Best Bikes Under 1 Lakh : మీరు రూ.1 లక్ష బడ్జెట్లో ఇంటిల్లపాదికీ ఉపయోగపడే మంచి టూ-వీలర్ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో లేటెస్ట్ ఫీచర్స్‌తో, మంచి మైలేజ్ ఇచ్చే బైక్స్ & స్కూటీస్ చాలానే ఉన్నాయి. వాటిలో మీ బడ్జెట్లో లభిస్తున్న టాప్-10 మోడల్స్‌పై ఓ లుక్కేద్దాం రండి.
1. Honda SP 125 : మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కొనాలని అనుకునేవారికి హోండా ఎస్‌పీ 125 మంచి ఆప్షన్ అవుతుంది. ఈ బైక్ 2 వేరియంట్లలో, 5 అందమైన రంగుల్లో లభిస్తుంది. ఈ బైక్‌లో 124 సీసీ BS6 ఇంజిన్ ఉంటుంది. ఇది 10.72 bhp పవర్, 10.9 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. మార్కెట్లో దీనికి పోటీగా టీవీఎస్ రైడర్ 125, హీరో గ్లామర్ ఉన్నాయి.
- ఇంజిన్ - 124 సీసీ
- మైలేజ్ - 65 కి.మీ/ లీటర్
- ట్రాన్స్‌మిషన్ - 5 స్పీడ్ మాన్యువల్
- కెర్బ్ వెయిట్ - 116 కేజీలు
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 11.2 లీటర్లు
Honda SP 125 Price : మార్కెట్లో ఈ హోండా బైక్ ధర సుమారుగా రూ.88,343 - రూ.92,343 రేంజ్‌లో ఉంది.
2. TVS Raider 125 : ఇండియాలోని మోస్ట్ పాపులర్ బైక్‌ల్లో టీవీఎస్ రైడర్ 125 ఒకటి. ఈ బైక్ 5 వేరియంట్లలో, 11 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ బైక్‌లో 124.8 సీసీ BS6 ఇంజిన్ ఉంటుంది. ఇది 11.2 bhp పవర్, 11.2 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. మార్కెట్లో దీనికి పోటీగా బజాజ్ పల్సర్ 125, హోండా ఎస్‌పీ 125 ఉన్నాయి.
- ఇంజిన్ - 124.8 సీసీ
- మైలేజ్ - 56.7 కి.మీ/ లీటర్
- ట్రాన్స్‌మిషన్ - 5 స్పీడ్ మాన్యువల్
- కెర్బ్ వెయిట్ - 123 కేజీలు
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 10 లీటర్లు
TVS Raider 125 Price : మార్కెట్లో ఈ టీవీఎస్ రైడర్ 125 బైక్ ధర రూ.89,366 - రూ.1,08,213 ప్రైస్ రేంజ్‌లో ఉంది.
3. Hero Xtreme 125R : రూ.1 లక్ష లోపు మంచి బైక్ కొనాలని అనుకునేవారికి హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ మంచి ఛాయిస్ అవుతుంది. ఈ బైక్ 2 వేరియంట్లలో, 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ బైక్‌లో 124.7 సీసీ BS6 ఇంజిన్ ఉంటుంది. ఇది 11.4 bhp పవర్, 10.5 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. మార్కెట్లో దీనికి పోటీగా బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్ 125, టీవీఎస్ రైడర్ 125 ఉన్నాయి.
- ఇంజిన్ - 124.7 సీసీ
- మైలేజ్ - 66 కి.మీ/ లీటర్
- ట్రాన్స్‌మిషన్ - 5 స్పీడ్ మాన్యువల్
- కెర్బ్ వెయిట్ - 136 కేజీలు
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 10 లీటర్లు
Hero Xtreme 125R Price : మార్కెట్లో ఈ హీరో బైక్ ధర రూ.97,666 - రూ.1,03,316 ప్రైస్ రేంజ్‌లో ఉంది.
4. Bajaj Freedom : ప్రపంచంలోని మొదటి సీఎన్‌జీ బైక్ బజాజ్ ఫ్రీడమ్. ఈ బైక్ 3 వేరియంట్లలో, 7 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ బైక్‌లో 125 సీసీ BS6 ఇంజిన్ ఉంటుంది. ఇది 9.3 bhp పవర్, 9.7 Nm టార్క్ జనరేట్ చేస్తుంది.
- ఇంజిన్ - 125 సీసీ
- ఫ్యూయెల్ టైప్ - సీఎన్‌జీ
- రైడింగ్ రేంజ్ - 330 కి.మీ: 2కేజీ సీఎన్‌జీ - 200 కి.మీ; 2 లీటర్స్ పెట్రోల్ - 130 కి.మీ
- ట్రాన్స్‌మిషన్ - 5 స్పీడ్ మాన్యువల్
- కెర్బ్ వెయిట్ - 149 కేజీలు
Bajaj Freedom Price : మార్కెట్లో ఈ బజాజ్ బైక్ ధర రూ.95,055 - రూ.1,10,055 ప్రైస్ రేంజ్‌లో ఉంది.
5. Honda Activa 6G : భారతదేశంలోని మోస్ట్ పాపులర్ స్కూటీల్లో హోండా యాక్టివా 6జీ ఒకటి. ఇది 3 వేరియంట్లలో, 7 అందమైన రంగుల్లో లభిస్తుంది. ఈ స్కూటీలో 109.51 సీసీ BS6 ఇంజిన్ ఉంటుంది. ఇది 7.73 bhp పవర్, 8.90 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. మార్కెట్లో దీనికి టీవీఎస్ జూపిటర్, సుజుకి యాక్సెస్ 125 నుంచి గట్టిపోటీ ఉంది.
- ఇంజిన్ - 109.51 సీసీ
- మైలేజ్ - 47 కి.మీ/లీటర్
- ట్రాన్స్‌మిషన్ - 5 స్పీడ్ మాన్యువల్
- కెర్బ్ వెయిట్ - 106 కేజీలు
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 5.3 లీటర్స్
- టాప్ స్పీడ్ - 85 కి.మీ/ గంట
Honda Activa 6G Price : మార్కెట్లో ఈ హోండా యాక్టివా 6జీ స్కూటీ ధర రూ.79,327 - రూ.84,356 ప్రైస్ రేంజ్‌లో ఉంది.
6. TVS Jupiter : తక్కువ బడ్జెట్లో మంచి స్కూటర్ కొనాలని అనుకునేవారికి టీవీఎస్ జూపిటర్ మంచి ఎంపిక అవుతుంది. ఇది 4 వేరియంట్లలో, 6 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్కూటీలో 113.3 సీసీ BS6 ఇంజిన్ ఉంటుంది. ఇది 7.91 bhp పవర్, 9.8 Nm టార్క్ జనరేట్ చేస్తుంది.
- ఇంజిన్ - 113.3 సీసీ
- మైలేజ్ - 46 కి.మీ/లీటర్
- ట్రాన్స్‌మిషన్ - 5 స్పీడ్ మాన్యువల్
- కెర్బ్ వెయిట్ - 106 కేజీలు
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 5.1 లీటర్స్
TVS Jupiter Price : మార్కెట్లో ఈ టీవీఎస్ జూపిటర్ స్కూటీ ధర రూ.78,502 - రూ.89,951 ప్రైస్ రేంజ్‌లో ఉంది.
7. Suzuki Access 125 : మంచి మైలేజ్ ఇచ్చే స్కూటర్ కొనాలని అనుకునేవారికి సుజుకి యాక్సెస్ 125 మంచి ఎంపిక అవుతుంది. ఇది 4 వేరియంట్లలో, 17 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్కూటీలో 124 సీసీ BS6 ఇంజిన్ ఉంటుంది. ఇది 8.6 bhp పవర్, 10 Nm టార్క్ జనరేట్ చేస్తుంది.
- ఇంజిన్ - 124 సీసీ
- మైలేజ్ - 45 కి.మీ/లీటర్
- కెర్బ్ వెయిట్ - 103 కేజీలు
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 5 లీటర్స్
Suzuki Access 125 Price : మార్కెట్లో ఈ సుజుకి యాక్సెస్ 125 స్కూటీ ధర రూ.83,062 - రూ.93,796 ప్రైస్ రేంజ్‌లో ఉంది.
8. Honda Shine : రూ.90వేలు బడ్జెట్‌లోపు లభిస్తున్న బెస్ట్ టూ-వీలర్స్‌లో హోండా షైన్ ఒకటి. ఈ బైక్ 2 వేరియంట్లలో, 5 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ బైక్‌లో 123.94 సీసీ BS6 ఇంజిన్ ఉంటుంది. ఇది 10.59 bhp పవర్, 11 Nm టార్క్ జనరేట్ చేస్తుంది.
- ఇంజిన్ - 123.94 సీసీ
- మైలేజ్ - 55 కి.మీ/ లీటర్
- ట్రాన్స్‌మిషన్ - 5 స్పీడ్ మాన్యువల్
- కెర్బ్ వెయిట్ - 113 కేజీలు
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 10.5 లీటర్లు
Honda Shine Price : మార్కెట్లో ఈ హోండా షైన్ బైక్ ధర సుమారుగా రూ.82,065 - రూ.86,067 వరకు ఉంటుంది.
9. Bajaj Pulsar 125 : రూ.1 లక్ష బడ్జెట్లో మంచి మోటార్ సైకిల్ కొనాలని అనుకునేవారికి బజాజ్ పల్సర్ 125 మంచి ఆప్షన్ అవుతుంది. ఈ బైక్ 6 వేరియంట్లలో, 8 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ బైక్‌లో 124.4 సీసీ BS6 ఇంజిన్ ఉంటుంది. ఇది 11.64 bhp పవర్, 10.8 Nm టార్క్ జనరేట్ చేస్తుంది.
- ఇంజిన్ - 124.4 సీసీ
- మైలేజ్ - 50 కి.మీ/ లీటర్
- ట్రాన్స్‌మిషన్ - 5 స్పీడ్ మాన్యువల్
- కెర్బ్ వెయిట్ - 140 కేజీలు
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 11.5 లీటర్లు
Bajaj Pulsar 125 Price : మార్కెట్లో ఈ బజాజ్ పల్సర్ 125 బైక్ ధర సుమారుగా రూ.85,861 - రూ.95,969 వరకు ఉంటుంది.
10. Hero HF Deluxe : రూ.70వేలు బడ్జెట్లో మంచి బైక్ కొనాలని అనుకునేవారికి హీరో హెచ్‌ఫ్ డీలక్స్ మంచి ఛాయిస్ అవుతుంది. ఈ బైక్ 5 వేరియంట్లలో, 7 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ బైక్‌లో 97.2 సీసీ BS6 ఇంజిన్ ఉంటుంది. ఇది 7.9 bhp పవర్, 8.05 Nm టార్క్ జనరేట్ చేస్తుంది.
- ఇంజిన్ - 97.2 సీసీ
- మైలేజ్ - 65 కి.మీ/ లీటర్
- ట్రాన్స్‌మిషన్ - 4 స్పీడ్ మాన్యువల్
- కెర్బ్ వెయిట్ - 110 కేజీలు
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 9.1 లీటర్లు
Hero HF Deluxe Price : మార్కెట్లో ఈ హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్ ధర సుమారుగా రూ.56,582 - రూ.68,969 వరకు ఉంటుంది.
రూ.9 లక్షల బడ్జెట్లో మంచి కారు కొనాలా? టాప్-10 మోడల్స్ ఇవే!
దీపావళికి కారు కొనాలా? ఆ మోడల్‌పై రూ.2.30 లక్షలు డిస్కౌంట్- మిగిలిన వాటిపై ఎంతంటే?