ETV Bharat / business

నెలనెలా వడ్డీ రూపంలో రాబడి కావాలా? ఈ టాప్​-3 స్కీమ్స్​పై ఓ లుక్కేయండి! - Investment Plan For Monthly Income - INVESTMENT PLAN FOR MONTHLY INCOME

Investment Plan For Monthly Income : సురక్షితమైన పథకాల్లో ఒకేసారి మదుపు చేసి, నెలనెలా వడ్డీ రూపంలో ఆదాయం సంపాదించాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. మీలాంటి వారి కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న 3 ముఖ్యమైన పథకాల గురించి ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

Best Investment plans for monthly income
Investment tips in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 16, 2024, 5:02 PM IST

Investment Plan For Monthly Income : మీరు ఒకేసారి పెద్ద మొత్తంలో మదుపు చేసి, నెలనెలా వడ్డీ రూపంలో ఆదాయం పొందాలని అనుకుంటున్నారా? ఏమాత్రం రిస్క్ తీసుకోవడం మీకు ఇష్టం లేదా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 3 ముఖ్యమైన పథకాల గురించి ఆ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

1. Senior Citizen Savings Scheme : వయోవృద్ధుల కోసం ఈ 'సీనియర్​ సిటిజన్​ సేవింగ్​ స్కీమ్​'ను ప్రవేశపెట్టారు. రిస్క్​ లేకుండా పక్కాగా ఆదాయం లభించే స్కీమ్​ల్లో ఇది ఒకటి.

  • పథకం : ఇది పెద్దల కోసం ఉద్దేశించిన బెస్ట్ స్కీమ్. దీనిలో ఎలాంటి రిస్క్ ఉండదు. పైగా మిగతా పథకాలతో పోలిస్తే వడ్డీ కూడా అధికంగా వస్తుంది.
  • అర్హత : 60 ఏళ్లు నిండిన వారు ఈ స్కీమ్​లో మదుపు చేయవచ్చు.
  • రాబడి : 8.2% వడ్డీ ఇస్తారు.
  • పెట్టుబడి : కనిష్ఠంగా రూ.1,000 నుంచి గరిష్ఠంగా రూ.30 లక్షలు వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
  • వడ్డీ చెల్లింపు : ప్రతి మూడు నెలలకోసారి చొప్పున వడ్డీ చెల్లిస్తారు.
  • వ్యవధి : 5 ఏళ్లు. ఆ తర్వాత కూడా మూడేళ్లు చొప్పున పొడిగించుకోవచ్చు.
  • ఎక్కడ, ఎలా : పోస్టాఫీసు, బ్యాంకు శాఖల్లో ఈ స్కీమ్​ అందుబాటులో ఉంటుంది.
  • పన్ను : మీ మొత్తం ఆదాయంలో రూ.1.5 లక్షల వరకు సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే వచ్చిన వడ్డీకి వర్తించే శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాలి.

2. Post Office Monthly Income Scheme : ఎలాంటి నష్టభయం లేకుండా, పక్కాగా ఆదాయం చేకూర్చే పథకాల్లో పోస్టాఫీస్​ నెలవారీ ఆదాయ పథకం ఒకటి.

  • అర్హత : ఎవరైనా ఇందులో చేరవచ్చు. 10 ఏళ్లకు పైబడిన వారి పేరు మీద సొంత ఖాతానే ఇస్తారు.
  • రాబడి : 7.4% వడ్డీ ఇస్తారు.
  • పెట్టుబడి : కనిష్టంగా రూ.1,000 నుంచి గరిష్ఠంగా రూ.9 లక్షలు; ఉమ్మడిగా రూ.15 లక్షలు వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు.
  • వడ్డీ చెల్లింపు : నెలనెలా వడ్డీ అందిస్తారు.
  • వ్యవధి : 5 ఏళ్లు
  • ఎక్కడ, ఎలా : మీ దగ్గర్లోని పోస్టాఫీసును సంప్రదించి, ఈ స్కీమ్​లో చేరవచ్చు.
  • పన్ను : వచ్చిన వడ్డీపై వర్తించే శ్లాబులను బట్టి పన్ను వర్తిస్తుంది.

3. Tax Saving Fixed Deposits : నెలనెలా వడ్డీ రూపంలో ఆదాయం వస్తూ, పన్ను మినహాయింపులు కూడా కావాలని ఆశించేవారికి ఈ రకమైన ఫిక్స్​డ్ డిపాజిట్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

  • అర్హత : ఎవరైనా ఈ ఫిక్స్​డ్​ డిపాజిట్లలో మదుపు చేయవచ్చు.
  • రాబడి : ఇది బ్యాంకులు అందించే పథకం. కాబట్టి, బ్యాంకులను బట్టి వడ్డీ మారుతుంది. ప్రస్తుతం చాలా బ్యాంకులు సీనియర్‌ సిటిజన్లకు 7.5 శాతం; 60 ఏళ్ల లోపు వారికి 7 శాతం వడ్డీ అందిస్తున్నాయి.
  • పెట్టుబడి : పరిమితి లేదు. కనుక ఎంతైనా మదుపు చేయవచ్చు.
  • వ్యవధి : 5 ఏళ్లు
  • ఎక్కడ, ఎలా : ఏదైనా బ్యాంకు శాఖను సంప్రదించి, ఇందులో మదుపు చేయవచ్చు.
  • పన్ను : మీ మొత్తం పెట్టుబడిపై రూ.1.5 లక్షల వరకూ సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపును క్లెయిం చేసుకోవచ్చు. వచ్చిన వడ్డీకి వర్తించే పన్ను శ్లాబులను బట్టి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

రీఫండ్ కోసం చూస్తుంటే - 'డిఫెక్టివ్ ఐటీఆర్' నోటీస్​ వచ్చిందా? సింపుల్​గా కరెక్ట్ చేసుకోండిలా! - How To Correct Defective ITR

రూ.2లక్షల్లో మంచి టూ-వీలర్​ కొనాలా? త్వరలో లాంఛ్ కానున్న టాప్-10 మోడల్స్ ఇవే! - Upcoming Bikes Under 2 Lakh

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.