • ఇంటర్నెట్ అలర్ట్స్ : నెలవారీ స్టేట్​మెంట్​కు సంబంధించి తప్పకుండా క్రెడిట్ కార్డ్ కంపెనీ నుంచి ఈమెయిల్, వాట్సాప్, ఫోన్ నంబరుకు అలర్ట్స్ వచ్చేలా ఏర్పాట్లు చేసుకోండి. దీనివల్ల మీ బకాయిలపై స్పష్టమైన అవగాహన వస్తుంది. స్టేట్‌మెంట్​లో ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు ఉంటే గుర్తించేందుకు అవకాశం కలుగుతుంది.
  • లోపాలను సరి చేయించుకోండి : క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్​లో ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే కస్టమర్ కేర్‌కు సమాచారం అందించండి. తగిన డాక్యుమెంట్ ప్రూఫ్స్‌ను అందించి, వాటిని సరిచేయించుకోండి.
  • అనధికారిక ఛార్జీల గుర్తింపు : మీరు క్రెడిట్ కార్డుతో చేసిన లావాదేవీలపై ముందస్తుగా చెప్పిన దాని కంటే ఎక్కువ వడ్డీరేటు, అదనపు ఛార్జీలు పడితే అలర్ట్ కావాలి. వాటిపై కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేయాలి. క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్​ను తనిఖీ చేస్తేనే ఇలాంటి లోపాలను గుర్తించగలుగుతారు.
  • వ్యయం తీరుతెన్నులపై అవగాహన : క్రెడిట్ కార్డు నెలవారీ స్టేట్​మెంట్​ను చూస్తే మీ నెలవారీ వ్యయ విధానంపై ఒక ఐడియా వస్తుంది. దుబారాకు తావు ఇవ్వకుండా మీ క్రెడిట్ కార్డు వినియోగ విధానంలో ఎలాంటి మార్పు చేసుకోవాలి అనేది సమీక్షించుకోండి.
  • రుణ నిర్వహణ : మీ క్రెడిట్ కార్డు బకాయిలు ఎంత ఉన్నాయనేది స్టేట్​మెంట్​లో చూసుకోండి. దాన్ని సకాలంలో చెల్లించండి. లేదంటే ఈ బకాయిలన్నీ కలిసి చివరకు పెద్ద గుట్టలా పేరుకుపోతాయని గ్రహించండి.
  • రివార్డ్‌లను ఆస్వాదించండి : క్రెడిట్ కార్డ్ లావాదేవీల ద్వారా మీకు లభిస్తున్న ప్రయోజనాలు, ఇతర రివార్డ్‌లను స్టేట్‌మెంట్​లో తనిఖీ చేయండి. వాటి ద్వారా కలిగే లాభాలను ఆస్వాదించండి.

క్రెడిట్ కార్డ్ vs బై నౌ, పే లేటర్ ఆప్షన్- ఆన్‌లైన్ షాపింగ్‌కు రెండింట్లో ఏది బెటర్? - Buy Now Pay Later vs Credit Card

ఆగస్టు 1 నుంచి కొత్త క్రెడిట్ కార్డ్ రూల్స్ - పెరిగిన ఛార్జీలు, ఫీజుల వివరాలు ఇవే! - HDFC Bank Credit Card Rules

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.