Motor Insurance Buying Tips : మీరు ఆఫ్‌లైన్‌లో కారు లేదా బైక్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ఆఫ్‌లైన్‌లో వాహన బీమా తీసుకుంటే, మనకు తెలియకుండానే అనేక పొరపాట్లు చేసే అవకాశం ఉంది. అవేంటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
భారతదేశంలో మోటార్ ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. అంటే కారు కొనాలన్నా లేదా బైక్ కొనాలన్నా కచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే. దీని వల్ల వాహన ప్రమాదాలు, డ్యామేజ్లు, ఆర్థిక నష్టాలు ఏర్పడినప్పుడు మీకు బీమా రక్షణ లభిస్తుంది. కానీ చాలా మంది ఈ ఇన్సూరెన్స్ తీసుకునే విషయంలో తెలిసీ, తెలియక అనేక పొరపాట్లు చేస్తుంటారు. ముఖ్యంగా ఆఫ్‌లైన్‌లో బీమా పాలసీ తీసుకునేటప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తుంటారు. దీని వల్ల మీకు ఇన్సూరెన్స్ ఉన్నట్లే కనిపిస్తుంది కానీ, క్లెయిమ్ చేసేటప్పుడు అనుకున్న దానికంటే చాలా తక్కువ పరిహారం వస్తుంది. లేదా కొన్ని సార్లు క్లెయిమే రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆఫ్‌లైన్‌లో ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చేయకూడని పొరపాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. అవసరమైన దానికంటే ఎక్కువగా చెల్లించడం!
ఆఫ్‌లైన్‌లో వాహన బీమా తీసుకునేటప్పుడు మీరు కచ్చితంగా ఏజెంట్ ఫీజు, ఆపరేషనల్ కాస్ట్‌లు చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల మీపై అనవసరపు ఆర్థిక భారం పడుతుంది. అదే మీరు ఆన్లైన్లో ఇన్సూరెన్స్ తీసుకుంటే, ఇలాంటి ఖర్చులు ఏమీ ఉండవు. పైగా మీకు తక్కువ ధరకే, బెటర్ డీల్ లభించే అవకాశం ఉంటుంది. కనుక ఆన్లైన్లో తక్కువ డబ్బులతోనే పూర్తి స్థాయి బీమా తీసుకోవడానికి వీలవుతుంది.
2. సరిపోల్చుకునే అవకాశం ఉండదు!
మార్కెట్లో అనేక రకాల మోటార్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉంటాయి. వీటిని ఆన్లైన్లో చూసి బేరీజు వేసుకుని సరైనది ఎంచుకోవాలి. కానీ చాలా మంది ఏజెంట్ చెప్పిన బీమా పాలసీ మాత్రమే తీసుకుంటూ ఉంటారు. దీని వల్ల కూడా వాహనదారులు నష్టపోతూ ఉంటారు. వాస్తవానికి మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో, అదనపు ప్రయోజనాలతో, తక్కువ ధరకే ఇన్సూరెన్స్ ప్లాన్లు అందుబాటులోకి వస్తుంటాయి. ఆన్లైన్లో మీరు వీటిని సబ్‌స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ చాలా మందికి ఈ విషయం తెలియక, తాము తీసుకున్న బీమా పాలసీనే ఎలాంటి అదనపు ప్రయోజనాలు లేకపోయినా కొనసాగిస్తూ ఉంటారు. దీని వల్ల తమకు తెలియకుండానే నష్టపోతూ ఉంటారు. అందుకే ఆన్లైన్లోనే కారు లేదా బైక్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది.
3. ఏజెంట్లపై ఆధారపడకూడదు!
చాలా మంది ఏజెంట్లపై ఆధారపడుతుంటారు. వారు చెప్పిన ఇన్సూరెన్స్నే తీసుకుంటూ ఉంటారు. కానీ ఇది ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే కొంత మంది ఏజెంట్లు తమకు కమీషన్ వస్తుందనే ఆశతో అనవసరపు పాలసీలను, లేదా తక్కువ బెనిఫిట్స్ ఉండే పాలసీలను మీకు అంటగడతారు. వీటి వల్ల భవిష్యత్‌లో మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.
4. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చూడాలి!
ఇన్సూరెన్స్ తీసుకునే ముందు కచ్చితంగా సదరు బీమా కంపెనీకి చెందిన క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోను చూడాలి. ఆఫ్‌లైన్‌లో ఇది సాధ్యం కాదు. కనుక ఆన్‌లైన్‌లోకి వెళ్లి సదరు బీమా కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, సర్వీస్ క్వాలిటీ, రెప్యుటేషన్లను కచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే మీకు సరైన సమయానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిహారం అందుతుంది.
5. టైమ్ ఈజ్ మనీ
ఆఫ్‌లైన్‌లో ఇన్సూరెన్స్ పేపర్లు నింపాలి. వాటిని ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్లి అందించాలి. వారు దానిని ప్రాసెస్ చేయాలి. దీనికంతటికీ చాలా సమయం పడుతుంది. దీని వల్ల మీ విలువైన కాలం వృధా అవుతుంది. పైగా అదనంగా డబ్బులు ఖర్చు అవుతాయి. ఆన్‌లైన్‌తో పోల్చితే ఎక్కువ ప్రీమియం కూడా చెల్లించాల్సి వస్తుంది. అదే మీరు ఆన్లైన్లో అయితే చాలా సులువుగా బీమా పాలసీ తీసుకునే విలుంటుంది. పైగా తక్కువ ప్రీమియంకే ఇన్సూరెన్స్ లభిస్తుంది.
నోట్ : ఈ ఆర్టికల్‌లో చెప్పిన అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కచ్చితంగా మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.
మీ బైక్ మైలేజ్ తగ్గిపోయిందా? డోంట్ వర్రీ - ఈ 5 టిప్స్ మీ కోసమే!