Gold Rate Today 30th January 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఆదివారం 10 గ్రాముల బంగారం ధర రూ.64,249గా ఉండగా, మంగళవారం నాటికి రూ.354 పెరిగి రూ.64,603కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.73,220 ఉండగా, మంగళవారం నాటికి రూ.695 పెరిగి రూ.73,915కు చేరుకుంది.
- Gold Price In Hyderabad 30th January 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.64,603గా ఉంది. కిలో వెండి ధర రూ.73,915గా ఉంది.
- Gold Price In Vijayawada 30th January 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,603గా ఉంది. కిలో వెండి ధర రూ.73,915గా ఉంది.
- Gold Price In Vishakhapatnam 30th January 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,603గా ఉంది. కిలో వెండి ధర రూ.73,915గా ఉంది.
- Gold Price In Proddatur 30th January 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.64,603గా ఉంది. కిలో వెండి ధర రూ.73,915గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 30th January 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు పెరిగాయి. వెండి ధరలు మాత్రం ఎప్పటిలానే స్థిరంగా ఉన్నాయి. ఆదివారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2019 డాలర్లు ఉండగా, మంగళవారం నాటికి 13 డాలర్లు పెరిగి 2032 డాలర్లకు చేరింది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 23.17 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 30th January 2024 : మంగళవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మంచి లాభాలతో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.36,12,454 |
ఇథీరియం | రూ.1,92,247 |
టెథర్ | రూ.83.12 |
బైనాన్స్ కాయిన్ | రూ.25,886 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.13 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today 30th January 2024 : మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభయ్యాయి. మదుపరులు లాభాలు స్వీకరిస్తుండడమే ఇందుకు కారణం. త్వరలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టడం, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో మదుపరులు కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 199 పాయింట్లు నష్టపోయి 71,822 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 31 పాయింట్లు కోల్పోయి 21,733 వద్ద కొనసాగుతున్నాయి.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : హిందూస్తాన్ యూనిలీవర్, భారతీ ఎయిర్టెల్, విప్రో, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, ఎస్బీఐ
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, ఎన్టీపీసీ, టైటాన్, ఐటీసీ, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతి సుజుకి
రూపాయి విలువ
Rupee Open 30th January 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 3 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.13గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices 30th January 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.48గా ఉంది. డీజిల్ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
ముడిచమురు ధర
Crude Oil Prices 30th January 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.22 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 82.58 డాలర్లుగా ఉంది.
మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? ఫిబ్రవరి 1నుంచి రూల్స్ ఛేంజ్! అవేంటో తెలుసుకోండి
టికెట్ బుకింగ్‌కు ఈమెయిల్, ఫోన్ నంబర్ వెరిఫికేషన్ మస్ట్!- IRCTC కొత్త అప్డేట్