Airtel Revised Mobile Tariffs : ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ టారిఫ్ రేట్లను పెంచనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రిలయన్స్ జియో రీఛార్జి రేట్లను 12-15 శాతం పెంచుతున్నట్లు వెల్లడించింది. తాజాగా ఎయిర్‌టెల్ కూడా టారిఫ్‌లపై 10-21 శాతం పెరుగుదల ఉంటుందని పేర్కొంది. జులై 3 నుంచి పెంపు వర్తించనుంది.
ఒక్కో వినియోగదారుడిపై వచ్చే ఆదాయం (ARPU) రూ.300కు పైగా ఉండాల్సిన అవసరం ఉందని ఎయిర్ టెల్ వెల్లడించింది. అందులోభాగంగానే టారిఫ్‌లను పెంచుతున్నట్లు తెలిపింది. పెంపు ద్వారా వచ్చిన ఆదాయాన్ని మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగిస్తామని పేర్కొంది. పెంపు రోజుకు 70 పైసల కంటే తక్కువే ఉందని వివరించింది.
ప్రీపెయిడ్ సహా పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలను సైతం ఎయిర్‌టెల్ సవరించింది. అందులో 3 ప్రీపెయిడ్ అన్లిమిటెడ్ వాయిస్ ప్లాన్లు, 9 ప్రీపెయిడ్ డెయిలీ డేటా ప్లాన్లు, 3 ప్రీపెయిడ్ డేటా యాడ్-ఆన్ ప్లాన్లు, 4 పోస్ట్ పెయిడ్ ప్లాన్లు ఉన్నాయి. అయితే ఈ ప్లాన్లతో వచ్చే కాల్ మినిట్స్, ఫ్రీ డేటా వంటి బెనిఫిట్స్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. సవరించిన టారిఫ్
కొత్త/పాత ధరలు ఇవే :
అన్లిమిటెడ్ వాయిస్ ప్లాన్స్ | |||
---|---|---|---|
ప్లాన్/ పాత ధర | వ్యాలిడిటి | బెనిఫిట్స్ | సవరించిన ధర |
రూ.179 | 28(రోజులు) | 2GB data, UL Calling, 100 SMS/day | 199 |
రూ.455 | 84 | 6GB data, UL calling, 100SMS/day | 509 |
రూ.1799 | 365 | 24GB data, UL calling, 100 SMS/day | 1999 |
డెయిలీ ప్లాన్స్ | |||
ప్లాన్/ పాత ధర | వ్యాలిడిటి | బెనిఫిట్స్ | సవరించిన ధర |
రూ. 265 | 28(రోజులు) | 1GB/day, UL Calling, 100 SMS/day | రూ.299 |
రూ.299 | 28 | 1.5GB/day, UL Calling, 100 SMS/day | రూ.349 |
రూ.359 | 28 | 2.5GB/day, UL Calling, 100 SMS/day | రూ.409 |
రూ.399 | 28 | 3GB/day, UL Calling, 100 SMS/day | రూ.449 |
రూ.479 | 56 | 1.5GB/day, UL Calling, 100 SMS/day | రూ.579 |
రూ.549 | 56 | 2GB/day, UL Calling, 100 SMS/day | రూ.649 |
రూ.719 | 84 | 1.5GB/day, UL Calling, 100 SMS/day | రూ.859 |
రూ.839 | 84 | 2GB/day, UL Calling, 100 SMS/day | రూ.979 |
రూ.2999 | 365 | 2GB/day, UL Calling, 100 SMS/day | రూ.3599 |
డేటా యాడ్-ఆన్స్ | |||
ప్లాన్/ పాత ధర | వ్యాలిడిటి | బెనిఫిట్స్ | సవరించిన ధర |
రూ.19 | 1(రోజులు) | 1GB | రూ.22 |
రూ.29 | 1 | 2GB | రూ.33 |
రూ.65 | ప్లాన్ వ్యాలిడిటీ | 4GB | రూ.77 |
పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు
- రూ.449 ప్లాన్: ఈ ప్లాన్ రోల్‌ఓవర్, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు, ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో 40GB డేటాను అందిస్తుంది.
- రూ.549 ప్లాన్: ఇది రోల్‌ఓవర్‌తో 75GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు, ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం, 12 నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్, 6 నెలలు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
- రూ.699 ప్లాన్: కుటుంబాల కోసం, ఈ ప్లాన్‌లో 105GB డేటా రోల్‌ఓవర్, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు, ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం, 12 నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్, 6 నెలలు అమెజాన్ ప్రైమ్, 2 కనెక్షన్‌ల కోసం వింక్ ప్రీమియం ఉన్నాయి.
- రూ.1,199 ప్లాన్: పెద్ద కుటుంబాలకు, ఈ ప్లాన్ రోల్‌ఓవర్‌తో 190GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు, ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం, డిస్నీ+ హాట్‌స్టార్ 12 నెలల పాటు, అమెజాన్ ప్రైమ్ 4 కనెక్షన్‌లకు అందిస్తుంది.
ఈ కొత్త టారిఫ్‌లు భారతి హెక్సాకామ్ లిమిటెడ్‌తో సహా అన్ని సర్కిళ్లకు వర్తిస్తాయి. సవరించిన ధరలు జూలై 3 నుంచి ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
Airtel announces revised mobile tariffs. These prices apply to all circles, including Bharti Hexacom Ltd. Circles. The new tariffs for all Airtel plans will be available on https://t.co/jASVh3skYf. in starting July 3rd, 2024. pic.twitter.com/3GL5vTF1xr
— ANI (@ANI) June 28, 2024