ETV Bharat / business

ATM యూజర్లకు బ్యాడ్​న్యూస్​! పెరగనున్న క్యాష్​ విత్​డ్రా ఛార్జీలు​! - ATM Cash Withdrawal Charges

ATM Cash Withdrawal Charges Increase : ఏటీఎం వినియోగదారులకు అలర్ట్. పరిమితికి మించి చేసే ట్రాన్సక్షన్స్​పై ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. మరికొద్ది రోజుల్లో ఈ సిఫార్సులకు ఆర్​బీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ATM Cash Withdrawal Charges Increase
ATM Cash Withdrawal Charges Increase (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 13, 2024, 5:00 PM IST

ATM Cash Withdrawal Charges Increase : ఏటీఎం నుంచి ప‌రిమితికి మించి చేసే ట్రాన్సాక్షన్స్​పై వినియోగదారులకు విధించే ఛార్జీలు పెరిగే అవ‌కాశ‌ముంది. క్యాష్ విత్​డ్రాపై కస్టమర్లు చెల్లించే ఇంటర్​ఛేంజ్ ఫీజును పెంచాలని కోరుతూ దేశంలోని ఏటీఎం ఆపరేటర్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

ఆర్​బీఐకి విజ్ఞప్తి
వ్యాపారం కోసం మరిన్ని నిధులను పొందటానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (CATMI) ఇంటర్​ఛేంజ్ ఫీజును ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.23కు పెంచాలని పేర్కొంది. రెండేళ్ల క్రితం ఇంటర్​ఛేంజ్ ఫీజును రేటును చివరిసారిగా పెంచినట్లు ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టాన్లీ జాన్సన్ వెల్లడించారు. 'మేము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సంప్రదించాం. ఏటీఎంలో క్యాష్ విత్​డ్రాపై కస్టమర్లు చెల్లించే ఇంటర్​ఛేంజ్ ఫీజును పెంచాలని మేము చేసిన అభ్యర్థనను ఆర్​బీఐ సానుకూలంగా స్పందించింది. ఈ ఫీజును CATMI రూ.21 పెంచాలని ప్రతిపాదించగా, మరికొందరు ఏటీఎం ఆపరేటర్లు రూ.23కు పెంచాలని కోరారు. ఇంతకుముందు ఇంటర్​ఛేంజ్ ఫీజులను పెంచి చాలా ఏళ్లు అయ్యింది.' అని స్లాన్సీ జాన్సన్ పేర్కొన్నారు.

"ఏటీఎం ఛార్జీలు పెంచడానికి చాలా చర్చలు జరుగుతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ) ద్వారా ఒక ప్రతినిధి బృందం ఏర్పాటైంది. ఈ బృందం ఛార్జీలు పెంచడానికి బ్యాంకులతో చర్చలు జరిపింది. బ్యాంకులు కూడా ఛార్జీలు పెంచడానికి అంగీకరించాయి." అని ఒక ఏటీఎం తయారీ సంస్థ తెలిపింది.

కాగా, 2021లో ఏటీఎం లావాదేవీలపై ఇంటర్​ఛేంజ్ ఫీజు రూ.15 నుంచి రూ.17కు పెంచారు. ఏటీఎం ఆపరేటర్ల అభ్యర్థన మేరకు ఆర్​బీఐ గ్రీన్ సిగ్నల్ ఇస్తే అది రూ.23కు చేరుతుంది.

లిమిట్ దాటితే ఛార్జీలు
ఏటీఎం ఛార్జెస్ అనేవి లిమిట్ దాటితే వర్తిస్తాయి. సాధారణంగా ఒక వ్యక్తి ఏటీఎం నుంచి ఉచితంగా నెలకు ఐదు సార్లు నగదును విత్‌ డ్రా చేసుకోవచ్చు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్​కతా, ముంబయి, దిల్లీ వంటి ఆరు ప్రధాన నగరాల్లో బ్యాంకులు తమ సేవింగ్స్ ఖాతాదారులకు నెలకు కనీసం ఐదు ఉచిత లావాదేవీలను అందిస్తున్నాయి. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు మూడు లావాదేవీలు ఉచితంగా అందిస్తున్నాయి. ఈ లిమిట్ దాటితే ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.

మొబైల్ వినియోగదారులకు షాక్! ఇక నుంచి ఫోన్ నంబరుకు ఫీజు కట్టాల్సిందే! - Fee for Mobile Numbers

మార్కెట్​లో వీటిని కొట్టే మోడల్ లేదు! టాప్​-10 ఆల్​ టైమ్​ బెస్ట్ సెల్లింగ్ కార్స్ ఇవే! - Best Selling Cars Of All Time

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.