Bike Offers In December 2024 : ఇయర్ ఎండ్ సేల్‌లో మంచి బైక్ లేదా స్కూటీ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రస్తుతం అప్రిలియా, వెస్పా, ట్రయంఫ్, కేటీఎం, సుజుకి బైక్స్ & స్కూటీస్‌పై అదిరిపోయే డిస్కౌంట్స్, ఆఫర్స్ లభిస్తున్నాయి. మరెందుకు ఆలస్యం వాటిపై ఓ లుక్కేద్దాం రండి.
1. Triumph Scrambler 400X Offers In December 2024 : ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్‌పై లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ నడుస్తోంది. ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా ఈ బైక్ కొన్నవారికి రూ.12,500 విలువైన యాక్సెసరీస్‌ను పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఆఫర్ 2024 డిసెంబర్ 31 వరకు మాత్రమే ఉంటుంది.
2. KTM 250 Duke Offers In December 2024 : కేటీఎం 250 డ్యూక్ బైక్‌పై ఈ డిసెంబర్‌లో స్పెషల్ ఆఫర్ కింద రూ.20,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. డిసెంబర్ నెలాఖరు వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
3. Suzuki Motorcycle Offers In December 2024 : జపాన్ ఆటోమేకర్ కంపెనీ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రమోషనల్ ఆఫర్స్ అందిస్తోంది. గిక్సర్, గిక్సర్ ఎస్‌ఎఫ్ మోడల్స్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.10,000, అలాగే రూ.12,000 వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. అలాగే వీ-స్ట్రామ్ ఎస్ఎక్స్ బైక్‌పై క్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.10,000, అలాగే రూ.15,000 క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఇక గిక్సర్ 250, గిక్సర్ ఎస్‌ఎఫ్ 250లపై రూ.25,000 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తోంది.
4. Vespa Scooter Offers In December 2024 : క్రిస్మస్ సందర్భంగా వెస్పా స్కూటర్లపై రూ.13,000 వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు పియాజియో ఇండియా తెలిపింది. ఈ ఆఫర్ 2024 డిసెంబర్ 25 వరకు మాత్రమే ఉంటుందని పేర్కొంది. అయితే ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది ఆయా మోడల్స్ బట్టి మారుతుందని స్పష్టం చేసింది.
5. Aprilia Scooter Offers In December 2024 : క్రిస్మస్ సందర్భంగా అప్రిలియా స్కూటర్లపై రూ.13,000 వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు పియాజియో ఇండియా తెలిపింది. ఈ ఆఫర్ 2024 డిసెంబర్ 25 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
6. Aprilia RS457 Offers In December 2024 : అప్రిలియా ఆర్‌ఎస్ 457 బైక్ ధర వచ్చే ఏడాది రూ.10,000 వరకు పెరగనుందని కంపెనీ తెలియజేసింది. అయితే ప్రస్తుతం ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా దీనిపై రూ.5000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు పేర్కొంది.
వింటర్లో మీ బైక్‌కు సెల్ఫ్ స్టార్ట్ ప్రాబ్లమా? ఈ 5 టిప్స్ పాటిస్తే అంతా సెట్!
ఇప్పుడే కొత్త బైక్ కొనాలా? లేదా 2025 వరకు వెయిట్ చేయాలా? ఏది బెస్ట్ ఆప్షన్?