Gold Rate Today March 6th 2024 : దేశంలో పసిడి ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ.66,335 ఉండగా, బుధవారం నాటికి రూ.217 పెరిగి రూ.66,552కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.73,938 ఉండగా, బుధవారం నాటికి రూ.355 తగ్గి రూ.73,583కు చేరుకుంది.
- Gold Price In Hyderabad March 6th 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.66,552గా ఉంది. కిలో వెండి ధర రూ.73,583గా ఉంది.
- Gold Price In Vijayawada March 6th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.66,552గా ఉంది. కిలో వెండి ధర రూ.73,583గా ఉంది.
- Gold Price In Vishakhapatnam March 6th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.66,552గా ఉంది. కిలో వెండి ధర రూ.73,583గా ఉంది.
- Gold Price In Proddatur March 6th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.66,552గా ఉంది. కిలో వెండి ధర రూ.73,583గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price March 6th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. సిల్వర్ రేట్లు మాత్రం దాదాపు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2113 డాలర్లు ఉండగా, బుధవారం నాటికి 12 డాలర్లు పెరిగి 2125కు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 23.62 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News March 6th 2024 : బుధవారం కూడా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాలతో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.52,32,483 |
ఇథీరియం | రూ.2,78,000 |
టెథర్ | రూ.82.6 |
బైనాన్స్ కాయిన్ | రూ.32,273 |
సొలోనా | రూ.10,079 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today March 6th 2024 : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. విదేశీ పెట్టుబడులు తరలివెళ్తుండడం సహా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 178 పాయింట్లు నష్టపోయి 73,498 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 43 పాయింట్లు కోల్పోయి 22,312 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా, సన్‌ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : పవర్‌గ్రిడ్, బాజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, విప్రో, టెక్ మహీంద్రా
రూపాయి విలువ
Rupee Open March March 6th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.90గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices March 6th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.48గా ఉంది. డీజిల్ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
ముడిచమురు ధర
Crude Oil Prices March 6th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.13 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 82.15 డాలర్లుగా ఉంది.
బాగా డబ్బులు సంపాదించాలా? అయితే ఈ పెట్టుబడి వ్యూహాన్ని అనుసరించండి!
ఫ్రీగా క్రెడిట్ స్కోర్ తెలుసుకోవాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి!