Bank Holidays In April 2024 : ఆర్బీఐ ఈ 2024 ఏప్రిల్ నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం, దేశంలోని వివిధ బ్యాంకులకు ఏకంగా 14 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. ఈ సెలవుల్లో జాతీయ సెలవులు సహా, కొన్ని ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. అందువల్ల కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, తమ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడం మంచిది.
2024 ఏప్రిల్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితా
List of Bank Holidays In April 2024 :
- ఏప్రిల్ 1 (సోమవారం) : ఇయర్లీ క్లోజింగ్ (పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)
- ఏప్రిల్ 5 (శుక్రవారం) : బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, జుమత్-ఉల్-విదా (పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)
- ఏప్రిల్ 7 (ఆదివారం) :
- ఏప్రిల్ 9 (మంగళవారం) : ఉగాది, గుధిపరా, సాజిబు నొంగ్మపన్బా (పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)
- ఏప్రిల్ 10 (బుధవారం) : రంజాన్ (కేరళలోని బ్యాంకులకు సెలవు)
- ఏప్రిల్ 11 (గురువారం) : రంజాన్, 1వ షావాల్ (పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)
- ఏప్రిల్ 13 (శనివారం) : రెండో శనివారం, చైరోబా, బోహోగ్ బిహు, బిజు పండుగ, బైశాఖి పండుగ
- ఏప్రిల్ 14 (అదివారం) :
- ఏప్రిల్ 15 (సోమవారం) : బోహాగ్ బిహు/ హిమాచల్ డే (అసోం, మధ్యప్రదేశ్లోని బ్యాంకులకు సెలవు.)
- ఏప్రిల్ 17 (బుధవారం) : శ్రీరామనవమి (పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)
- ఏప్రిల్ 20 (శనివారం) : గరియా పూజ సందర్భంగా త్రిపురలోని బ్యాంకులకు సెలవు.
- ఏప్రిల్ 21 (ఆదివారం) :
- ఏప్రిల్ 27 (శనివారం) : నాల్గో శనివారం
- ఏప్రిల్ 28 (ఆదివారం) :
సెలవు దినాల్లో ఆర్థిక లావాదేవీలు జరపడం ఎలా?
How To Make Transactions In Bank Holidays : ఏప్రిల్ నెలలో 14 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతూనే ఉంటాయి. అలాగే యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలు కూడా ఎప్పటిలానే నడుస్తాయి. కనుక బ్యాంకులకు వెళ్లకుండానే సులువుగా మీ ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టుకోవచ్చు.
త్వరగా అప్పులన్నీ తీర్చేయాలా? స్నోబాల్ వ్యూహాన్ని అనుసరించండిలా! - Snowball Strategy