Apple Spyware Warning : యాపిల్ సంస్థ తమ వినిమోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. మెర్సినరీ స్పైవేర్ ద్వారా సైబర్ దాడులు జరిగే ప్రమాదం ఉందని భారత్ సహా 91 దేశాల వినియోగదారులను హెచ్చరిస్తూ ఒక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. పెగాసస్ మాల్వేర్ గురించి కూడా ఆ నోటిఫికేషన్లో ఉంది.
థ్రెట్ నోటిఫికేషన్
ఇప్పటికే మెర్సినరీ స్పైవేర్ ద్వారా పలువురి ఐఫోన్ సహా ఇతర ఉత్పత్తుల్లోకి సైబర్ నేరగాళ్లు చొరబడినట్లు గుర్తించామని యాపిల్ వెల్లడించింది. ఎప్పుడు, ఎవరిపై ఈ సైబర్ దాడులు చేస్తారనేది ముందుగా గుర్తించడం కష్టమైనప్పటికీ, జరుగుతాయని మాత్రం కచ్చితంగా చెప్పగలమని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు యూజర్లను అప్రమత్తం చేయటం సహా తగిన జాగ్రత్తలు సూచిస్తూ నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపాయి. 'ఇటువంటి దాడులు సాధారణ సైబర్ నేరాల పెగాసస్ మాల్వేర్ కంటే క్లిష్టంగా ఉంటాయి. ఎందుకంటే ఎన్ఎస్ఓ గ్రూపు తయారు చేసిన ఈ స్పైవేర్ దాడికి పాల్పడేవారు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు, అలాగే ఈ దాడులకు మిలియన్ల డాలర్ల ఖర్చు అవుతుంది. ఈ దాడులను గర్తించడం అంత సులువైన విషయం కాదు. కానీ, ఎక్కువ శాతం యూజర్లను మాత్రం ఈ స్పైవేర్‌తో టార్గెట్ చేయరు' అని కంపెనీ వెల్లడిచింది.
ఇది రెండోసారి
యాపిల్ కంపెనీ ఇలా హెచ్చరికలు చేయడం ఇటీవలి కాలంలో రెండోసారి. గతేడాది అక్టోబర్‌లో భారతదేశంలోని పలువురు సెలబ్రెటీలు, ప్రతిపక్ష నేతలను అప్రమత్తం చేసింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా, టీఎంసీ లీడర్ మహువా మొయిత్రా ఫోన్లలో పెగాసస్ స్పైవేర్ చేరిందని హెచ్చరించింది.
150 దేశాలకు హెచ్చరిక
మెర్సినరీ స్పైవేర్ దాడులు పెగాసస్ అభివృద్ధి చేసిన ఎన్ఎస్ఓ వంటి ప్రైవేటు కంపెనీలు సహా ప్రభుత్వాలతో సంబంధం కలిగి ఉన్నాయని యాపిల్ పేర్కొంది. 'చాలా తక్కువ సంఖ్యలో వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ తరచూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలపై స్పైవేర్ దాడులు కొనసాగుతున్నాయి. 2021 నుంచి మేము ఈ దాడులను గుర్తించాం. ఈ సంవత్సరంలో అనేక సార్లు హెచ్చరిక నోటిఫికేషన్లు పంపాం. ఇప్పటి వరకు మొత్తం 150 దేశాల వినియోగదారులకు తెలిపాం' అని యాపిల్ సంస్థ పేర్కొంది.
మొబైల్ యూజర్స్‌కు షాక్- రీఛార్జ్ ధరలు భారీగా పెంపు! - mobile recharge rate increase