Easy Tests to Check Purity of Gold : అక్షయ తృతీయ ఈ ఏడాది మే 10న వస్తోంది. ఈ పర్వదినాన మీరు బంగారం కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారా? అయితే.. బంగారాన్ని(Gold) కొనే ముందు దాని స్వచ్ఛతను తెలుసుకోవడం చాలా అవసరం. ఇందుకోసం నిపుణులు కొన్ని సింపుల్ టెక్నిక్స్ సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
హాల్‌మార్క్ లోగో : మీరు బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే.. బీఐఎస్ హాల్ మార్క్ గుర్తు కలిగిన నగలను మాత్రమే కొనుగోలు చేయాలి. ఎందుకంటే హాల్‌మార్క్ గుర్తు స్వచ్ఛమైన బంగారానికి భరోసా ఇస్తుంది. ఈ గుర్తును బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) జారీ చేస్తోంది. అన్ని బంగారు నగలపై ఇది కనిపిస్తుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి.
గోల్డ్ క్యారెట్స్ : పసిడి స్వచ్ఛతను సాధారణంగా క్యారెట్లలో కొలుస్తారు. దీనిని k లేగా kt తో సూచిస్తారు. అత్యంత స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్లు ఉంటుంది. అంటే దీంట్లో 99.9 శాతం గోల్డ్ ఉండి చాలా మృదుగా ఉంటుంది. అందుకే ఆభరణాల తయారీకి ఇతర లోహాలను యాడ్ చేస్తుంటారు. ఉదాహరణకు మీరు తీసుకున్న బంగారం 18k అనుకుంటే అందులో 18 భాగాలు గోల్డ్ ఉండి, ఇతర లోహాలు 6 భాగాలుంటాయి. అంటే.. ఇలాంటి నగలలో 75 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
యాసిడ్ టెస్ట్ : మీరు తీసుకున్న బంగారం స్వచ్ఛమైనదో కాదో తెలుసుకోవడానికి అత్యంత నమ్మకమైన పద్ధతులలో యాసిడ్ టెస్ట్ ఒకటని చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇందుకోసం ముందుగా నైట్రిక్ యాసిడ్, ఒక రాయిని తీసుకోవాలి. ఆపై గోల్డ్‌ను రాయిపై రుద్దాలి. ఆ తర్వాత దానిపై నైట్రిక్ యాసిడ్ పోయాలి. అప్పుడు మీరు తీసుకున్న గోల్డ్‌లో మరేదైనా లోహం ఉంటే యాసిడ్ దానిని కరిగిస్తుందంటున్నారు నిపుణులు.
అక్షయ తృతీయ రోజున బంగారం కొనడానికి శుభసమయం ఏది? - మీకు తెలుసా? - Akshaya Tritiya 2024
వెనిగర్ టెస్ట్ : ఈ టెస్ట్ ద్వారా బంగారం స్వచ్ఛతను ఈజీగా తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఈ టెస్ట్‌ను ఎలా చేయాలంటే.. ముందుగా కొన్ని చుక్కల వెనిగర్ తీసుకొని ఒక చిన్న బంగారం ముక్కపై పోయాలి. అప్పుడు అది రంగు మారితే ఆ గోల్డ్ స్వచ్ఛమైనది కాదని మీరు అర్థం చేసుకోవాలంటున్నారు నిపుణులు. అదే కలర్ ఛేంజ్ కాకపోతే అది ప్యూరిటీ గోల్డ్‌గా భావించవచ్చంటున్నారు.
మ్యాగ్నెట్ టెస్ట్ : ఈ పరీక్ష కోసం బంగారాన్ని అయస్కాంతానికి దగ్గరగా పెట్టాలి. అప్పుడు అయస్కాంతానికి గోల్డ్ అతుక్కుంటే అది స్వచ్ఛమైనది కాదని అర్థం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అందులో ఇతర లోహాలు బాగా యాడ్ అయ్యాయని లేదా అది లో క్వాలిటీ బంగారం అని గమనించాలంటున్నారు. ఎందుకంటే ప్యూరిటీ గోల్డ్ మ్యాగ్నెట్కి అతుక్కోదని చెబుతున్నారు. అంతేకాదు అయస్కాంతం దగ్గరికి తీసుకొచ్చినా బంగారం కొంచెం కూడా రియాక్ట్ అవ్వదంటున్నారు.
తేలియాడే పరీక్ష : ఇది కూడా బంగారం స్వచ్ఛతను తెలుసుకోవడం ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. గోల్డ్ వాటర్‌లో తేలియాడదు. కానీ, అదే ఏదైనా ఇతర మెటల్ కలిపితే పసిడి తేలియాడటం ప్రారంభిస్తుందంటున్నారు నిపుణులు. సో.. ఇలా కూడా నకిలీని తెలుసుకోవచ్చంటున్నారు.
చూశారుగా.. బంగారం ప్యూరిటీని ఎలా తెలుసుకోవచ్చో! మీరు ఈ అక్షయ తృతీయ నాడు గోల్డ్ కొనాలంటే ఓసారి పరీక్షించి తీసుకోవడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.
ప్రపంచంలోనే అతి చిన్న ఆవు- 'బంగారు' పాలను ఇస్తుందట! చూసేందుకు ప్రజలు క్యూ - WORLD SMALLEST COW